మన"లో పల-బయట"

ఒక్కోసారి ఎంత సహజం గా, ఎంత స్థిమితం గా ఉండామనుకున్నా మనసు ఉండనీయదు.
లేదూ మనమే మనసు కుదురుగా ఉంచమేమో!
అన్నట్టూ... మనమూ, మనసూ వేర్వేరా?
ఏమో!
మనసుకు మనం ఆశ్రయం ఇస్తున్నామా? లేక, మనసు దీపాన్ని పెట్టడానికే ఈ దేహమనే గుడి ఉందా?
అసలింతకీ మనసనేది ఒకటి ఉందా? లేకపోతే, ఈ ప్రసన అడగటం మనకు మనసులేనితనం అవుతుందా?
ఆలోచిస్తూ ఉంటె ఎక్కడో చిక్కు పడుతూ ఉన్తయివనీ. మల్లీ కళ్ళు పెద్దగా విప్పారుతూ, ఒక్కో ఆలోచనా దారపు ముడి సున్నితం గా విప్పుతూ, అందులో తెలుసుకున్న విషయాల పట్ల తెలియని ఆనందం పొందుతూ ఉంటే... ఒక థ్రిల్.
కాకపోతే, ఇవనీ ఎంతవరకు అంటే, అలౌకిక, పారలౌకిక విషయాల వరకే... లౌకిక ముడులు తెంచుకోవడం లో చాలా మందికి సున్నా మార్కులు పడొచ్చు..
మనం చుక్కల్ని గురించి శోధిస్తూ ఉన్దోచ్చుగాక, పక్కింటి వాడు పెట్టె ఇబ్బందిని ఎదుర్కోడం లో విఫలమవుతుంటాం..
మనం దేవుడి ఉనికి గురించి బల్లగుద్ది వాదిస్తూ ఉండచ్చుగాక, "వ్యవహారం" అనేసరికి గుల్లబారిపోతూ ఉంటాం.
ఇలాంటప్పుడు మన అలౌకిక జ్ఞానం అంతా అబద్దమై, మనసు ఉన్నదా లేదా అన్న ప్రశ్న మాయమై, అలజడి, ఆందోళన, భయం, గుండె దడ, చిరు చెమట, నెత్తుటి వేగం....ఇవి మాత్రమే నికాస్సయిన నిజాలుగా తేలుతాయి.
అనుకుంటాంగానీ, బయటి పరిస్థితులే "లోపలి"ని శాసిస్తాయి.
కాకపోతే ఒకటే ఊరట. ఈ లోపలి గట్టితనం వల్లే బయటి పరిస్థితులకు చలించకుండా ఉండగలుగుతాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.