నేటి నిజాలు..

నేటి నిజాలు..
పెద్ద ఇల్లు - ఉండేదేమో చిన్న కుటుంబం
ఎక్కువ డిగ్రీలు - కానీ తెలివి సున్నా..
కొత్త కొత్త మందులు - కావల్సినంత అనారోగ్యం
చంద్రుడ్ని తాకిన మనిషి - తోటి మనుషులెవరో తెలుసుకునేంత తీరిక లేదు.
మంచి జీతం - మానసిక ప్రశాంతత లేదు.
విలువలు లేని సంబంధాలెన్నో - అందులో నిజమైన ప్రేమ ఒక్కటీ ఉండదు..
వేల మంది ఫేసుబుక్కు ఫ్రెండ్స్ - ఆప్త మిత్రులు కరువయ్యారు..
మద్యం ఎక్కువ - మంచి నీళ్ళు తక్కువ
ఎంతో మంది మానవులు - కరువైన మానవత్వం
విలువైన గడియారాలు - కాని సమయమే లేదు ఎవరి దగ్గరా..!
- సత్యం గడ్డమణుగు, 23-10-2013, 02:04
www.naathalapulu.blogspot.com

మత్తెక్కడ..?

------------------------------------------

మందులోన లేదు
పొందులోనా లేదు,
విందులోన లేదు,
ఎందులోన ఉందో పొందికైన మత్తు..,

కిక్కెక్కే మత్తు,
కైపెక్కే మత్తు,
కిర్రెక్కే మత్తు,
చిర్రెత్తే మత్తు..,

మత్తు లోనె మునిగిపోయె
మంచివాళ్ల కాలం

మత్తులోనె చితికిపోయె
ఆడదాని బతుకులు,

మత్తుకోసం చచ్చిపోయె
మగవాళ్ళ గొంతులు..,

చేతుల్లో చలగాటం,
మాటల్లో మాయాజాలం,
బుద్ది లేని బుద్దిమంతుల
బుజ్జి బుజ్జి కోలాటం..

మత్తు కత్తి కోస్తోంది అంతులేని జీవితాలు
మత్తు ముంచివేస్తోంది రాజకీయ నాటకాలు,
మత్తు మంట లేపుతోంది అకలికై పోరాటాలు,
మత్తు కంచె కడుతోంది మనవత్వపు విభేధాలు..

ప్రపంచానికి ఊపిరి మత్తు..
మత్తుకి ఎన్నో రూపాలు..


- సత్యం గడ్డమణుగు, 07-10-2013, 21:50

నా (దరిద్ర) దేవత

నేనంటే నీకెందుకంత ప్రేమ..?
నేనంటే నీకెందుకంత మోజు..?
నీ కొంగు గాలి కూడా సోకరాదని
అందరూ ఆమడ దూరంలో ఉంటే,
నిన్నూ అందమైన సృష్టిలో భాగమని
భావించటమేనా నా తప్పు..?
ఎన్నో కోట్ల మంది జీవరాసులలో నీకు నేనే ఎందుకు నచ్చానూ..?
మచ్చుకకైనా ఎవరూ చూడలేనినీ హొయలను
హంసతూలికా తల్పం మీద పరిచి నా ముందు
ప్రదర్శింపజేస్తున్నావు.. నన్ను ముగ్ధుడ్ని చేస్తున్నావు..
నీలో ఏదో తెలియని మత్తుంది..
మత్తులో ప్రపంచం నాకు తెలియకుండానే నా నుండి వీడిపోతోంది..
అందరికీ నేను కానివాడ్నైపోతున్నాను..
అయిన వాళ్లలో చులకనైపోతున్నాను..
ఇప్పటివరకు ఉన్న మంచి మర్యాదలు మాయమైపోతున్నాయి..
ఐనా ఎందుకో తెలియదు, నీ మోజు మాయ నా మీద పనిచేస్తున్నా.,
మళ్ళీ నేనూ మనిషినే అన్న సంగతి గుర్తొచ్చినప్పుడు,
నువ్వు పెద్ద రాక్షసిలా కనిపిస్తున్నావు..
అయినా కూడా మళ్ళీ నా కంట కన్నీటిని నింపి అందులోకి
దూరిపోతున్నావు.. నువ్వే నా జీవితమైపోతున్నావు..
నాకు తెలుసు..
నాకు మాత్రమే తెలుసు..
ఇంకెవ్వరికీ తెలియదు..
కాదు కాదు తెలుసుకునే వారే లేరు కదా..
ఎప్పటికైనా నన్ను చేరే
సిరి నీ రూపమే అని..!
అందుకే పిచ్చి జనాలకి నీ తత్వం అర్దం కాక
నిన్ను ప్రేమిస్తున్న నన్ను పిచ్చివాడంటున్నారు..!


- సత్యం గడ్డమణుగు,07-10-2013, 20:03
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.