అసలు నీకేం తెలుసు....?

ఈ కింది రెండింటి లో మనిషికి ఏది ముఖ్యమైనది...?
డబ్బు..
తెలివిడి..
డబ్బు లేని తనాన్నయినా మనిషి భరిస్తాడెమో  గానీ, తెలియనితనాన్ని అస్సలు సహించుకోలేడు.
'నీ దగ్గర లక్ష రూపాయలు కూడా లేవా?' అని ఎదురయ్యే ప్రశ్న, వేదన పుట్టించవచ్చేమో కానీ న్యూన్యతను కలిగించదు
.
అదే, 'అరె నీకీ ప్రశ్నకు కూడా సమాదానం తెలియదా?' అన్న వెక్కిరింత మనిషిని నీరుగార్చేస్తుంది.
తెలివిడి,ఎరిక,జ్ఞానం.... వీటికి మనమిచ్చే స్థానం అది.
కానీ నిజం గా మనకేం తెలుసు? తెలిస్తే ఎంత తెలుసు?
మనకు ఎందుకు నమస్తే పెడతారో, ఇంకొకరు ఎందుకు పెట్టారో తెలియదు.
ఒకరు ఒకరిని ఎందుకు తీవ్రంగా ద్వేషిస్తారో, ఇంకొకరి మీద అవ్యాజమైన ప్రేమ ఎందుకు చూపిస్తారో తెలియదు.
కొందరి కరెన్సీ నోట్లకు ట్విన్స్, ట్రిప్లెట్స్ పుడుతూ ఉంటె, ఇంకొందరివి గొడ్డు నోట్లుగానే ఎందుకుండిపోతాయో ఎప్పటికీ తెలియదు..
టైపింగ్, కరాటే, అల్లిక, డెకరేషన్, ఎలక్ట్రికల్, సాఫ్ట్ వేర్, వ్యవసాయం, అర్ధ శాస్త్రం, సాహిత్యం.... ఇవి కాక నిప్పు ఎక్కడి నుండి వొస్తుంది, నీరు ఎలా పుడుతుంది, ఈ భూమి ఇలా ఎందుకుంది, ఈ జన్మానికి అర్ధం పరమార్ధం ఏమిటి..... ఇలా కోటానుకోట్ల అంశాలలో ఒకరికి ఒకటి తెలిస్తే, ఇంకొకరికి ఇంకొకటి....
తెలియడానికి, తెలియకపోవదానికీ తేడా చాలా స్వల్పం. ఒక సన్న గీత అంతే. ఒక అడుగు అటు వేస్తె తెలుసు, వేయకపోతే తెలియదు. ఆ అడుగు వేసే అవకాశం, అవసరం మనిషి మనిషికీ మారుతుంది.
అయినా, చాలా సందర్బాలలో మనుషులు "జ్ఞాని" ముద్ర దాల్చడానికి ప్రయత్నిస్తుంటారు.
తెలియనితనాన్ని అంగీకరించటం లో ఒక సుఖముంది. లేకపోతే, అది మోయలేని బరువౌతుంది....
అంతెందుకు? చాలా గొప్పది, అమూల్యమైనదీ అనుకునే ఈ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా మనకు తెలియదు. ఇదే తెలియనప్పుడు, మిగిలిన చిన్న చిన్న విషయాల మాటేమిటి?
జీవితం లో ఉన్న రుచి ఒక్కటి తెలుసుకోగలిగితే, మిగిలిన అంశాలేవీ మనకు తెలియనవసరం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.