నేను రాసిన ఈ మొదటి పద్యం మా నాన్నకు అంకితం..!

పొద్దున్నే ఫెసుబుక్కు వాలు మీద బద్దెన గారు రాసిన
 "పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు
పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర

సుమతీ!"
అనే పద్యము చుసిన తరువాత ఎందుకో నా మదిలో మెదిలిన చిన్ని ఆలోచన..
పద్యములు రాద్దాము అని..
అందుకే నా మొట్టమొదటి పద్యాన్ని మా నాన్నగారి గురించి రాస్తున్నాను..!


================================
నేనెంతటి అదృష్ట వంతుండనో గదా
నాకియ్యంత కష్టంబేల వచ్చునోయని
ప్రతి క్షణము పరితపించెడి
తండ్రిని పొందగ, 
సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!
================================ 


"విశ్వదాభిరామ వినుర వేమ"లా.. నా పద్యాలకు 
"సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!" అని పెట్టాలని అనుకున్నాను..!
ఈ నా చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను..!

నీకు నల్లని వాడితోనే సంబందం కుదురుతుంది లే అని కాసేపు ఆ అమ్మయిని ఏడిపించాను..

నా చిన్నప్పుడు మా క్లాసులో భానుచందర్ అని ఒకడుండే వాడు..!
వాడు చదువులో కొంచెం వెనకబడి ఉండేవాడు.. ఐతే ఆశ్చర్యం ఏమంటే వాడు ఎదైనా అంటే అది జరిగిపోయేది..!
ఈ విషయం మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.. ఎలా అంటే "ఈరోజు బస్సు రాదు రా మనం ఆటోలో వెళ్ళాలి" అంటె నిజంగానే బస్సు ఆరోజు రాకపోయేది అదేదొ వాడు బస్సుడిపోలో పనిచేసెవాడిలా.., ఎప్పుడైనా వాడు సరదాగా "ఒరేయ్ నిన్ను ఇవాళ టీచర్ కొడతారు అని అంటె నిజంగానే ఆరొజు తన్నులు తప్పేవి కావు.. ఇదంతా నేను వాడికి దూరంగా ఉండి చూస్తూ ఉండెవాడిని... ఎందుకంటే మళ్ళీ నా గురించి ఏమైనా అంటాడేమో అని..!
మా ఫ్రెండ్సు మాత్రం వాడిని బాగా నమ్మేవాళ్ళు.. కొన్నాళ్ళకు నేను కూడా నమ్మేశాను..
ఆ తరువాత వాడు మా స్కూలు నుండి వెళ్ళిపోయాడు..! ఇక మళ్ళీ ఇలాంటి సందర్బం ఎదురుకాలేదులేండి..!


అయితే మూడేళ్ళ కింద నుండి నన్ను మళ్ళి ఆశ్చర్యం లోకి ముంచెత్తటానికి మరొకటి ఒచ్చింది.. అదేమంటారా.., నేనే..
సరిగ్గా మూడేళ్ళ క్రితం మా వూరిలో ఒక సందులో ఫ్రెండ్స్ అందరం బాతాకానీ వేస్తున్న సమయమ్లొ మా ఫ్రెండు తాను పరిక్షలు రాసానని, అవి పాసవుతానో లేదో అని భయంగా ఉందని చెబితె, వాడిని ఎగతాళి చేస్తూ " ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు.. ఇక నువ్వు ఉద్యొగాలు చేసుకుని బతకాల్సిందే లే అని" అన్నాను.. దానికి వాడేమో " రెయ్ నాకు ఇంత ఆస్తి ఉంచుకుని నెనెందుకు రా ఉద్యొగం చేయటం??? నేను ఫెయిల్ అవను.. ఒకవేళ అయినా ఉద్యోగం చేయను..." అని అన్నాడు.. కరక్టుగా మూడు నెలలలో వాడు నా మాట లాగే ఉద్యోగమ్లో కుదిరాడు.. ఫెయిల్ అయాడు.. ఇక అసలు చదువే మానేశాడు..  ఇప్పటికీ వాడికి నా మాటంటే భయం.. ఎక్కడ జరిగిపోతుందో అని..
అదేదో యాద్రుశ్చికంగా జరిగిందిలే అని అనుకున్నాను..
తరువాత ఏడాదికి నాకు ఒకమ్మయి పరిచయం అయ్యింది.. ఆ అమ్మయి ఇంట్లో పెళ్ళి సంబందాలు చూస్తున్నరని, తనకు నల్లని వాడిని చేసుకోవటం ఇష్టమ్లేదని నాతో చెప్పింది.. నేనేదో సరదాగా "నీకు నల్లని వాడితోనే సంబందం కుదురుతుంది లే అని కాసేపు ఏడిపించాను.. తెల్లారి చూస్తే అలానే జరిగింది... ఇంకేముంది.. తను నన్ను తిట్టటం మొదలు పెట్టింది.. ఎం చెయ్యలో అర్దం కాక "సర్లే ఇక ఊరుకో ఆ సంబందం కుదరదులే నేను చెప్తున్న కదా.." అని తప్పించుకున్నా.. మళ్ళీ నేను చెప్పిందే జరిగింది.. ఇంక నేను ఏం మాట్లాడటానికి లేకుండా పోయింది.. ఎమైనా అంటే అలా అనకు నువ్వు అంటె జరిగిపోతుంది అనటం మొదలు పెట్టారు మా  ఫ్రెండ్సు.. ఆ చిరాకులో ఆ అమ్మయితో ఒకసారి నీకు 2012 లో పెళ్ళి కాదు అనేశా.. అదేంటొ ఇప్పటి వరకు తనకి ఎన్ని సంబందాలు ఒచ్చినా కుదరలేదు..(కుదరాలని కోరుకుంటున్నా..)
చివరి సెం. ఎగ్జాంస్ రాసేటప్పుడు మా క్లాసు వాళ్ళందరికీ " ఒరేయ్ ఈ సారి మన క్లాసు వాళ్లందరూ పాసైపోతాం రా.. అందరికి మంచి మార్కులు ఒస్తాయి.." అని చెప్పా.. అంతే కాలేజీలో మా క్లాసే టాప్..!
ఇలా ఎక్కడ చూడు.. ఇలాంటి అనుభవాలే..
అదేంటో మళ్ళి మనం కావాలని అంటే మాత్రం జరగవు.. ఎదో అనుకోకుండా అలా నోటి దూల కొద్దీ అన్నవి మాత్రం జరిగిపోతున్నయి..!
ఇలా మంచి జరిగితే ఓకే..మనక్కోడా శక్తులొచ్చేశాయ్ అని భలేగా ఉంటుందిలే.. కానీ జరగకూడదు అనుకున్నవి జరిగితే అదొక తలనొప్పి.. దానికి తోడు ఇలా అనకు అలా అనకు.. అంటూ చిరాకొచ్చేస్తుంది..!
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.