ప్రియమైన తల్లిదండ్రులారా.. అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు

ప్రియమైన తల్లిదండ్రులారా..
ఒక్క విషయం చెప్తాను.. కాస్త ఆలకించండి..
ఈనాటి కాలం కుర్రాళ్ళు చాలా దారుణంగా ఉన్న మాట వాస్తవమే.. అబ్బాయిలు, అమ్మాయిలు  అనే తేడా లేకుండా అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు, ఇలా పరిస్తితులు మరీ దిగజారిపోతున్నాయనటమ్లో  సందేహం లేదు. కనుక మన పిల్లల విషయమ్లో కాస్త జాగ్రత్తగా ఉండటమ్లో తప్పులేదు.

అయితే ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.


ఒకటి ప్రతిక్షణం బయట పరిస్తితులు , రోజులు బాలేవంటూ అనుదినం పిల్లల్ని అనుమానపు కళ్ళతో చూడటం మంచిది కాదు.
మేమేం అలా కాదు.. మా పిల్లలకి పూర్తి స్వేచ్చనిచ్చాం అని  అనుకునేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కానీ, ఆలోచనలో కూడా పొరబడి బాదపడే వాళ్ళు ఎందరో..

పిల్లలకు స్వేచ్చనిచ్చి మరీ పిల్లలేం చేస్తున్నారో , స్వేచ్చని ఎమైనా దుర్వినియోగం చేస్తున్నారా? అని లోలోపల మదనపడుతూ తెలియకుండానే పిల్లతో ప్రవర్తనలో తేడా ఒచ్చేసి ఇంటి వాతావరణాన్ని నరక ప్రాయం చేసుకుంటున్నారు చాలా మంది తల్లి దండ్రులు.
అలాగని మీ అలోచనలు తప్పని నేను చెప్పటం లేదు.

మీ ఆలోచనలు 100% మంచిదే. కానీ దాన్ని మరీ ఎక్కువ చేసుకుని అనుమానం అనే ఒక బూతాన్ని మీలో పెంచుకోవద్దు అని మాత్రమే చెప్పదలచుకున్నాను.

ఇక రెండవది,
మీ పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అని తెలిసినప్పుడు,

మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి "పలానా అతను/ఆమె నన్ను ప్రేమిస్తున్నారట"అని చెప్పినప్పుడు,
ఎవరైనా ఒచ్చి  సూటిగా మీ పిల్లల్నీ ప్రేమిస్తున్నా అన్నప్పుడూ,
ఇలాంటి పరిస్తితులు ఎదురైనప్పుడు సహజంగా కోపం తెచ్చేసుకుని,
అమ్మాయికైతే దబదబా ఇంకో సంబందం చూసి  పెళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టటమో,కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళైతే  ఎదుటి వాళ్ళ కి బెదిరింపులు ఇవ్వటం లాంటివి సహజం. అయితే ఇలాంటి సమయమ్లో కంగారు పడేకంటే, నిదానంగా ఆలోచించటం మంచిది.


ఎదుటి వాళ్ళు అమ్మాయి అయితే
నిజంగా అమ్మాయి మన వాడికి సరిపోతుందా?
వాళ్ల కుటుంబం ఎలాంటిది?
ముఖ్యంగా అమ్మాయి ప్రవర్తన మంచిదేనా?
వగైరా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

(అయితే ఇలాంటప్పుడు పరపతి చూడటం మంచిదే కానీ డబ్బూ,

ఆస్తులూ అంటూ పట్టించుకోవడం అంత కరెక్టు కాదు.)


ఒక వేళ ఎదుటి వాళ్ళు అబ్బాయి అయితే
అబ్బాయి మన అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేక పోకిరీ వేషాలు వేస్తున్నాడా?
ఒకవేళ నిజంగా ప్రేమించేవాడే అయితే భవి్ష్యత్తులో అమ్మాయిని బాగా చూసుకోగలడా?
అలా చూసుకునేందుకు అతని దగ్గర మంచి ఉద్యోగం ఉందా?
వాళ్ళ కుటుంబం ఎలాంటిది? వివరాలేంటి?
ఇంట్లొ మన అమ్మాయి సర్దుకోగలుగుతుందా?
ఇలా వగైరా వగైరా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఒకవేళ ఎదుటి వాళ్ళు మంచి వాళ్లైతే, మనకు కావాల్సిన లక్షణాలున్న వాళ్ళు అయితే సంతోషం. ఒకవేళ కాకపోతే మాత్రం అప్పుడు ఏదో ఆవేశంగా  కాకుండా మన పిల్లలను దగ్గరకు తీసుకుని ప్రేమగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. మన ఆలోచన ఏమిటో పిల్లలకు స్పష్టం గా అర్దమయ్యేలా చెప్పాలి. ఇలాంటప్పుడు ఏమాత్రం  దురుసుగా వ్యవహరించినా తరువాతి పరిణామాలు కొన్నిసార్లు ఇంటి పరిస్తితులని కలిచివేస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు జర జాగ్రత్త…!!!

ఇక అవతలి వాళ్ల సంగతంటారా.. వాళ్ల వల్ల మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ లేనంత వరకూ మనం కాస్త "ఏం జరగలేదులే"అని హాయిగా ఉండటమే మంచిది. అనవసరంగా లేని చిరాకుని నెత్తిన వేసుకోకుండా..!

ఒకవేళ ఏమైనా ఇబ్బంది  కలిగితే మాత్రం అప్పుడు ఏం చేయాలో, ఏంచేస్తే తరువాత మన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అని నిదానం గా అలోచించాలి.

మొత్తానికి నేను చెప్పొచ్చేదేంటంటే వయసుకొస్తున్న పిల్లల విషయమ్లో
ఆవేశపడి ని్ర్ణయాలు తీసుకోవడమో, అతి జాగ్రత్త పేరుతో అనుమానాన్ని పెంచుకోవడమో
రెండూ మంచివి కావు.

కాబట్టి మిత్రులారా కాస్త ఆలోచించి అడుగెయ్యండి.
( మీకు ఈ పోస్టు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే మీ స్నేహితులకూ షేర్ చేయండి.)

-మీ సత్యం గడ్డమణుగు

ఓ పేదరికమా..

ఓ పేదరికమా..
నీ ఆకలి కేకలకు నా చెవులు తట్టుకోలేకపోతున్నాయి..
నీ కోరల పదును నాతో ఆకలి కేకలు పెట్టిస్తున్నాయి..
ఎన్ని దిక్కులా పక్కల చూసినా నీ ఛాయా తప్ప నా కంటికి ఏమీ కానరాదే..
నగుమోము పైన నవ్వంటే నీకెందుకంత కోపమో నాకర్ధం కావట్లేదు..
నా చెంత నువ్వుండగా కన్నీరు తప్ప ఇంకేదీ దరిచేరట్లేదు..
హయ్యారే.. ఏరీ.. నా మిత్రులు ఏరీ..
నా సావాసగాళ్ళు ఏమయ్యారు..??
అందరితో స్నేహం చేసిన నన్ను ఈనాడు నీ స్నేహితుడిగా మార్చుకునా
చూసావా.. నా స్నేహాలు నాకు దూరం అవుతున్నాయి..
ఇది కేవలం, కేవలం నీ ఇంద్రజాలమే అని నాకు తెలుసు..
అయినా నీకు నేనంటే ప్రేమో కోపమో తెలియదు నాకు..
ప్రేమే అనుకుంటా.. అందుకేనేమో, ఎంత కాదనుకున్నా వీడలేకున్నావు..
కాదు కాదు.. కోపమేననుకుంట.. లేకపోతె నా అందమైన లోకాన్ని చిటికెలో దూరం చేస్తావు..

అయినా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం..
ప్రపంచం లో అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను..
ఎందుకో తెలుసా..
ఈ జగాన మనుషుల అంతరంగాలను నీ కన్నా అందంగా, నీకన్నా నిజంగా, నీకన్నా స్పష్టంగా ఏ అద్దమూ చూపలేదు కనుక..!

- సత్యం గడ్డమణుగు [03-10-2012, 01:56am]


ఆడదాని అందమైన లోకం

ప్రతీ మగడు వాడి గర్ల్ ఫ్రెండ్ ని కానీ, భార్యని కానీ
ప్రపంచం లో తానొక్కడే మొత్తం అర్ధం చేస్కునా అనే 
బ్రమ లో ఉండిపోతాడు కానీ

ప్రతీ  ఆడపిల్లకీ ప్రపంచంలో ఎవరికీ అర్ధం కాని ఒక
అందమైన ప్రత్యెక లోకం ఉంటుంది తన మనసులో..
అది ఎంత గింజుకున్న అర్ధం కాదు ఎవరికీ ..

కానీ ఒకవేళ కనుక మగడు ఆ అమ్మాయి కి ఉన్న
ఆ ప్రత్యెక భావాలను గౌరవించగలిగితే మాత్రం ,
ఇక ఆ అబ్బాయే ఆ అమ్మాయికి లోకంగా మారిపోతాడు..!

నాతో పెట్టుకోకండి.. పిచ్చెక్కించేస్తాను...

కొత్తగా నేనొక ఇంటర్నెట్ గ్రూపు లో చేరాను..
అందులో ఉన్న నిర్వాహకులు వెంటనే ఇలా అన్నారు..
" సత్యం గారూ మీరు మీ కవితలతో మా గ్రూపుని నింపాలి.." అని..


అప్పుడు వెంటనే తగులుకున్నాను..


" పిచ్చి లోన పిచ్చి, పిచ్చితోనె పిచ్చి..
పిచ్చి లోని పిచ్చి, మంచి పిచ్చి..
పిచ్చి యంత పిచ్చి, పిచ్చి కైన పిచ్చి..
నాదైన పిచ్చి నాటైన పిచ్చి..
నీదు కూడ పిచ్చి, నీటు పిచ్చి..
ఎక్కినంత పిచ్చి, ఎంతెంత పిచ్చి..
పిచ్చి లేని పిచ్చి, పిచ్చి పిచ్చి.."

నాతో పెట్టుకోకండి.. పిచ్చెక్కించేస్తాను...
అని..

వెళ్ళి ఓదార్చి గుండెలకు హత్తుకుని సేదతీర్చి


" అందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం.."
అని ఎవరో కవి అన్నారు కానీ

నాకు మట్టుకు ఆనందమే నిజమైన అందం.

మిస్సు వరల్డ్ మిస్టరు వరల్డు ల కంటే కూడా
రోజు చివరిలో కాసనంత కూడుతో కడుపు నింపుకుని
కమ్మటి మాటలతొ కాలాన్ని వెనక్కు నెట్టెసి..

ఎప్పుడు సాయంకాలమమవుతుందా..
మన అడ్డాలోకి సావాస గాళ్ళు అందరు చెరుకుని
పొద్దుగూకేదాకా మనసారా బాతాకానీ వేసి
..

పొద్దున్నే పిల్లల్ని బడికి పంపించడానికి
వాళ్ళ పనులు అన్నీ చూస్తూ, అటు ఆయన రెడీ అవుతున్న్నారా,
మద్యాహ్నం బయట
ఏ చెత్త తిండ్లు తినకుండా
తాను పెట్టిన
అన్నండబ్బాను తానే బ్యాగులో సర్ది
చేయి ఊపి సాగనంపి, సాయంత్రం ఒచ్చేదాకా ఎదురు చూసి

బడిలో పెట్టె ఆ ఆటల పోటీల్లో ఎదో ఒక చిన్న కప్పు గెలవగానే
పరిగెత్తుకుంటూ ఒచ్చి చూపించగానే నాన్న
" శభాష్ రా కన్నా"
అనగానే ప్రపంచంలో నన్ను మించేవాడు లేదు అన్నంతగా
ఆనంద
పడి..

స్నేహితుడు బాదలో ఉన్నాడని తెలియగానే వెళ్ళి ఓదార్చి
గుండెలకు హత్తుకుని సేదతీర్చి, ఏంపర్వాలేదు.. నీకు నేనున్నానంటూ
భరోసా ఇచ్చి
..

ఇలాంటి అరుదైన ఆనంద క్షణాలే
మనిషికి నిజమైన
అందాన్ని ఆపాదిస్తాయి..
-````నా తలపులు````
(సత్యం గడ్డమణుగు
)


ఈ అమ్మాయి బొమ్మకు వ్యాసం రాయండి..!

ఆధునిక పోకడలు ఒక ఆడపిల్లను ఎలా ప్రభావితం చేస్తున్నయి.. అలాగే ఈ సమాజం ఎన్ని రకాలుగా ఒక అమ్మాయిని ప్రభావితం చేస్తుంది అనే ఉద్దేష్యం తో ఈ బొమ్మను గీశాను.. మీలో ఎవరినా ఈ బొమ్మకు చక్కటి విశ్లేషణ తో చక్కటి వ్యాసం అందిస్తారని కోరుతున్నాను..!

నేను రాసిన ఈ మొదటి పద్యం మా నాన్నకు అంకితం..!

పొద్దున్నే ఫెసుబుక్కు వాలు మీద బద్దెన గారు రాసిన
 "పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు
పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర

సుమతీ!"
అనే పద్యము చుసిన తరువాత ఎందుకో నా మదిలో మెదిలిన చిన్ని ఆలోచన..
పద్యములు రాద్దాము అని..
అందుకే నా మొట్టమొదటి పద్యాన్ని మా నాన్నగారి గురించి రాస్తున్నాను..!


================================
నేనెంతటి అదృష్ట వంతుండనో గదా
నాకియ్యంత కష్టంబేల వచ్చునోయని
ప్రతి క్షణము పరితపించెడి
తండ్రిని పొందగ, 
సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!
================================ 


"విశ్వదాభిరామ వినుర వేమ"లా.. నా పద్యాలకు 
"సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!" అని పెట్టాలని అనుకున్నాను..!
ఈ నా చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను..!

నీకు నల్లని వాడితోనే సంబందం కుదురుతుంది లే అని కాసేపు ఆ అమ్మయిని ఏడిపించాను..

నా చిన్నప్పుడు మా క్లాసులో భానుచందర్ అని ఒకడుండే వాడు..!
వాడు చదువులో కొంచెం వెనకబడి ఉండేవాడు.. ఐతే ఆశ్చర్యం ఏమంటే వాడు ఎదైనా అంటే అది జరిగిపోయేది..!
ఈ విషయం మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.. ఎలా అంటే "ఈరోజు బస్సు రాదు రా మనం ఆటోలో వెళ్ళాలి" అంటె నిజంగానే బస్సు ఆరోజు రాకపోయేది అదేదొ వాడు బస్సుడిపోలో పనిచేసెవాడిలా.., ఎప్పుడైనా వాడు సరదాగా "ఒరేయ్ నిన్ను ఇవాళ టీచర్ కొడతారు అని అంటె నిజంగానే ఆరొజు తన్నులు తప్పేవి కావు.. ఇదంతా నేను వాడికి దూరంగా ఉండి చూస్తూ ఉండెవాడిని... ఎందుకంటే మళ్ళీ నా గురించి ఏమైనా అంటాడేమో అని..!
మా ఫ్రెండ్సు మాత్రం వాడిని బాగా నమ్మేవాళ్ళు.. కొన్నాళ్ళకు నేను కూడా నమ్మేశాను..
ఆ తరువాత వాడు మా స్కూలు నుండి వెళ్ళిపోయాడు..! ఇక మళ్ళీ ఇలాంటి సందర్బం ఎదురుకాలేదులేండి..!


అయితే మూడేళ్ళ కింద నుండి నన్ను మళ్ళి ఆశ్చర్యం లోకి ముంచెత్తటానికి మరొకటి ఒచ్చింది.. అదేమంటారా.., నేనే..
సరిగ్గా మూడేళ్ళ క్రితం మా వూరిలో ఒక సందులో ఫ్రెండ్స్ అందరం బాతాకానీ వేస్తున్న సమయమ్లొ మా ఫ్రెండు తాను పరిక్షలు రాసానని, అవి పాసవుతానో లేదో అని భయంగా ఉందని చెబితె, వాడిని ఎగతాళి చేస్తూ " ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు.. ఇక నువ్వు ఉద్యొగాలు చేసుకుని బతకాల్సిందే లే అని" అన్నాను.. దానికి వాడేమో " రెయ్ నాకు ఇంత ఆస్తి ఉంచుకుని నెనెందుకు రా ఉద్యొగం చేయటం??? నేను ఫెయిల్ అవను.. ఒకవేళ అయినా ఉద్యోగం చేయను..." అని అన్నాడు.. కరక్టుగా మూడు నెలలలో వాడు నా మాట లాగే ఉద్యోగమ్లో కుదిరాడు.. ఫెయిల్ అయాడు.. ఇక అసలు చదువే మానేశాడు..  ఇప్పటికీ వాడికి నా మాటంటే భయం.. ఎక్కడ జరిగిపోతుందో అని..
అదేదో యాద్రుశ్చికంగా జరిగిందిలే అని అనుకున్నాను..
తరువాత ఏడాదికి నాకు ఒకమ్మయి పరిచయం అయ్యింది.. ఆ అమ్మయి ఇంట్లో పెళ్ళి సంబందాలు చూస్తున్నరని, తనకు నల్లని వాడిని చేసుకోవటం ఇష్టమ్లేదని నాతో చెప్పింది.. నేనేదో సరదాగా "నీకు నల్లని వాడితోనే సంబందం కుదురుతుంది లే అని కాసేపు ఏడిపించాను.. తెల్లారి చూస్తే అలానే జరిగింది... ఇంకేముంది.. తను నన్ను తిట్టటం మొదలు పెట్టింది.. ఎం చెయ్యలో అర్దం కాక "సర్లే ఇక ఊరుకో ఆ సంబందం కుదరదులే నేను చెప్తున్న కదా.." అని తప్పించుకున్నా.. మళ్ళీ నేను చెప్పిందే జరిగింది.. ఇంక నేను ఏం మాట్లాడటానికి లేకుండా పోయింది.. ఎమైనా అంటే అలా అనకు నువ్వు అంటె జరిగిపోతుంది అనటం మొదలు పెట్టారు మా  ఫ్రెండ్సు.. ఆ చిరాకులో ఆ అమ్మయితో ఒకసారి నీకు 2012 లో పెళ్ళి కాదు అనేశా.. అదేంటొ ఇప్పటి వరకు తనకి ఎన్ని సంబందాలు ఒచ్చినా కుదరలేదు..(కుదరాలని కోరుకుంటున్నా..)
చివరి సెం. ఎగ్జాంస్ రాసేటప్పుడు మా క్లాసు వాళ్ళందరికీ " ఒరేయ్ ఈ సారి మన క్లాసు వాళ్లందరూ పాసైపోతాం రా.. అందరికి మంచి మార్కులు ఒస్తాయి.." అని చెప్పా.. అంతే కాలేజీలో మా క్లాసే టాప్..!
ఇలా ఎక్కడ చూడు.. ఇలాంటి అనుభవాలే..
అదేంటో మళ్ళి మనం కావాలని అంటే మాత్రం జరగవు.. ఎదో అనుకోకుండా అలా నోటి దూల కొద్దీ అన్నవి మాత్రం జరిగిపోతున్నయి..!
ఇలా మంచి జరిగితే ఓకే..మనక్కోడా శక్తులొచ్చేశాయ్ అని భలేగా ఉంటుందిలే.. కానీ జరగకూడదు అనుకున్నవి జరిగితే అదొక తలనొప్పి.. దానికి తోడు ఇలా అనకు అలా అనకు.. అంటూ చిరాకొచ్చేస్తుంది..!

ఏ జీన్సో, మిని స్కర్టో వేస్కొని ఒస్తే " అబ్బా.. కత్తిలా ఉంది.." అంటారు.

" అందమె ఆనందం,,, ఆనందమె జీవిత మకరందం..." అన్నాడో కవి తన పాటలో..
కానీ ఆ అందమే ఈనాడు ఎన్నో అనర్దాలకు మూలం అవుతోంది. నాగరికత, ఫ్యాషన్ అంటూ భారత స్త్రీల వస్త్రధారణ నానాటికీ దిగజారిపోతోంది. మొన్నటిదాకా సినిమాలకే పరిమితం అనుకున్న ఈ కు'సంస్క్రుతి ఈనాడు రోడ్డుమీదదాకా ఒచ్చేసింది. ఇలానే పోతే ఎన్నో వేల సంవత్సరాలుగా కట్టబడి, రక్షించబడిన భారతీయ సాంప్రదాయ గోడలు ఖచ్చితంగా కూలిపోతాయి.



ఎప్పుదో చిన్నప్పుడు సాంఘీక శాస్త్రం లో అనుకుంటా.. " ఆదిమానవుడి నుండి నాగరిక మానవుడు ఎలా ఆవిర్భవించాడో" అని పాటం చదువుకున్నను.. నేటి పరిస్తితులు చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నాగరిక మానవుడు మళ్ళీ ఆది మానవుడైపోతాడేమో..?? అదే కనుక జరిగితే  ఎందరో మహనీయులు, ఉన్నతోన్ముఖులు కలిసి దిద్దిన మన కట్టుబాట్లు బూడిదలో కలిసినట్లే.. దీనిని ఆపటానికి మన ప్రతీ ఒక్కరిలో చైతన్యం కావాలి.


నిజానికి ఈమాట చెప్తున్నానని చాలామంది నన్ను తిట్టుకుంటారేమో కానీ, ఇలాంటి విషయాలలో నిజాన్ని నిఖ్ఖచ్చిగా చెప్పటమే నాకు తెలిసిన నైజం..ఇలాంటి వ్యాసాలను ఎన్నో చదివె చాలా మంది లో " బాగా చెప్పారు", " బాగా రాసారు" అనేవారు బోలెడు మంది..మరి వారిలో ఈ విషయాలను తమ మనసులోకి ముద్రవేసుకుని నడుచుకునేవారెందరు???????

సరే.. ఈ విషయం పక్కన పెట్టండీ.. ఈ ప్రపంచమ్లో ఏదైనా అభివ్రుద్ది చెందుతోంది అంటే (అది చెడైనా, మంచైనా సరే) దానికి మనం ఖచ్చితంగా అవకాశం 100% ఇచ్చామనే లెక్క.. అలాంటప్పుడు మనమెందుకు అవకాశం ఇవ్వాలి చెప్పండి..



అంతెందుకు.. ఒకమ్మాయి చక్కగా చీర కట్టుకుని అలా ఒస్తుంటే ఎవరైనా " అమ్మయి మహా లక్ష్మిలా లక్షణం గా ఉంద" టారు.. అదే ఏ జీన్సో, మిని స్కర్టో వేస్కొని ఒస్తే " అబ్బా.. కత్తిలా ఉంది.." అంటారు.. ఒకవేళ అనకపోయినా కనీసం మనసులో అనుకుంటారు.. అలాంటి అవకాశాన్ని మనమే ఇచ్చినప్పుడు మళ్ళీ " వెధవ.. మ్యానర్స్ లేదు.. ఎలా చూస్తున్నాడో.. ఎలా మాట్లాడుతున్నాడో..." అని అనుకోవడాం ఎంతవరకు కరెక్ట్..?? (అలాగని నేను ఆ కామెంట్స్ చేసె వాళ్ళని సమర్దిస్తున్నానని అనుకోవద్దు.. మనమే సరిగా ఉంటే అనేమీ రావు కదా అనేది నా ఉద్దేశ్యం..)


ఇక సినిమాల విషయానికి ఒస్తే, మితిమీరిన శ్రుంగారం, అశ్లీల ద్రుశ్యాలు.. వాటన్నింటినీ సమర్దించుకోవడానికి  వాటికి ఐటం సాంగ్స్ అని పేరు.. ఇలాంటి వాటిని మనమే సూపర్ అంటూ హిట్ చేస్తుంటే ఇక ఆ సినిమా వాళ్ళు ఎందుకు ఆగుతారు చెప్పండీ.. మొన్నకి మొన్న కొత్తగాఅ విడుదలైన సూపర్ హిట్ తెలుగు  సినిమాలో ఐటం సాంగ్ కి "డ్యాన్స్ వేసిన అమ్మయి అవే బట్తలతో ఒక ప్రయివేటు చానల్ కి ఇంటర్వ్యు ఇచ్చింది.. దానికి ఆ చానల్ ఒక గంట సేపు ప్రసారం.. ఇక్కడ ఆ అమ్మాయి కి కానీ, ఆ చానల్ వాళ్ళకి కానీ ఇంగిత జ్ఞానం లేదనే చెప్పాలి..  ఒక సినిమాలో మన హీరో ఒకతను చెప్పిన డైలాగు గుర్తొస్తోంది..
" ఒక ఆడది తన అందాలను నాలుగు గోడల మద్య తాళి కట్టిన భర్తకి చూపించాలి కానీ, ఇలా కురచ బట్టలతో రోడ్డు మీద వాళ్ళందరికీ కాదు.."
ఈ డైలాగుతో అప్పటి వరకూ ఫ్యాషన్ డ్రస్సులు వేసిన ఆ హీరోయిం కాస్తా పూర్తిగా మారిపోయి మిగిలిన సినిమా అంతా సాంప్రదాయ దుస్తులే వేస్తుంది.

అదంటే సినిమా.. కానీ మరి ఈ "నిజం" లో ఎన్ని సార్లు చెప్తే మనలో మార్పు ఒస్తుంది???????

=================================================

ఇదంతా నెను కెవలం మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను కాపాడుకోవాలనే తాపత్రయంతో మాత్రమే చెప్పాను తప్ప ఎవరినీ బాదపెట్టాలని మాత్రం కాదు..!

ఒకటి చెప్పనా... బతుకుని బతకలేకపోవటం కూడా ఒక జబ్బే..!

ప్రపంచం లో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. కొందరికి డబ్బు సమస్య ఇతే కొందరికి జబ్బు సమస్య. పదవ తరగతి పిల్లవాడికి పరీక్షల భయం. ఇంటర్ చదివే వాడికి ఎంసెట్ ర్యాంకు కోసం పాకులాట. డిగ్రీలు చేసే వారికి ఉద్యొగం కొసం ఆరాటం. ఉద్యొగస్తులకు జీతాలు, తల్లితండ్రులకు పిల్లల చదువులు ఇంటి భాద్యతలు.. ఇలా ప్రతీ ఒక్కరూ ఎదో ఒక ఇబ్బంది.

కొంతమందికి ఎంత తిన్నా కడుపు నిండదు, అలాగే ఇంకొంతమందికి ఎంత సంపాదించినా సరిపోదు. ఈనాటి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ జీవితం, భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ప్రణాలికలు వేసుకుని డబ్బులు సంపాదించి ఇంట్లోకి అన్నీ సమకూర్చుకొవాలని ఎన్నో కలలు.. వాటి కోసం రేయింబవళ్ళూ కష్టపడి తీరా అవన్నీ మన కళ్ళముందుకి ఒచ్చాక అనుభవించటానికి మన ఒళ్ళే సహకరించదు, కొన్ని సార్లు మనమే ఉండవేమో..! మరి ఆ సంపాదించిందంతా ఎందుకు?????

ఈనాడు ఈ పోటీ ప్రపంచం లో  ప్రతీ తల్లీ తండ్రీ తమ పిల్లలకి " ఒరెయ్ బాగా చదువుకోవాలి రా.. బగా పైకి రావాలి, జీవితం లో నీకు ఎమీ లోటు రాకుండా పేద్ద ఉద్యొగం చేయాలి రా నాన్నా.." అని చెప్తున్నరే కానీ జీవితం లో " ఇవేమీ లేకపోఇనా, జీవితాన్ని ఆనదంగా గడపగలిగే" లా అసలైన జీవన మాధుర్యాన్ని తెలియజేయలేకపోతున్నరు.

ఎం.???? బంగళాలలో ఉంటేనే  ఆనందంగా ఉంటారా?? ఏ.సీ. రూంస్ లో నే సుఖంగా జీవిస్తారా??

పొద్దున్నే కాసంత సద్ది మూటకట్టుకుని కూలీ పనికి వెళ్ళి, 

పొద్దుగూకగానే ఇంటికి చేరి, 
అంత ఆవకాయ తో నాలుగు ముద్దలు సంతోషంగా తిని, 
అప్పటికే ఆడుకుని అలిసి నిద్రపోతున్న పిల్లల నుదురు పై ఒక్కసారి ముద్దు పెట్టుకుని,
హాయిగా అలా ఆరుబయట చల్లని వెన్నెలలో ఆ చందమామని చూసుకుంటూ,
రోజంతా ఇంట్లో కష్టపడే ఇల్లలి ముచ్చట్లను ఆలకిస్తూ
ఆదమరిచి నిద్రపోయే ఆ ఆనందం ప్రపంచమ్లో ఏమూలన దొరుకుతుంది????
ఎన్ని కోట్లు పెడితే మాత్రం ఒస్తుంది????

అలాగని అందరూ చదువులు మానేసి కూలీకి వెళ్ళాలని కాదు, కానీ మనకి డబ్బులొచినా, జబ్బులొచ్చినా అది మనమీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు ఈ ప్రపంచానికి టాటా చెప్తామో తెలియదు.. అలాంటప్పుడు మనకు దొరికిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ,,,

ఒకటి చెప్పనా... బతుకుని బతకలేకపోవటం కూడా ఒక జబ్బే.. ఇందాక చెప్పినట్లు బతకటం అంటే ఏ.సీ కార్లు, టచ్ సెల్లు ఫోనులు, కంప్యూటర్లు, అంతస్తులు, ఆస్తులు కావు.. ఎటువంటి బాదరబందీ లేకుండా నాలుగు మెతుకులు ఐదువేళ్ళను నోటికందించగలగటం, నలుగురితో చిరునవ్వుతో మాట్లాడగలగటం, ఎలాంటి ఆలోచనలూ లేకుండా ప్రశాంతమైన నిద్ర పోవటం, చివరకు నలుగురు నీ కోసం జీవించటమే జీవితం.

ఈ ప్రపంచంలో మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే!

ఒంటరితనం భరించలేని నరకం చాలామందికి! నిరంతరం సమూహంలో సందడి సందడిగా కదలాడే కలివిడి అలవడ్డాక అనివార్య కారణాల వల్ల సమూహం చెల్లాచెదురైతే విలవిల్లాడిపోతుంటారు. ఈ ప్రపంచంలో మనం, మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే! జీర్ణించుకోవడం కష్టమైనా ఇది కాదనలేని నగ్నసత్యం. ప్రమాదవశాత్తూ మనం ఏ కుటుంబ సమూహంలోకో, స్నేహబృందంలోకో నెట్టివేయబడ్డామే తప్ప అవేమీ శాశ్వతాలు కాదు. ఈ మాటలు చాలామందికి ఆధ్యాత్మిక బోధనల్లా అన్పించొచ్చు. మననీ, మన అంతరంగాన్ని తరిచి చూసుకుంటే సత్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. మనిషి ఏ క్షణమైతే తన ఒంటరితనాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాడో, అంతర్ముఖుడై తననితాను గమనించుకోవడం మొదలుపెడతాడో ఆ క్షణం నుండే పరిపూర్ణతని సంతరించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ తత్వం నేనెక్కడా చదువుకున్నదీ కాదు, ఎక్కడో విని చిలక పలుకుల్లా వల్లిస్తున్నదీ కాదు.. !! జీవితం గడిచే కొద్దీ నా ఉనికిని ప్రశ్నించుకుంటున్న కొద్దీ, మనుషుల లౌకికమైన ఆరాటాలను ప్రేక్షకుడిగా గమనించే కొద్దీ జీవితంపై పెరుగుతున్న మెరుగైన అవగాహనలో భాగమే ఈ ఆలోచనా పరిణతి! మనం మనుషుల ఆత్మీయ కౌగిళ్ల మధ్యా, కరచాలనాల మధ్యా బ్రతుకు పట్ల భరోసాని వెదుక్కునంత కాలమూ మనల్ని అభద్రత వెన్నంటుతూనే ఉంటుంది.

ఏ బంధమూ మనతోపాటు పెనవేసుకుపోయేది కాదు.. పెనవేసుకున్నట్లే భ్రమింపజేసి అలవోకగా జారుకునే జారుడు బంధనాలే బంధాలన్నీ! బంధాలు మనల్ని పారవశ్యంలో ముంచెత్తుతాయి. ఆ పారవశ్యాన్ని తనివితీరా ఆస్వాదించేలోపే పుటుక్కున తెగిపోతాయి. చివరకు మెదడంతా శూన్యమే మిగులుతుంది. ఆ శూన్యంలో మరో ఆశాదీపం మరో బంధం రూపంలో వెలుగు చూస్తుంది. దాన్ని పట్టుకుని బ్రతుకు పట్ల ఆశని చిగురింపజేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాం. అదీ మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. దీంతో బ్రతుకు పట్ల విరక్తి పొడజూపుతుంది. ఆ విరక్తినే ఆత్మ సాక్షాత్కారానికి తొలిమెట్టని, మనమూ పరిపూర్ణులమవుతున్నామని మరోమారు మాయలో పడతాం. విరక్తి అనేది ఓ భావావేశపు స్థితి మాత్రమే అన్న ప్రజ్ఞ కోల్పోతాం. బంధాలు తెగిపోవడం వల్ల అక్కసుతో ఒంటరి తనం నుండి ఏర్పడే విరక్తి మనల్ని ముక్తి మార్గాన నిలిపేది కాదు. మనం దేన్నయితే ముక్తి మార్గమని భావిస్తామో దానిలో ముందడుగు వేయాలంటే ఒంటరితనాన్ని అలౌకికంగా ఆస్వాదిస్తూ లౌకిక బంధాల వ్యామోహాలేమీ మనస్సుని చేరకుండా నిశ్చలంగా కాలం గడపగలిగిన క్షణమే మనల్ని మనం ఉన్నతుల్ని చేసుకుంటూ సాగగలం.

ప్రపంచంతోపాటు కదలాడడం, సమూహంలో మిళితమైపోవడం ఒంటరిగా ఉండడానికి ఏమాత్రం అవరోధం కాదు. బంధాలన్నింటికీ బాధ్యతని నెరవేరుస్తూనే అదే క్షణం మానసికంగా ఆ మాయాప్రపంచం నుండి వేరుపడి ఒంటరితనంలో గడపగల నేర్పు అలవర్చుకుంటే బంధనాలూ సురక్షితంగానే ఉంటాయి, అంటీ ముట్టనట్లు ఉంటున్నామని ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదులూ
ఉండవు, ఒక్కమాటలో చెప్పాలంటే చెరగని చిరునవ్వు ప్రపంచాన్ని పలకరిస్తుంటే లోతైన ఆత్మపరిశీలన మనస్సు పుటల్ని శోధిస్తూ సాగిపోతుంటుంది.



(నల్లమోతు శ్రీధర్ గారి మాటల నుండి సంకలనము)

ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

నిన్న మా తమ్ముడి కాలేజీ లో "treditional  day" జరుపుకున్నారు.. 
ఈ "దినం" ప్రత్యేకత ఏంటంటే ప్రతీ ఒక్కరూ పంచేల్లో, చీరల్లో వెళ్లి ముగ్గులు వేయటం, గాలిపటాలు ఎగురవేయటం, భోగి మంటలు... ఇలా సంక్రాంతి వాతావరణాన్ని యువతకి తెలియజేయడం అన్నమాట..
ఏంటో ఈ కాలం ఇలా తయారయినందుకు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు... 
ఇంట్లో కూర్చొని మన సాంప్రదాయాలను తెలుసుకుని ఆచరించాల్సిన మనం ఈ రోజు ఎవరో ఒక కాలేజీ ఈవెంట్ లాగా conduct  చేస్తే వాడి దగ్గర ఏదో కాసేపు గెలవటానికి పెట్టుకున్న ముచ్చట లాగా అయిపొయింది... 
ఏం??? మనకు చీర ఎలా కట్టుకోవాలో కుడా పోటీలు పెడితే నేర్చుకుంటామా? 
పంచెలు కట్టుకునేది బహుమతులు గెలవటానికా????


ఈ ఒక్క సంక్రాంతి అని కాదు అసలు ఈనాటి యువతకి పార్టీలు, సినిమా లు తప్ప మన సంస్కృతి సాంప్రదాయాల మీద కనీస అవగాహన కూడా లేదు... 


పిల్లలే కాదు పెద్దలు కూడా ఎం తక్కువా అన్నట్లు "పండుగ ఒస్తే ఏదో ఇంట్లో షాప్ నుండి నాలుగు స్వీట్స్ తెచ్చుకుని తినేసి, ఖరీదైన బట్టలను కట్టుకున్నాము అంటూ పక్కన వారికి చూపించుకోవటమే" ప్రధానం గా మారిపోయింది...
అంతే కానీ అసలు పండుగ విశిష్టత కూడా తెలుసుకోవాలని కూడా అనుకోలేని దుస్తితిలో ఉన్నారు నేటి జనం...


అంతెందుకు మొన్నకి మొన్న ఏకాదశి రోజున నాకు కనిపించిన వారినల్లా "ఇది ధనుర్మాసం లో ఒచ్చే ఏకాదశి కదా... ఇంతకీ ఇది ఏ మాసం అని అడిగాను..." ఏ ఒక్కరూ కూడా ఇది "పుష్యమాసం" అని సమాధానం చెప్పలేకపోయారు...
కనీసం "ధనుర్మాసం అని అంటున్నారు కదా " ఎందుకు దీనిని ధనుర్మాసం అంటారు" అను అడిగాను దానికి కూడా సమాధానం లేదు.. ఈ ప్రశ్నలని కనీసం ఆరోజున ఒక డెబ్బై మందిని అడిగి ఉంటాను... 


ఇది ఒక్కటే కాదు మనం పుట్టిన నేల మీద మనకంటే ముందు పుట్టిన పద్దతులని సంప్రదాయాలని తెలుసుకోలేని ప్రతీ జన్మ నిరర్ధకమే...
మనం అబివృద్ది పధం బాట పట్టుకుని పాతాళానికి పోతున్నాము తప్ప ఈ కనిపించే ఎదుగుదల నిజం కాదు... దానిని మనం మన సాంప్రదాయాల మనుగడను కాపాడినప్పుడే నిజం చేసుకోగలము...
ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది... మన కట్టుబాట్లను తెలుసుకోవటం, కన్న తల్లి గురించి ఆలోచించటం ఒక్కటే...

ఇది మాత్రం ఏదో అబ్యర్ధనగా రాస్తున్నది కాదు... మనలో ఇవన్నీ తెలియని ప్రతీ ఒక్కరూ ఇకనైనా మేల్కొంటే మంచిదని చెప్తున్నాను... ఇకనైనా లేవలేని వారు, కనీసం ప్రయత్నించలేని వారు ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు...!

పేస్ బుక్ లో పరిచయాలు పెంచుకోవటం చాటింగులు, తరువాత మీటింగులు ఈనాటి యువతలో సర్వ సాధారణం అయిపొయింది..! దానికి నేనేమి మినహాయింపు కాకపోఇనా నిన్న నూతన సంవత్సరం సందర్బంగా ఫసుబూక్ లోని ఫ్రెండ్స్ అందరమూ కలవాలనుకుని నెల క్రితమే ప్లాన్ చేసుకున్నాము..
అయితే ఎలా ఎక్కడా అని చర్చించుకునే సమయం లో "మనం మాములుగా కలిసి ఎంజాయ్ చేయటం కంటే  ఆరోజు మన సంతోషం లో మానసిక వికలంగులకో, లేక అనాధ పిల్లలకో కుడా భాగం ఇస్తే బాగుంటుంది" అంటూ నా పేస్ బుక్ స్నేహితురాలు ఒకావిడ సలహా ఇచ్చింది. ఆవిడ ఆలోచన నాకెంతో ఆనందాన్ని కలిగించి, వెంటనే దానికి కావలిసిన ప్రణాలికను సిద్ధం చేశాను. అనుకున్న విధం గా ఒక పది మంది కలిసి చందాలు వేసుకుని అక్కడ పిల్లలకు పంచటానికి యపిలు పండ్లు, కమల పండ్లు కొన్నాము. అదే విధంగా ఒక ఇద్దరము పులిహార కుడా చేసుకుని  తీసుకు  వెళ్లి అక్కడ  పిల్లలతో  గడిపాము ..

కానీ అక్కడకు వెళ్లి అక్కడి పిల్లల పరిస్థితి చుసిన తరువాత మనసంతా ఎంతో బాధగా అన్పించింది... ప్రతీ రోజు ఎన్నో హంగు ఆర్భాటాలతో మనం బతుకుతున్న ఈ సమాజం లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్పించింది...! అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య... అయినా వాళ్ళ ప్రపంచం లో వాళ్ళు ఆనందం గా నే ఉన్నారు.. ఈ బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు.... ఎదుటి వాళ్ళు మనలని పట్టించుకోరేం అనే దిగులు వాళ్లకి లేదు... ఏవో అందని మెట్లు ఎక్కి ఎదుటి వాళ్ళని మెప్పించాలనే ఆలోచన వాళ్లకి లేదు... ప్రేమా ద్వేషం, దిగులు బాధలు కస్టాలు ఇలా అసలవంటే ఏంటో కుడా తెల్సుకోవాల్సిన పని వాళ్లకు లేదు...
రాజ్యాంగం నుండి హక్కులు కావాల్సింది మనకే కానీ వాళ్లకి ఆ అవసరం కుడా లేదు... ఎందుకంటే వాళ్ళు స్వేచ్చా జీవులు...

కాకపోతే వాళ్లకి కావాల్సింది అణువంత ఆప్యాయత. ప్రేమ పంచాల్సిన తల్లితండ్రులే మకేందుకంటూ పట్టించుకోకపోతే ఇక మాతృత్వానికి అర్దమేక్కడ????????????
ఏమిటో ఈ సమాజం, ఒక పక్క ప్రతీ   రంగం లో అభివృద్ధి బాటలు వేస్తున్న, డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నా ఎం లాభం?????? ఇలాంటి సందర్బాలలో ఆ జ్ఞానం పనికి రానప్పుడు?????????????

(ఇదంతా కొందరైనా ఆలోచిస్తారని చెప్తున్నాను కానీ ఏదో నేను వెళ్లి ఇలా చేసి ఒచాను అని చెప్పుకోవటానికి కాదు..)
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.