నా గురించి


హాయ్ ఫ్రెండ్స్......

నా గురించి చెప్పాలంటే చాలానే ఉంది....
ముందుగా మా ఇంటి గురించి చెప్తాను....
మా ఇంటి కథ:
మాది సనాతన బ్రాహ్మణ కుటుంబం. మా ఇంటి పేరు గడ్డమణుగు.
మా ఇంట్లో మొదటగా మా నాన్నగారు... ఆయన ఒక కష్టజీవి.... ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి మా భవిష్యతు కోసం ఆయన పడే తపన చూస్తుంటే ఎంత గర్వ పడతానో.....
ఇక మా అమ్మ, మేమంటే పిచ్చి ప్రేమ.... తనకి మా ఇల్లు తప్ప ఇంకో లోకం లేదు.... కనీసం మా ఇంట్లో దూర దర్శిని కూడా లేదు అమ్మ కాలక్షేపం చేయడానికి.... రోజంతా మా ఆలోచనలతోనే గడిపేస్తుంది......
మా తమ్ముడు.... వాడంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకో తెలియదు వాడితో రోజూ గొడవ పడతాను కానీ వాడంటే ప్రాణం....

నాన్నగారి లో "పట్టుదల.." అమ్మ లో "ఓర్పు..." తమ్ముడిలో "ఆవేశం...." నాకు నచ్చేవి.......!

ఇప్పుడు ఇంక నా గురించి......

నా పేరు వెంకట సత్యనారాయణ రావు,
నన్ను కొంతమంది సత్యం అని, సత్య అని, సత్యనారాయణ అని పిలుస్తుంటారు....
మా అమ్మ మాత్రం కన్నయ్యా అని పిలుస్తుంది...... నాన్న గారేమో సుప్రీం అని అంటారు(అప్పుడప్పుడు...) అన్నిటి కంటే స్పెషల్ గా మా తమ్ముడేమో 'అన్యా' అని పిలుస్తాడు.... అదేంటో మిగతా వాళ్ళని అన్నయ్య అని అంటాడు కానీ నన్ను మాత్రం అన్యా అని పిలుస్తాడు.......

నేను కొంచెం సున్నిత స్వభావం కల వాడిని. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషం గా ఉండాలి అనుకుంటాను.... అందరితోనూ యిట్టె కలిసిపోతాను.... ఎంత కొత్త వాళ్లైనా ఐదు నిముషాలు మాట్లాడితే ఫ్రెండ్స్ ఐపోతారు..... (actually ఏంటంటే నేనే అందరు నాతో కలిసిపోవాలి అనుకుంటూ ఉంటాను....) నా బలం బలహీనత రెండూ నా మాటలే.... ఎందుకంటే ఎదుటి వాళ్ళని తొందరగా నా మాటలతో ఇంప్రెస్స్ చేస్తా కాని ఏదైనా ప్రాబ్లం ఒచినపుడు మాత్రం నోటివెంట మాట రాదు....
ఇంకా....... ఎలాంటి పరిస్తితులకైనా సర్దుకు పోతాను.. ఎవరైనా నన్ను ఏమైనా అనవసరంగా అంటున్నా పెద్దగా పట్టించుకోను.... అలాగని నాకు కోపం రాదని కాదు... కాకపోతే కాలమే వాళ్లకి సమాధానం చెప్తుంది అని నమ్ముతాను.... ఈ సందర్భం లో మీకు ఓ రెండు కథలు చెప్పాలి. 

1) షిరిడి సాయి బాబా ఒక సారి ఎం చెప్పాడంటే..."మనం ఎవరినైన తిట్టితే వాళ్ళ పాపాల్ని మన నాలుకతో తుడిచేసి వాటిని మనం తీసుకునున్నట్లు లెక్క! అని అర్ధం. కాబట్టి ఎదుటి ఎవరిని కూడా దుషించాకూడదు......" అని...!

2) ఒకసారి గౌతమ బుద్దుడు విహారానికి వెళ్ళినపుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి కోపంగా ఒచ్చి బుద్దుని రథానికి అడ్డం గా నిల్చుని పిచ్చి పిచ్చిగా స్వామిని తిడుతున్నాడట! దీనిని తట్టుకోలేని రథ సారధి కిందకు దిగి తిట్టలనుకున్నాడు... కానీ బుద్దుడు ఆ రథ సారథిని వద్దు అని ఆపాడు...
రథ సారధి: ఏమిటి స్వామి! వాడు ఇందాకట్నుంచి మిమ్మల్ని అంతలా దూషిస్తుంటే నన్ను ఆపుతారెంటి....?
బుద్దుడు: ముందు నాకు ఒక సమాదానం చెప్పు..... నా దగ్గర రెండు పండ్లు ఉన్నాయి నీకు ఒకటి ఇచ్చాననుకో, కానీ నువ్వు దానిని తీస్కోకపోతే ఆ నీకు ఇచ్చిన పండు ఎవరికి చెందుతుంది...?
రథ సారధి: మీకే.....
బుద్దుడు: అంతే నాయనా! వాడు ఇప్పుడు మనకి ఇస్తుంది కూడా ఒక పాపపు ఫలమే.. మనం పట్టిచుకోకుండా వాడి మానాన వాడిని వదిలేస్తే వాడి పాపం వాడి దగ్గరే ఉంటుంది.....

1 కామెంట్‌:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.