ఈ ప్రపంచంలో మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే!

ఒంటరితనం భరించలేని నరకం చాలామందికి! నిరంతరం సమూహంలో సందడి సందడిగా కదలాడే కలివిడి అలవడ్డాక అనివార్య కారణాల వల్ల సమూహం చెల్లాచెదురైతే విలవిల్లాడిపోతుంటారు. ఈ ప్రపంచంలో మనం, మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే! జీర్ణించుకోవడం కష్టమైనా ఇది కాదనలేని నగ్నసత్యం. ప్రమాదవశాత్తూ మనం ఏ కుటుంబ సమూహంలోకో, స్నేహబృందంలోకో నెట్టివేయబడ్డామే తప్ప అవేమీ శాశ్వతాలు కాదు. ఈ మాటలు చాలామందికి ఆధ్యాత్మిక బోధనల్లా అన్పించొచ్చు. మననీ, మన అంతరంగాన్ని తరిచి చూసుకుంటే సత్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. మనిషి ఏ క్షణమైతే తన ఒంటరితనాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాడో, అంతర్ముఖుడై తననితాను గమనించుకోవడం మొదలుపెడతాడో ఆ క్షణం నుండే పరిపూర్ణతని సంతరించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ తత్వం నేనెక్కడా చదువుకున్నదీ కాదు, ఎక్కడో విని చిలక పలుకుల్లా వల్లిస్తున్నదీ కాదు.. !! జీవితం గడిచే కొద్దీ నా ఉనికిని ప్రశ్నించుకుంటున్న కొద్దీ, మనుషుల లౌకికమైన ఆరాటాలను ప్రేక్షకుడిగా గమనించే కొద్దీ జీవితంపై పెరుగుతున్న మెరుగైన అవగాహనలో భాగమే ఈ ఆలోచనా పరిణతి! మనం మనుషుల ఆత్మీయ కౌగిళ్ల మధ్యా, కరచాలనాల మధ్యా బ్రతుకు పట్ల భరోసాని వెదుక్కునంత కాలమూ మనల్ని అభద్రత వెన్నంటుతూనే ఉంటుంది.

ఏ బంధమూ మనతోపాటు పెనవేసుకుపోయేది కాదు.. పెనవేసుకున్నట్లే భ్రమింపజేసి అలవోకగా జారుకునే జారుడు బంధనాలే బంధాలన్నీ! బంధాలు మనల్ని పారవశ్యంలో ముంచెత్తుతాయి. ఆ పారవశ్యాన్ని తనివితీరా ఆస్వాదించేలోపే పుటుక్కున తెగిపోతాయి. చివరకు మెదడంతా శూన్యమే మిగులుతుంది. ఆ శూన్యంలో మరో ఆశాదీపం మరో బంధం రూపంలో వెలుగు చూస్తుంది. దాన్ని పట్టుకుని బ్రతుకు పట్ల ఆశని చిగురింపజేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాం. అదీ మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. దీంతో బ్రతుకు పట్ల విరక్తి పొడజూపుతుంది. ఆ విరక్తినే ఆత్మ సాక్షాత్కారానికి తొలిమెట్టని, మనమూ పరిపూర్ణులమవుతున్నామని మరోమారు మాయలో పడతాం. విరక్తి అనేది ఓ భావావేశపు స్థితి మాత్రమే అన్న ప్రజ్ఞ కోల్పోతాం. బంధాలు తెగిపోవడం వల్ల అక్కసుతో ఒంటరి తనం నుండి ఏర్పడే విరక్తి మనల్ని ముక్తి మార్గాన నిలిపేది కాదు. మనం దేన్నయితే ముక్తి మార్గమని భావిస్తామో దానిలో ముందడుగు వేయాలంటే ఒంటరితనాన్ని అలౌకికంగా ఆస్వాదిస్తూ లౌకిక బంధాల వ్యామోహాలేమీ మనస్సుని చేరకుండా నిశ్చలంగా కాలం గడపగలిగిన క్షణమే మనల్ని మనం ఉన్నతుల్ని చేసుకుంటూ సాగగలం.

ప్రపంచంతోపాటు కదలాడడం, సమూహంలో మిళితమైపోవడం ఒంటరిగా ఉండడానికి ఏమాత్రం అవరోధం కాదు. బంధాలన్నింటికీ బాధ్యతని నెరవేరుస్తూనే అదే క్షణం మానసికంగా ఆ మాయాప్రపంచం నుండి వేరుపడి ఒంటరితనంలో గడపగల నేర్పు అలవర్చుకుంటే బంధనాలూ సురక్షితంగానే ఉంటాయి, అంటీ ముట్టనట్లు ఉంటున్నామని ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదులూ
ఉండవు, ఒక్కమాటలో చెప్పాలంటే చెరగని చిరునవ్వు ప్రపంచాన్ని పలకరిస్తుంటే లోతైన ఆత్మపరిశీలన మనస్సు పుటల్ని శోధిస్తూ సాగిపోతుంటుంది.



(నల్లమోతు శ్రీధర్ గారి మాటల నుండి సంకలనము)

ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

నిన్న మా తమ్ముడి కాలేజీ లో "treditional  day" జరుపుకున్నారు.. 
ఈ "దినం" ప్రత్యేకత ఏంటంటే ప్రతీ ఒక్కరూ పంచేల్లో, చీరల్లో వెళ్లి ముగ్గులు వేయటం, గాలిపటాలు ఎగురవేయటం, భోగి మంటలు... ఇలా సంక్రాంతి వాతావరణాన్ని యువతకి తెలియజేయడం అన్నమాట..
ఏంటో ఈ కాలం ఇలా తయారయినందుకు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు... 
ఇంట్లో కూర్చొని మన సాంప్రదాయాలను తెలుసుకుని ఆచరించాల్సిన మనం ఈ రోజు ఎవరో ఒక కాలేజీ ఈవెంట్ లాగా conduct  చేస్తే వాడి దగ్గర ఏదో కాసేపు గెలవటానికి పెట్టుకున్న ముచ్చట లాగా అయిపొయింది... 
ఏం??? మనకు చీర ఎలా కట్టుకోవాలో కుడా పోటీలు పెడితే నేర్చుకుంటామా? 
పంచెలు కట్టుకునేది బహుమతులు గెలవటానికా????


ఈ ఒక్క సంక్రాంతి అని కాదు అసలు ఈనాటి యువతకి పార్టీలు, సినిమా లు తప్ప మన సంస్కృతి సాంప్రదాయాల మీద కనీస అవగాహన కూడా లేదు... 


పిల్లలే కాదు పెద్దలు కూడా ఎం తక్కువా అన్నట్లు "పండుగ ఒస్తే ఏదో ఇంట్లో షాప్ నుండి నాలుగు స్వీట్స్ తెచ్చుకుని తినేసి, ఖరీదైన బట్టలను కట్టుకున్నాము అంటూ పక్కన వారికి చూపించుకోవటమే" ప్రధానం గా మారిపోయింది...
అంతే కానీ అసలు పండుగ విశిష్టత కూడా తెలుసుకోవాలని కూడా అనుకోలేని దుస్తితిలో ఉన్నారు నేటి జనం...


అంతెందుకు మొన్నకి మొన్న ఏకాదశి రోజున నాకు కనిపించిన వారినల్లా "ఇది ధనుర్మాసం లో ఒచ్చే ఏకాదశి కదా... ఇంతకీ ఇది ఏ మాసం అని అడిగాను..." ఏ ఒక్కరూ కూడా ఇది "పుష్యమాసం" అని సమాధానం చెప్పలేకపోయారు...
కనీసం "ధనుర్మాసం అని అంటున్నారు కదా " ఎందుకు దీనిని ధనుర్మాసం అంటారు" అను అడిగాను దానికి కూడా సమాధానం లేదు.. ఈ ప్రశ్నలని కనీసం ఆరోజున ఒక డెబ్బై మందిని అడిగి ఉంటాను... 


ఇది ఒక్కటే కాదు మనం పుట్టిన నేల మీద మనకంటే ముందు పుట్టిన పద్దతులని సంప్రదాయాలని తెలుసుకోలేని ప్రతీ జన్మ నిరర్ధకమే...
మనం అబివృద్ది పధం బాట పట్టుకుని పాతాళానికి పోతున్నాము తప్ప ఈ కనిపించే ఎదుగుదల నిజం కాదు... దానిని మనం మన సాంప్రదాయాల మనుగడను కాపాడినప్పుడే నిజం చేసుకోగలము...
ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది... మన కట్టుబాట్లను తెలుసుకోవటం, కన్న తల్లి గురించి ఆలోచించటం ఒక్కటే...

ఇది మాత్రం ఏదో అబ్యర్ధనగా రాస్తున్నది కాదు... మనలో ఇవన్నీ తెలియని ప్రతీ ఒక్కరూ ఇకనైనా మేల్కొంటే మంచిదని చెప్తున్నాను... ఇకనైనా లేవలేని వారు, కనీసం ప్రయత్నించలేని వారు ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు...!

పేస్ బుక్ లో పరిచయాలు పెంచుకోవటం చాటింగులు, తరువాత మీటింగులు ఈనాటి యువతలో సర్వ సాధారణం అయిపొయింది..! దానికి నేనేమి మినహాయింపు కాకపోఇనా నిన్న నూతన సంవత్సరం సందర్బంగా ఫసుబూక్ లోని ఫ్రెండ్స్ అందరమూ కలవాలనుకుని నెల క్రితమే ప్లాన్ చేసుకున్నాము..
అయితే ఎలా ఎక్కడా అని చర్చించుకునే సమయం లో "మనం మాములుగా కలిసి ఎంజాయ్ చేయటం కంటే  ఆరోజు మన సంతోషం లో మానసిక వికలంగులకో, లేక అనాధ పిల్లలకో కుడా భాగం ఇస్తే బాగుంటుంది" అంటూ నా పేస్ బుక్ స్నేహితురాలు ఒకావిడ సలహా ఇచ్చింది. ఆవిడ ఆలోచన నాకెంతో ఆనందాన్ని కలిగించి, వెంటనే దానికి కావలిసిన ప్రణాలికను సిద్ధం చేశాను. అనుకున్న విధం గా ఒక పది మంది కలిసి చందాలు వేసుకుని అక్కడ పిల్లలకు పంచటానికి యపిలు పండ్లు, కమల పండ్లు కొన్నాము. అదే విధంగా ఒక ఇద్దరము పులిహార కుడా చేసుకుని  తీసుకు  వెళ్లి అక్కడ  పిల్లలతో  గడిపాము ..

కానీ అక్కడకు వెళ్లి అక్కడి పిల్లల పరిస్థితి చుసిన తరువాత మనసంతా ఎంతో బాధగా అన్పించింది... ప్రతీ రోజు ఎన్నో హంగు ఆర్భాటాలతో మనం బతుకుతున్న ఈ సమాజం లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్పించింది...! అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య... అయినా వాళ్ళ ప్రపంచం లో వాళ్ళు ఆనందం గా నే ఉన్నారు.. ఈ బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు.... ఎదుటి వాళ్ళు మనలని పట్టించుకోరేం అనే దిగులు వాళ్లకి లేదు... ఏవో అందని మెట్లు ఎక్కి ఎదుటి వాళ్ళని మెప్పించాలనే ఆలోచన వాళ్లకి లేదు... ప్రేమా ద్వేషం, దిగులు బాధలు కస్టాలు ఇలా అసలవంటే ఏంటో కుడా తెల్సుకోవాల్సిన పని వాళ్లకు లేదు...
రాజ్యాంగం నుండి హక్కులు కావాల్సింది మనకే కానీ వాళ్లకి ఆ అవసరం కుడా లేదు... ఎందుకంటే వాళ్ళు స్వేచ్చా జీవులు...

కాకపోతే వాళ్లకి కావాల్సింది అణువంత ఆప్యాయత. ప్రేమ పంచాల్సిన తల్లితండ్రులే మకేందుకంటూ పట్టించుకోకపోతే ఇక మాతృత్వానికి అర్దమేక్కడ????????????
ఏమిటో ఈ సమాజం, ఒక పక్క ప్రతీ   రంగం లో అభివృద్ధి బాటలు వేస్తున్న, డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నా ఎం లాభం?????? ఇలాంటి సందర్బాలలో ఆ జ్ఞానం పనికి రానప్పుడు?????????????

(ఇదంతా కొందరైనా ఆలోచిస్తారని చెప్తున్నాను కానీ ఏదో నేను వెళ్లి ఇలా చేసి ఒచాను అని చెప్పుకోవటానికి కాదు..)
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.