అమ్మయిని సందులోకి ఎందుకు తీస్కేల్లావ్ రా..????

నిన్న రాత్రి హరీష్ గాడి గురించి పోస్టు రాసిన తరువాత మా స్నేహితులు సినిమా కి వెళ్దాం అంటే బయల్దేరాను.. మా ఫ్రెండు వాళ్ళింటికి వెళ్ళాలంటే ఆటో దిగిన తరువాత 10 నిమిషాలు నడవాలి.. అలా నడుస్తూ నా ఫ్రెండు హరీష్ గురించీ ఆలోచిస్తున్నాను.. ఆ సమయం లో దారి అంతా చీకటి గా ఉంది.. ఆ చీకటిలో అకస్మాత్తుగా ఒకమ్మ్మాయి తన మూడునెలల బిడ్డని చంకన వేస్కొని ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకుని
"అన్నా.. కాపాడన్నా... కాపాదన్నా.." అంటూ ఏడుస్తోంది. నాకు ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు..
"ఎం జరిగిందమ్మా ఏంటి విషయం అని అడిగాను.."
"వాడెవడో ఆటో వాడు నన్ను ఎక్కించుకుని అటు వైపు పొదల్లోకి తీస్కేల్తున్నాడు.. ప్లీజ్ కాపాడన్నా"
అలా ఆగకుండా ఏడుస్తున్న ఆ అమ్మయిని ఒక్కనిమిషం ఆపి అటువైపుగా చూసాను..
ఆ ఆటో వాడు తన వెనకాలే ఒచ్చాడు.."ఓయ్ ఏంటి ఎక్కు.." అన్నాడు..
ఏంటి విషయం ఏంట్రా.. అని అడిగాను..
డబ్బులియకుండా దిగేసింది అన్నాడు..
ఒరేయ్ నేను చూసాను రా నువ్వు అసలు ఆ అమ్మయిని ఆ సందులోకి ఎందుకు తీస్కేల్లావ్ రా..?????????
ముందు ఆటో దిగురా... అని అరిచాను.. వాడు ఏమో "సెల్లు బాలేదు గేర్ బాలేదు .." అంటూ సాకులు చెప్తున్నాడు..
వాడు అబద్దం చెప్తున్నాడని అర్ధం అయిపొయింది.. అయినా వాడు ఆగలేదు ఆ అమ్మయిని "ఓయ్ నువ్వు ఎక్కుతావా ఎక్కవా.." అంటూ చేయి పట్టుకోబోయాడు... ఇక నా సహనం నశించి వాడిని నాలుగు తగిలించాను.. ఇదంతా చుసిన పక్కన చాలా మంది గుమిగూడారు..
ఇదంతా ఇలా ఉంటె ఆ అమ్మాయి ఏమో " అన్నా ప్లీజ్ అన్నా ఇక్కడ ఉండనన్నా.. నన్ను ఇంటి దగ్గర వరకు దింపన్నా...  ప్లీజ్ అన్నా.." అంటూ ఏడుస్తోంది..
ఇక తన భయం చూసి వాడి సంగతి అక్కడి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు వాళ్లకి అప్పగించి ఆ అమ్మయిని ఇంటి వరకు దింపి  వచ్చాను..
చివరికి తను నన్ను పిలిచి "అన్నా ఇక్కడ ఇంటిపక్కన వాళ్ళు ఎవరినా అడిగితే ఇలా జరిగింది అని చెప్పకు, మళ్లీ మా ఆయనకీ తెలిస్తే కొడతాడు.." అని చెప్పింది..
అలాగే అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు.. అని చెప్పి ఒచ్చాను..

ఒంటరిగా ఒదిలి వెళ్ళిపోయిన నా స్నేహితుడి జ్ఞాపకాలతో...!

ఎప్పుడూ అమాయకం గా ఉంటూ, మనసులో కల్మషం లేని నా స్నేహితుడు హరీష్. నా చిన్నప్పటి చెలిమి వాడు... ఈమధ్యనే వాడు రైలు ప్రమాదం లో మరణించాడు... నాకు ఇష్టమైన మొదటి వ్యక్తి వాడే...
వాడి స్నేహమనే ప్రపంచంలోకి సాదరంగా ఆహ్వానించి ఒంటరిగా ఒదిలి వెళ్ళిపోయిన నా స్నేహితుడి జ్ఞాపకాలతో వాడు ఎక్కడ ఉన్నా నా ఈ ఆవేదన వినాలని కోరుకుంటూ, ఇంకో జన్మ అంటూ ఉంటె నాకు తన స్నేహాన్ని అందించటానికి నా మిత్రుడుగా రావాలని...


నా ప్రాణం నువ్వు... నా ఊపిరి నువ్వు... నా సంతోషం నువ్వు...
నా దుఖం నువ్వు... నా బాధ నువ్వు... నా ఆనందం నువ్వు...
ఇలా పూర్తిగా నువ్వే నేను గా మారిపోయాను.
కానీ ఈలోగా నువ్వే లేకుండా పోయావు...


చనిపోవాలనిపించింది... నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం గా కనిపించింది...
ఎటుచూసినా చిమ్మచీకటి అలముకుంది నా బతుకు...
 ఆగని కన్నీరు... తగ్గని భాద...!
తరగని దూరం... చెదిరిన స్వప్నం...


కానీ మరల నాకు పునర్జన్మనిచ్చావు నీవే...


ఎందుకంటే నీతో గడిపిన ఆ మధుర క్షణాలు ఇంకా నాలో సజీవంగానే ఉన్నాయి...
నీవు ఇంకా నాతోనే ఉన్నావు...
నా అంతిమ శ్వాస వరకు నాతోనే ఉంటావు నా గుండెల్లో...
నీ ఆలోచనలు ప్రతీక్షణం మేమున్నామంటూ జీవం పోస్తున్నాయి...


నీలాంటి స్నేహితుడిని నేను ఏ జన్మలోనూ వీడలేను. వీడిపోను..
ఎన్ని జన్మలున్నా నీతో స్నేహం చేయాలనీ కోరుకుంటూ...


స్నేహం మరణించదు...!
నీ స్నేహితుడు  సత్యం.

కనుపాప వర్షించే ఆఖరి కన్నీటి బొట్టు

గుండెల్లో కసి ఎగసి ఆకాశాన్నంటితే మాత్రం లాభమేంటి...
కను చాయాలలో అంతా శూన్యమే కన్పిస్తుంటే..!

ఎడురుచూపులలో సమయంమించి ఎండిపోయిన

కనుపాప వర్షించే ఆఖరి కన్నీటి బొట్టులో ఉన్న ఆర్తనాదం
ఎవరికీ మాత్రం వినిపిస్తోంది..??????

ఎటూ అర్ధం కాని ఈ విధి విలాసం లో వెచ్చటి దుఖం తో

భందాలు తెంపమని ప్రాదేయపడుతున్నా ఆ దేవుడి నుండి బదులే లేదు..

స్నేహితులు లేరు, ప్రేమికులు లేరు, చుట్టలసలె లేరు..

మరి ఎవరి తోడు నీడలా గుండె కింద రగులుతున్న మంటలా
కాల్చేదెవరు...? సెగను రగిల్చేదెవరు..????

ఇలా ఏ ఒక్కటీ అర్ధంకాని సమయం లో అన్ని ప్రశ్నలకీ


ఒకటే వైనం - అదే మౌనం - మనస్శంతికో ఔషదం

అమ్మ అలిసిపోయింది

"అమ్మా.. రేపు పొద్దున్నే తొందరగా లేపు కాలేజీ కి వెళ్ళాలి..."
"ఇలాంటి కూరలు వండకమ్మా.. తిని తిని చిరాకొస్తోంది..."
"అమ్మా.. నా బట్టలు కనిపించటం లేదు ఎక్కడ సర్ది పెట్టావు....?"
"అమ్మా.. రేపు నా ఫ్రెండ్స్ ఒస్తున్నారు వాళ్ళు ఒచ్చే సరికల్లా వంట చేసి ఉంచు ఓకే నా?"
"అబ్బా... సినిమా మాత్రం సూపర్ అమ్మా.. కాకపోతే కొంచెం టైర్డ్ అయ్యాను... ఇప్పుడే కదిలించకు..."
"ప్చ్.. నస పెట్టకు చదువుకుంటాలే ... నాకు తెలియదా....?" 

ఇలా మన రోజువారీ జీవితం లో మనం ఎన్ని సార్లో అమ్మని చీదరించుకుంటూ, విసుక్కుంటూ, లెక్కచేయకుండా వేల్లిపోతం... అందరు కాకపోఇనా నాకు తెలిసినంత వరకు 99 శాతం ప్రతీ ఇంట్లో జరిగేదే...! 

మనం అనుకోవాలి కానీ చేయటానికి ఇంట్లో బోలెడు పనులుంటాయి, అయినా సరే ఏ పనీ చేయకుండా ఎప్పుడు ఇంట్లో పనులు చూసుకునే అమ్మని విసుక్కుంటాం... అంత కష్టపడి చేసిన వంటలకి వంకలు పెడతాం.. అంతే కానీ మనకోసం ఎంత ప్రేమతో చేసిందో గుర్తించం...! 

మనం బయట ఫ్రెండ్స్ తో సినిమాలు షికార్లు తిరిగేసి ఒచ్చి"అబ్బా అలిసిపోయాన్రా బాబోయ్.." అనుకుంటాం కానీ రాత్రీ పగలు ఇంట్లో ఎంతో శ్రమ పడే అమ్మ ఎంత అలిసిపోతోందో ఆలోచించము...! 

తాను ముందే తినేస్తే ఎక్కడ పిల్లలకి తక్కువైతుందో అని, పిల్లలు భోజనం చేసేవరకు అమ్మ అలాగే తినకుండా ఉంటుంది.. అలాంటప్పుడు కూడా కనీసం "అమ్మా తిన్నావా... నువ్వు తినేసేయచ్చుకదమ్మా...?" అని అనము.. ఒకవేళ అన్నా కానీ మళ్లీ ఆ తల్లి నుండి ఒచ్చే సమాదానం "మీ కడుపు నిండితే నాది నిండినట్టే రా... నువ్వు కానివ్వు..." అది తల్లి ఆపేక్ష..!

 ఏనాడు అమ్మ "నేను అలిసిపోయాను రా చేసి చేసి.." అని అనదు... ఎందుకంటే తన పిల్లలకోసం కష్టపడటం లోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది అమ్మ...! మన నవ్వు లోనే కొండంత ఆనందాన్ని పొందుతుంది... మన సంతోషాన్ని చూసి పొంగిపోతుంది...!

అలాంటి అమ్మ కి మనం చేయాల్సిందల్లా ఒక్కటే... ప్రేమతో ఒక చిన్న పలకరింపు...! మనం వెళ్లి తన పనులన్నీ చేసిపెట్టాక పోయినా తన శ్రమను గుర్తిస్తే చాలు... తన పనిలో ఏదో ఒక చిన్న చిన్న సాయం చేసినా చాలు అమ్మ మనసు ఆనందిస్తుంది... అలసిన అమ్మ అలసట ను మర్చిపోయి మరీ మానకై ఇంకా కష్టపడటానికి సిద్దమవుతుంది... అది.. అమ్మ మనసు....!


(ఫేసు బుక్కు లోని నా స్నేహితురాలు "అపర్ణ దాసరి" ఈ అంశం మీద తనకొక ఆర్టికలు కావాలని అడగటం తో అందరూ తెలుసుకునే మంచి విషయాలు కనుక ఇక్కడ తన కోసం ప్రత్యేకం గా రాసాను..! కాబట్టి ఇంతమంచి సంగతిని ఇంతమందితో పంచుకోగలగటానికి కారణమైన అపర్ణ కు ధన్యవాదములు..)
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.