నా కోటు = మా నాన్న ప్రేమ + నమ్మకం...!

నాలుగురోజులు సెలవు తర్వాత నిన్న సాయంత్రం రైలు లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి "ఒరేయ్ రేపు మనకి జాబు ఫెయిర్ ఉంది, కచ్చితంగా అందరు సూటు వేస్కొని టై కట్టుకుని రావాలి... ఇది మన హెచ్.ఓ.డీ. ఆర్డర్ రా..." అని అన్నాడు...!

నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు... మాములుగా ఐతే అందరు పెళ్ళిళ్ళకి వెళ్తే మంచి అదిరిపోయే డ్రెస్సులు వేస్కుని వెళ్తారు... కానీ నేను కాలేజీ కి వెళ్ళినా ఒక ఫంక్షన్ కివేల్లినా నాకున్న మంచి నాలుగు డ్రేస్సులనే వేస్కుంటాను... అలాంటిది సూటు సంగతి పక్కన పెడితే ఈ పెళ్లి ప్రయాణం లో నాకున్న ఆ మంచి డ్రెస్సులు కూడా ఉతికి లేకపోయే సరికి పాపం మా అమ్మ ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నా కనీ నాకోసం నీళ్ళు పట్టుకుని బట్టలు ఉతికింది....

ఇది ఇలా ఉంటె ఇవాళ పొద్దున్నే నాన్న "ఒరేయ్ కాలేజీ లో ఏదో ఉందన్నావ్ గా రెడీ అవ్వు..." అంటూ లేపారు.. లేచిన దగ్గర నుండి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కి "ఒరేయ్ నీ దగ్గర కోటు ఉంటె ఇస్తావా... సాయంత్రం ఇస్తాను" అని ఫోన్ చేశాను... కానీ వాళ్ళు లేదు అన్నారు.. చాలా వరకు ఫ్రెండ్స్ ని అడిగి చూసాను...(నిజానికి ఎవరినైనా ఏమినా అడగాలంటే నా అహం అడ్డొస్తుంది... ఎవరిని ఏమి అడగను... మనం ఎప్పుడూ కూడా హుందాగా ఉండాలి అనేది నా అభిమతం... కనీ ఇప్పుడు తొందరగా నీకు అవసరం ఉంది కదా ఎం కాదు ప్రయత్నం చేయి తప్పు లేదు అని మా అమ్మ చెప్పిన మాటలకి ఇక తలవంచాను..)
మా చుట్టాల్లో ఒక మామయ్య ఉన్నాడు.. అయన చాలా ధనికుడు... నా చిన్నప్పటినుండి ఆయనని కారులలో సూటు వేస్కొని తిరగటం చూసాను.. ఎందుకో గుర్తోచి ఆయనకి ఫోన్ చేసి అడిగితే "అసలు నేను వేస్కోను కదా, నాకు అలవాటే లేదు.. నాదగ్గర ఎందుకుంటది...!" అన్నాడు.
ఆ మాటకి మా నాన్నగారి మనసు చాలా నొచ్చుకుంది.. చాలా బాధపడ్డారు.. నాక్కూడా చాలా బాదేసింది...  "ఒద్దులే నాన్నా..! మా హెచ్.ఓ.డీ. నాకు తెలుసు బాగానే... నేను చూసుకుంటాలే ఇక ఒదిలెయ్." అని చెప్పాను.. కానీ నాన్న మాత్రం పౌరుషం తో అప్పటికప్పుడు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని షాప్ కు తీసుకెళ్ళి కోటు కొనిచ్చి ఒకటే ఒక మాట చెప్పారు.. "అరేయ్ నాన్నా..! నా పేదరికం నీకు అడ్డు కాకూడదు ఎప్పుడు నువ్వు మంచి పోసిషన్ లో ఉండాలి.. చూసావుగా వాడు ఎలా అన్నాడో.. అలాంటి మనలని చులకనగా చూసే వాళ్ళందరికీ సమాధానం గా నువ్వు అంత మంచిగా పైకి రావాలి రా... అదే నా కోరిక... ఇంకా నువ్వు దర్జాగా వెళ్లి రా నాన్న...!" అని చెప్పారు...

నాన్న మాటకి ఎదురు చెప్పలేక సూటు వేస్కున్నాను కానీ అసలు ఇంట్లో పరిస్తితి కి ఆ కోటు కొనటం నాకు ఇష్టం లేదు... ఐనా సరే ఆయన కొనిచ్చారంటే నాకు నాన్న ను తలచుకుంటేనే సంతోషం గా ఉంది... నేను భవిష్యత్తులో ఎలా ఉంటానో తెలియదు కానీ తను ఏమైనా పర్లేదు మేము బాగుండాలని నిద్రాహారాలు మాని నిరంతరం మాకోసం కష్టపడే నాన్నను చూసినప్పుడల్లా మాత్రం నాన్న స్ఫూర్తి తో ఐనా నేను బాగా చదువుకుని మంచి స్థాయి లో ఉండాలి అన్పిసుంది...!

ఐ లవ్ యు నాన్నా.............!

రాక్షసుడిగా మిగిలిపోతాడు "నాన్న...."

ఒక్కొక్క వయసులో పిల్లల ఆలోచనా సరళిలో ఎంతో మార్పు కన్పిస్తుంది...
కన్నబిడ్డల కోసం రేయింబవళ్ళూ శ్రమపడుతూ వారు ఎంతో ఎదగాలని తపిస్తూ గారాబంతో దారితప్పుతారేమోనన్న భయంతో ప్రేమనంతా గుండెల్లోనే దాచుకుని లేని కాటిన్యాన్ని ప్రదర్శించి పిల్లల దృష్టిలో రాక్షసుడిగా మిగిలిపోతాడు "నాన్న...."
అదే తనను గుండెల మీద ఆడించి పెంచిన "నాన్న" గురించి పిల్లలు ఏ వయసులో ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు చూస్తె...



4 ఏళ్ళ వయసులో..: మా నాన్న చాలా గ్రేట్

6 ఏళ్ళ వయసులో..: నాన్నకు అన్నీ తెలుసు 

10 ఏళ్ళ వయసులో..: నాన్న మంచివాడే కానీ... ఊరికే కోపమొస్తుంది. నాన్నకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకే ఎక్కువ తెలుసు.

12 ఏళ్ళ వయసులో..: చిన్నప్పుడు నాన్నకు నేనంటే ఇష్టం ఉండేది. ఏమడిగినా కొనిపెట్టేవాడు.

16 ఏళ్ళ వయసులో..: కంప్యుటరూ, ఇంటర్నెట్టూ ఏదీ రాదు. అసలు ఈ డాడీ కి ఏది చేతకాదు.

18 ఏళ్ళ వయసులో..: అబ్బా.. ఈయనకు రోజురోజుకూ చాదస్తం పెరిగిపోతోంది. ఒక్కమాటకూ అర్ధం ఉండదు.

20 ఏళ్ళ వయసులో..: బాబోయ్ నాన్నను భరించటం చాలా కష్టం. పాపం అమ్మ ఈయనతో ఎలా వేగుతోందో..!

25 ఏళ్ళ వయసులో..: ఏది చెప్పినా కాదంటారు. అసలీయన ప్రపంచాన్ని ఎప్పుడు అర్ధం చేస్కుంటారో!

35 ఏళ్ళ వయసులో..: నాన్న నన్నెంత క్రమశిక్షనగా పెంచారు... వీడేంటీ ఒక్కమాటా వినడు..!(వీడికి కూడా కొడుకు పుట్టాక..)

45 ఏళ్ళ వయసులో..: అన్నయ్య,అక్క,నేను,చెల్లి...ఇంతమందిని పెంచటానికి నాన్న పాపం ఎంత కష్టపడ్డారో, ఒక్కడితోనే నా తలప్రాణం తోకకోస్తోంది.

50 ఏళ్ళ వయసులో..: నాన్నకి ఎంతైనా దూరదృష్టి ఎక్కువ. మా అందరి చదువులూ ఉద్యోగాలూ... ఎంత ప్లాన్ గా తీర్చిదిద్దారు! అలాంటి మనుషులు చాలా అరుదు.

60 ఏళ్ళ వయసులో..: మా నాన్న చాలా గొప్పవాడు.

నాన్నను అర్ధం చేస్కోవడానికి మరీ అంతకాలం కావాలా..... కాస్త ముందే కళ్ళు తెరవలేమా..? 

(ఇది కేవలం మార్పు రావాల్సిన అవసరం ఉన్న వారిలో కొంతైనా చైతన్యం తెచ్చే క్రమంలో నే రాసాను కానీ అందరిని ఉద్దేశించి కాదు..)

తండ్రి ప్రేమ పిల్లలకెంతో ముఖ్యం....!



పూర్వం తండ్రి అంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం, తండ్రి గుమ్మంలోకి అడుగుపెట్టారంటే చాలు ఇంట్లో మౌనం తాండవమాడేది. పిల్లల కోరికల చిట్టా అంతా అమ్మ దగ్గరే. నాన్నకీ, పిల్లలకూ మధ్య అమ్మ వారధిగా నిలిచేది. పిల్లల విన్నపాలన్నీ తండ్రికి చేరేసేది. నేడు పరిస్థితులు మారాయి. పిల్లల పెంపకం తల్లి బాధ్యతేననే రోజులుపోయాయి. ఈమార్పు మెచ్చుకోదగ్గది. నేటి ఖర్చురోజుల్లో ఒక్కరితో ఇల్లు గడవడం ఎంత కష్టమో... ఉద్యోగంచేసే ఇల్లాలు అన్నిపనులూ చక్కదిద్దుకోవడం అంతే కష్టం. అలానే పిల్లల బాధ్యత కూడా!అసలు పిల్లలకు ఇద్దరి ప్రేమ అవసరం. అమ్మ అనురాగం ఒక్కొక్కసారి పిల్లల తప్పుల్ని కాస్తుంది. మరేం ఫర్వాలేదని ధైర్యాన్నిస్తుంది. కానీ నాన్న ప్రేమ క్రమశిక్షణతో కూడి ఉంటుంది. అందుకే తండ్రి ప్రేమ పిల్లలకెంతో ముఖ్యం. అది వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది. నాటి తండ్రిపట్ల ఉన్న భయభక్తులు ఏ మూలకు పారిపోయాయో కానీ, నేటి తండ్రి పిల్లలకు మానసికంగా చాలా దగ్గరయ్యాడు. అభిప్రాయాలనూ పంచుకోవడానికి... మంచీచెడూ నిర్ణయించుకోవడానికీ ఈ దగ్గరితనం ఎంతో సాయపడుతోంది.


నేటి తండ్రి ఓ స్నేహితుడు. ఈ మార్పు ఇరువురికీ లాభదాయకమే! తండ్రి ముందు జాగ్రత్తలు చెపుతాడు. చదువులో సలహాలిస్తాడు. సమాజంలో మార్పులను విశదీకరిస్తాడు. వ్యవహారజ్ఞానం పంచుతాడు. ఆపదకాలంలో వెన్నంటి నిలుస్తాడు. సమస్య వచ్చిందంటే బాసటగా నిలుస్తాడు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ అనుబంధంతో కూడిన మార్గదర్శకత్వం అవసరం. ముఖ్యంగా కౌమారదశలో పిల్లలకు తండ్రి అండాదండా ఎంతో అవసరం. తమలో రేకెత్తే భావోద్వేగాలను, అనుమానాలను తనలోనే అణచుకోకుండా పంచుకోవడానికి తండ్రిని మించిన తోడు లేదు. తల్లి నవమాసాలే మోస్తుంది. కానీ తండ్రి బిడ్డకో దారిచూపించేవరకూ వారి బరువు బాధ్యతలను మోస్తాడు. అందుకు ఎదురైన కష్టనష్టాలను ఆనందంగా భరిస్తాడు. పెంపకాన్ని, ప్రేమనూ పంచుకోవడంలో... బంధాలను పటిష్టపరచుకోవడంలో... నమ్మకాన్ని, విలువలనూ పెంపొందించుకోవడంలో తండ్రి ప్రేమ గొప్పది. మురిసిపోదగ్గది!!

రోడ్డు మీద ఒకమ్మాయి కనిపిస్తే....

రెండు రోజుల క్రితం "జగదేక వీరుని కథ" అని నటరత్న శ్రీ రామారావు గారి సినిమా చూసాను... చాలా బాగుంది... అందులో చివరిలో విజయునికి(రామారావు గారు) మామగారైన ఇంద్రుడు ఒక పరీక్ష పెడతాడు... రామారావు గారికి నలుగురు భార్యలు, అయితే ఆ నలుగురితో పాటు ఇంకొక అమ్మాయి ని అంటే మొత్తం ఐదుగురిని నిలబెట్టి అందరు ఒకేలా ఉండేటట్లు గా మాయ చేసి ఇప్పుడు నీ భార్య కాని వ్యక్తిని గుర్తించు అని చెప్తాడు....
దానికి సమాధానం గా విజయుడు "నాకాంతలు కాక మిగిలిన స్త్రీలు ఈ జగంబున మాతలే గదా...." అంటూ స్తోత్రం చేస్తాడు..... ఎంతటి పవిత్రమైన భావం అది.... ఆ ఘట్టాన్ని ఆ సినిమా లో పెట్టిన ఉద్దేశ్యం ప్రతీ ఒక్కరు అలాంటి పవిత్రత భావాలను అలవరుచుకోవాలని..... 
కానీ నిజం గా మనం అలా ఉంటున్నామా..?
రోడ్డు మీద ఒకమ్మాయి కనిపిస్తే చాలు మనసులో సునామీ లా వంద ఆలోచనలు క్షణం లో ఒచేస్తాయి... వెంటపడి వేధించి, కుదరకపోతే చంపెసేతంతటి దరిద్రంగా తయారవుతోంది నేటి సమాజం.... ఇంతటి క్రూరం గా తాను మనిషిని అన్న నిజాన్ని కుడా మరిచిపోయి అడవి జంతువులా ప్రవర్తిస్తున్నారు... 
వీళ్ళందరూ ఒక ఎత్తైతే ప్రతి రోజు అమ్మాయిలని మానసికంగా వేదిన్చేవాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు... ఆ వేదనలకు తట్టుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతూ ఎంత మంది ఆడపిల్లలు ప్రతీ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారో... 
ఏ స్త్రీనైతే నవ్వు భాధపెడుతున్నవో అదే స్త్రీ జన్మనివ్వకపోతే నవ్వు అసలు ఈ భూమి మీద లేవు అనే నిజాన్ని గుర్తెరిగి ప్రతీ ఒక్కరు ప్రవర్తించాలని ఆశిస్తున్నాను..!

మీలో సేవాద్రుక్పధం ఉందా...?

పేదలు, వృద్దులు, వికలాంగులు, అనాధాలకి ఎంతోమంది ఎన్నోరకాలుగా సేవలు చేస్తూ ఉంటారు... అటువంటి సేవలో మనము కుడా పాలుపంచుకోవాలి.. సేవకు స్ఫూర్తి ప్రేమే.. స్వార్ధరాహితమైన ప్రేమలో ఆనందం ఉంటుంది..


ముందుగా మీ మనస్సాక్షిని ఈ ప్రశ్నలు వేస్కోండి.....!
మీలో సేవాద్రుక్పధం ఉందా...?
ఇబ్బందులు పడుతున్న వారిని చూసి భరించలేరా..?
మీరూ సామాజిక సేవలో పాలు పంచుకోగలరా...?

పాటించవలసినవి...:
=>  నిరంతరం మీ గురించే కాక ఇతరుల గురించి కూడా ఆలోచించాలి.
=>  కష్టాల్లో ఉన్నవారిని తప్పకుండా ఆదుకోవాలి.
=>  అనాధ శ్రనాలయాలు, వృద్ధాశ్రమాలను తరచు సందర్శిస్తుండాలి.
=>  మీతోపాటు మీ స్నేహితులు, తెలిసిన వారు కూడా సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చొరవ తీస్కోవాలి.
=>  సమాజం లో అందరితో సత్సంబంధాలను పెంచుకోవాలి.
=>  ప్రభుత్వం నిర్వహించే లేదా ఇంకే ఇతర సంస్థలైనా నిర్వహించే సోషల్ సర్వీసుల్లో వాలంటీర్లుగా పాల్గొనాలి.
=>  మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగించాలి.
=>  ఆపదల్లో ఉన్నవారిని ఆడుక్వడానికి ఒక్కోసారి ఎంత ముఖ్యమైన పనులను కుడా విడా వేస్కోవడం లో తప్పు లేదు.
=>  మీ వృత్తివాల్ల కలిగే సంతోషం కన్నా, సేవ ద్వారా మీకు లభించే తృప్తే ఎక్కువగా ఉంటుంది. 

ఎన్నో వంటకాలున్నా రుచిలేని పండుగ..!


ప్రతీ సంవత్సరం దసరా అంటే అదో పెద్ద పండుగ, పది రోజులు కుడా పండుగ వాతావరణం లో మనసులో ఏదో తెలియని అనుభూతి తో హాయిగా జరుపుకునే వాళ్ళం. దసరా మొదటి రోజే పిండి వంటకాలు చేసుకుని వాటిని ఆ పది రోజులు తినుకుంటూ, ఇంకా మిగిలిన వాటిని సెలవల తరువాత క్లాస్మేట్స్ కోసం పట్టుకెళ్ళి "ఇదుగో తీసుకోండి రా మా అమ్మే చేసింది అనుకుంటూ పంచి పెట్టటం...", పండక్కి చుట్టాలందరూ ఇంటికి ఒస్తే పిల్ల మూక అంతా కలిసి ఇంటిని కిష్కింద చెయ్యటమే...! పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా నానా అల్లరీ చేసి చివరికి అలిసిపోయి కూర్చొని సాయంత్రం పూట ముచ్చట్లు పెట్టుకోవటం.... ఇలా సరదా సరదా గా గడిచిపోయే పండుగ కాస్తా ఈ బందుల గొడవ వల్ల నీరసం గా తయారయిపోయింది... ఎక్కడి వాళ్ళు అక్కడే.... ముచ్చట్లు లేవు, అల్లరి లేదు, ఆ ఆనందం లేదు... ఊరికేల్దామంటే బస్సులు ఉండవు, ఇంట్లోనే కూర్చుందామనుకుంటే కరెంటు ఉండదు, ఒక పక్క ఉక్కపోత చికాకు బోర్ ఫీలింగ్ ఇలా అదోలా తయారయింది ఈ పండుగ రోజులు అంతా...!
ఏంటో కనీసం ఒచ్చే సరి అయినా మళ్ళీ ఆ ఉల్లాసపు పండుగ రావాలి, ఆనందపు తెమ్మెరలను  తేవాలి.. అందరు ఆనందం గా ఉండాలి.
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.