నాకిది మామూలే..!!

తీగ తెగిన తేగల తెగింపులు
తెల్లారేదాకా తీరుబడిగా తీటతీర్చుకునే
తిక్క తోటల్లో తైతెక్కలాడుతున్నాయని
ఆ తిమ్మప్ప తిరగకుండానే తిన్నగా
తిట్టింతిట్టు తిట్టకుండా తిట్టి
నా బుర్రలో కాపురముంటున్న బుద్ది కి
అంకాస్త ప్యారా గడ్డి పారేసిపోయాడు..
పోనీలే.., ఇకనైనా కలనైనా కంచెదాటి
నా కలల స్థాయితోటి స్నేహం పోటీ పెట్టుకుంటుందని
తెలిసొచ్చింది.. అయినా యదవ బుద్దికి బుద్దెక్కడుందీ..?
మళ్ళీ మొదలులేని ఇక మరువలేని ఆ మట్టి బురదలోకి కాలుపెడుతూనే ఉంటుంది..
నాకిది మామూలే..!!
నమ్మినవాళ్ళే కదా మోసం చేయగలిగేది..!!
- సత్యం గడ్డమణుగు, 15-12-2015, 12:29am

బాహుబలి భారతీయ చిత్రమే..!!

అప్పుడప్పుడూ ఇంగ్లీషు సినిమాలు చూస్తూ ఉంటాను.(మా తమ్ముడు బలవంతంగా బాగుంటుంది చూడని చూపిస్తే..) అందులో నటుల పేర్లు తెలియవు, కథ ఎమిటో తెలియదు, ఎం జరుగుతుందో ఊహించలేను. చివరికి మాత్రం సినిమా భలే చక్కగా తీశారని మంచి కితాబిచ్చేస్తాను మనసులో.

ఈరోజు బాహుబలి సినిమా కూడా అలాగే చూశాను. చాలా అంటే చాలా నచ్చింది. నెనెక్కడా అసంతృప్తి పొందింది లేదు. ప్రతీ సన్నివేశం కొత్తగా నా గుండెలకు హత్తుకుంది. తరువాతి భాగం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

భారతీయ సినీ పరిశ్రమ జక్కన్న మన రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలే కాదు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ఒక సినీ అభిమానిగా అభినందనలు.

రెండవ భాగం కూడా చూశాక ఈ చిత్రాన్ని గురించి నా పూర్తి భావనలు ఇక్కడ రాస్తాను.

ఇట్లు మీ సత్యంజి.
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.