బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు...!

పేస్ బుక్ లో పరిచయాలు పెంచుకోవటం చాటింగులు, తరువాత మీటింగులు ఈనాటి యువతలో సర్వ సాధారణం అయిపొయింది..! దానికి నేనేమి మినహాయింపు కాకపోఇనా నిన్న నూతన సంవత్సరం సందర్బంగా ఫసుబూక్ లోని ఫ్రెండ్స్ అందరమూ కలవాలనుకుని నెల క్రితమే ప్లాన్ చేసుకున్నాము..
అయితే ఎలా ఎక్కడా అని చర్చించుకునే సమయం లో "మనం మాములుగా కలిసి ఎంజాయ్ చేయటం కంటే  ఆరోజు మన సంతోషం లో మానసిక వికలంగులకో, లేక అనాధ పిల్లలకో కుడా భాగం ఇస్తే బాగుంటుంది" అంటూ నా పేస్ బుక్ స్నేహితురాలు ఒకావిడ సలహా ఇచ్చింది. ఆవిడ ఆలోచన నాకెంతో ఆనందాన్ని కలిగించి, వెంటనే దానికి కావలిసిన ప్రణాలికను సిద్ధం చేశాను. అనుకున్న విధం గా ఒక పది మంది కలిసి చందాలు వేసుకుని అక్కడ పిల్లలకు పంచటానికి యపిలు పండ్లు, కమల పండ్లు కొన్నాము. అదే విధంగా ఒక ఇద్దరము పులిహార కుడా చేసుకుని  తీసుకు  వెళ్లి అక్కడ  పిల్లలతో  గడిపాము ..

కానీ అక్కడకు వెళ్లి అక్కడి పిల్లల పరిస్థితి చుసిన తరువాత మనసంతా ఎంతో బాధగా అన్పించింది... ప్రతీ రోజు ఎన్నో హంగు ఆర్భాటాలతో మనం బతుకుతున్న ఈ సమాజం లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్పించింది...! అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య... అయినా వాళ్ళ ప్రపంచం లో వాళ్ళు ఆనందం గా నే ఉన్నారు.. ఈ బయట ప్రపంచపు దుమ్ము వాళ్ళ మనసులను ఎన్నటికీ అంటదు.... ఎదుటి వాళ్ళు మనలని పట్టించుకోరేం అనే దిగులు వాళ్లకి లేదు... ఏవో అందని మెట్లు ఎక్కి ఎదుటి వాళ్ళని మెప్పించాలనే ఆలోచన వాళ్లకి లేదు... ప్రేమా ద్వేషం, దిగులు బాధలు కస్టాలు ఇలా అసలవంటే ఏంటో కుడా తెల్సుకోవాల్సిన పని వాళ్లకు లేదు...
రాజ్యాంగం నుండి హక్కులు కావాల్సింది మనకే కానీ వాళ్లకి ఆ అవసరం కుడా లేదు... ఎందుకంటే వాళ్ళు స్వేచ్చా జీవులు...

కాకపోతే వాళ్లకి కావాల్సింది అణువంత ఆప్యాయత. ప్రేమ పంచాల్సిన తల్లితండ్రులే మకేందుకంటూ పట్టించుకోకపోతే ఇక మాతృత్వానికి అర్దమేక్కడ????????????
ఏమిటో ఈ సమాజం, ఒక పక్క ప్రతీ   రంగం లో అభివృద్ధి బాటలు వేస్తున్న, డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నా ఎం లాభం?????? ఇలాంటి సందర్బాలలో ఆ జ్ఞానం పనికి రానప్పుడు?????????????

(ఇదంతా కొందరైనా ఆలోచిస్తారని చెప్తున్నాను కానీ ఏదో నేను వెళ్లి ఇలా చేసి ఒచాను అని చెప్పుకోవటానికి కాదు..)

12 కామెంట్‌లు:

  1. చాలా మంచి పని చేసారు మిత్రమా

    రిప్లయితొలగించండి
  2. goppa prarbham icharu nuthana samvatsaram modatilo alage maku kuda alochinche la chepparu thanks

    రిప్లయితొలగించండి
  3. ఫేస్ బుక్ ను వాడడం తప్పు కాదు.
    పెరిగిన టెక్నాలజీతో పాటు మానవత్వం పెరిగితే మంచిది.
    టెక్నాలజీ ఎపుడూ అభివృద్ది అవుతూనే వుంటుంది.కావాలి కూడా .
    కానీ ఏది అభివృద్ది అయినా అది మనుషుల ఐక్యతను పెంచేందుకు ఉపయోగపడాలి.
    మీ ఫేస్ బుక్ స్నేహితురాలు చెప్పింది - మీరు చేసింది మంచి పనే . దానికి దోహదం చేసింది టెక్నాలజీనే. కెరీరిజం పేరుతో మనుషుల మధ్య దూరం పెరిగి అసలు సిసలు మానసిక రోగులుగా మారుతున్నారు.
    'కళ్ళు' సినిమాలొ చెప్పినట్టు కల్లుండీ చూడలేని వాళ్ళే నిజమైన కబోధులు. మనసులేని మనుషులే మానసిక వికలాగులు.
    ఏదైనా కొత్త్ సమ్వత్సరం లో ఒక మంచి పని చేసారు.అభిననందనలు.

    రిప్లయితొలగించండి
  4. అబ్బా... మంచి పని చేశారు...ఇది ఇంకొంత మందికి ఆదర్శంగా మారి అందరూ ఇలా చేస్తే ఎంత బాగుంటుందో..కదా...

    రిప్లయితొలగించండి
  5. చాలా మంచిపని.. ఎంత బాగా చేసారో, అంతే బాగా రాసారు..

    రిప్లయితొలగించండి
  6. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు... కొండలరావు గారూ మీరు చెప్పింది నిజమేనండీ..!

    రిప్లయితొలగించండి
  7. saw ur article just now and culdnt stop myself frm replying....kudos to the step u hve taken and its good that chat frnds hve clubbed up together to spend some quality time. i guess we can form into a group and collect the unused things and distribute to the needy people once every quarter! its not that they require the material comforts but it wud be good to spend some time doing something needful

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.