గురుపూజోత్సవం సందర్భం గా నా మనోగతం.....

ఈ రోజు గుర్తుందా... మన "సర్వేపల్లి రాదా కృష్ణన్" గారి జన్మదినోత్సవం, అంతే కాదు "ఉపాద్యాయ దినోత్సవం" కూడా.... ఒక అద్వితీయ అసామాన్య ఉపాద్యాయుడు మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఒక గురువు కావాలంటే రాష్ట్రపతి ఏంటి ఏమైనా కాగలదు.. కానీ ఆ పదవి కూడా కృష్ణన్ గారు కావాలని అనుకోలేదు.. ఆయనీ కాదు ఏ గురువు కూడా తన పదవి గురించి, పరపత్ గురించి కానీ ఏనాడు ఆలోచించడు, ఒక్క తన శిష్యుల భవిష్యత్తుని గురించి తప్ప...! అలా శిష్యుల కోసం పడే తపనలో నే గురువు జీవితం అయిపోతుంది.. అందుకే కాబోలు, సర్వేపల్లి వారు అంతటి మహనీయులు కాబట్టే వారి శిష్యులు వారిని పల్లకి లో ఊరేగించారు.. ఆయనకు బ్రహ్మ రధం పట్టారు. ఒక గురువు కు అంత కన్నా కావాల్సింది ఏముంది చెప్పండి..!

మరి నేడు మనం అందరం అలాగే ఉన్నామా? నిజం గా గురువును గౌరవిస్తున్నామా? గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం మర్యాద కూడా ఇవ్వలేని దుస్థితికి ఈనాడు దిగాజరిపోతున్నారు.. క్లాసు లో సదరు ఉపాద్యాయుడు ఉండగానే అల్లరి చేయడం, ఆయన/ఆమె పై చలోక్తులు విసరటం, అసలు బయటకు వెళితే ఆయన ఎవరో కూడా తెలియనట్లు ప్రవర్తించటం, ఇలా విద్యార్ది ప్రపంచం మరీ అద్వాన్నం గా తయారవుతోంది. ప్రస్తుత సమాజం లో ఇవన్నీ పాటించక పాయినా కనీసం ఉపాద్యాయుడు తరగతి గది లో ఉన్న కాసేపు అల్లరి చేయకుండా ఆయన చెప్పే మంచి విషయాలను ఆలకించి, చెప్పిన పని చేస్తే చాలు గురువుకి సన్మానం చేసినంత..! మనం అంత మాత్రమైన చేస్తున్నామా... ఒక్కసారి ఆలోచించండి....!

ఇక గురువుల విషయంకి ఒస్తే ప్రధమం లో చెప్పినట్లు ఒక విద్యార్ది జీవితం కోసం తన సర్వాన్ని మర్చిపోయే వాడు ఉపాద్యాయుడు అవుతాడు... అంత చక్కటి స్థానం లో ఉంటున్న ఈ నాటి గురువులు మరి ఆ స్థానానికి నిజం గా అంత గౌరవం ఇస్తున్నారా... కనీసం దాని విశిష్టతను తెలుసుకుంటున్నార....? నేడు గురువు పదవి, ఏదో ఒక సాఫ్టువేరు ఉద్యోగానికి మినహాయింపుగా మరిపాయింది.. పదవీ కాలం ఇంత ఉంది మాకు అని చెప్పుకోవదనికో, లేదా లెక్చరర్ పోస్టు ఉంది గా.. ఇక్కడే చేరితే మన ఊళ్లోనే ఒక పది వేలు సంపాదిన్చుకోవాచు అనే ఆలోచనలతో కాలం ఎళ్ళదీద్దామని, తమకు తెలిసిన అరకొర జ్ఞానం తో ఒచ్చేస్తున్నారు.... దీని వల్ల ఆ వృత్తికి కి పడే కళంకం గురించి పక్కన పెడితే విద్యార్దుల భవిష్యత్తు ఏమిటి...? ప్రతీ ఒక్కరు ఈ విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉంది... మన చేతిలో డిగ్రీ పట్టా పడగానే ఒక గురువు పదవిలోకి రావాలంటే మనకి ఆ అర్హత ఉందా అని పది సార్లు ఆలోచించి అడుగు పెట్టాలి... ఇదంతా ఏదో అందరిని కిన్చాపరచాడినికి కాదు, ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడి చేతిలో కొన్ని వందల విద్యార్దుల జీవితాలు ఆధారపడి ఉంటాయి అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది... అల జరిగినప్పుడే ఆ సర్వేపల్లి వారికి జరిగినట్టు కకపొఇనా కానీసం ఒక విద్యార్ది తన గురువుని మనసారా ఆరాధించగలుగుతాడు. గౌరవించగలుగుతాడు..

ఈనాటికీ కూడా గురువులను గౌరవించే విద్యార్దులు లేకపోలేదు.., అలాగే విద్యార్దుల భవితకి నిరంతరం తపన పడే ఉపాద్యాయులు లేకపోలేదు... కాకపోతే "విద్యార్ధి అనే వాడు లేకపోతే గురువు అనే పదమే ఉండదు" అని గురువు, "గురువు లేని నాడు ఎవడు విద్యార్థి కాలేడు" అన్న సత్యాన్ని ఒక విద్యార్ధి గుర్తించి, గురువు విద్యార్ధి వాత్సల్యాన్ని, విద్యార్ధి గురువు పై గౌరవాన్ని కలిగి ఉన్ననాడు ప్రతీ ఒక్కరు మహనీయులు గా ఉండగలరని ఆశిస్తూ......

(ఏమైనా తప్పులు ఉంటె మన్నించాలని ప్రార్ధిస్తూ నా జీవన గురువులందరకూ అంకితం....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.