ఏం చెప్పగలను వారలా అడిగితే..? సిగ్గుతో తల వంచుకోవటం తప్ప..!!

నేనిప్పుడే గోల్డ్ సినిమా చూశాను. దేశం మొత్తం కలిసి ఒకే ఒక్క కల "స్వాతంత్ర్యం"కోసం పడ్డ కష్టం ముందు తొక్కలోది మనం పడుతున్న ఈ కష్టాలు... కష్టాలు అని పిలవబుద్ది కూడా కావట్లేదు.

ఎన్నో కోట్లమంది తలలు తెగుతున్నా, గుండెల్లో గుండ్లు దిగుతున్నా లెక్కచేయకుండా కనీసం నా తరువాతి తరాలైనా సుఖంగా ఉంటాయని పోరాడితే మనం ఏం చేస్తున్నాం.?? చిన్న చిన్న గొడవలకే దేశాన్నీ, రాష్ట్రాన్ని, ఊర్లనీ, అంతెందుకు ఇంటినీ ఆఖరికి బంధాల్ని కూడా విడగొట్టుకుని బతుకుతున్నాం.. బ్రిటీష్ వాళ్ళు వెల్లిపోతూ వెళ్ళిపోతూ అప్పటివరకు ఉనైటెద్ గ ఉన్న మనకి పాకిస్తాన్ హిందుస్తాన్ అంటూ విడిపోవటం నేర్పి వెళ్ళారు.. అంతే ఆఖరికి భార్యా భర్తలు, అన్నాదమ్ములు, తల్లితండ్రులు -పిల్లలు, ఇలా అందరూ విడిపోవటానికి అలవాటుపడిపోయాం.

నాకనిపిస్తోంది, నిజంగా ఆనాటి త్యాగధనులు కనుక ఒక్కసారి ప్రాణం పోసుకుని వొస్తే మనందరి మొఖాలపై ఖాండ్రించి ఉమ్మేస్తారేమో... మీలాంటివాళ్ళకోసమారా మేము మా కుటుంబాలు ప్రాణాలిచింది అని కుమిలి కుమిలి గుండ్లు తిన్న అవే గుండెలు బాదుకుని మరీ ఏదుస్తారనిపిస్తోంది.

మొన్న ఒక మిలటరీ సోదరుడు కలిసినప్పుడు కూడా ఇదే అంటున్నాడూ.." ఇలాంటి వాళ్ళకోసమా అన్నా మేము మా పెళ్ళంబిడ్డలని వొదిలేసి, ఆనందాలని వొదిలేసి, చావుతో కాపురం చేస్తోంది..??" అని.

ఏం చెప్పగలను వారలా అడిగితే..? మాటల్లేవ్.. సిగ్గుతో తల వంచుకోవటం తప్ప..!!

డబ్బు-విలువలు

నా దృష్టిలో డబ్బులు సంపాదించటం గొప్పకాదు.
సభ్యత, సంస్కారం, మంచితనం, గౌరవం లాంటి విలువైన విలువలు సంపాదించుకున్నవాడే అసలైన గొప్పవాడు.
నేనా ప్రయత్నంలోనే ఉన్నాను. దేవుని కృప నాపై ఉండి అటువంటి విలువలు నేను సంపాదించుకోవాలి. 
అయితే ఒక మనిషి డబ్బు సంపాదిస్తే అది వాడొక్కడికే చెందుతుంది.
అదే 
విలువలను సంపాదిస్తే అది ఆ కుటుంబానికే కాదు చుట్టూ ఉన్న సమాజానికి కూడా శోభనిస్తుంది.
స్వామీ వివేకానంద, మార్టిన్ లూధర్‌కింగ్ వంటి మహానుభావులు మనకు ఆదర్శప్రాయులు.

నాకిది మామూలే..!!

తీగ తెగిన తేగల తెగింపులు
తెల్లారేదాకా తీరుబడిగా తీటతీర్చుకునే
తిక్క తోటల్లో తైతెక్కలాడుతున్నాయని
ఆ తిమ్మప్ప తిరగకుండానే తిన్నగా
తిట్టింతిట్టు తిట్టకుండా తిట్టి
నా బుర్రలో కాపురముంటున్న బుద్ది కి
అంకాస్త ప్యారా గడ్డి పారేసిపోయాడు..
పోనీలే.., ఇకనైనా కలనైనా కంచెదాటి
నా కలల స్థాయితోటి స్నేహం పోటీ పెట్టుకుంటుందని
తెలిసొచ్చింది.. అయినా యదవ బుద్దికి బుద్దెక్కడుందీ..?
మళ్ళీ మొదలులేని ఇక మరువలేని ఆ మట్టి బురదలోకి కాలుపెడుతూనే ఉంటుంది..
నాకిది మామూలే..!!
నమ్మినవాళ్ళే కదా మోసం చేయగలిగేది..!!
- సత్యం గడ్డమణుగు, 15-12-2015, 12:29am

బాహుబలి భారతీయ చిత్రమే..!!

అప్పుడప్పుడూ ఇంగ్లీషు సినిమాలు చూస్తూ ఉంటాను.(మా తమ్ముడు బలవంతంగా బాగుంటుంది చూడని చూపిస్తే..) అందులో నటుల పేర్లు తెలియవు, కథ ఎమిటో తెలియదు, ఎం జరుగుతుందో ఊహించలేను. చివరికి మాత్రం సినిమా భలే చక్కగా తీశారని మంచి కితాబిచ్చేస్తాను మనసులో.

ఈరోజు బాహుబలి సినిమా కూడా అలాగే చూశాను. చాలా అంటే చాలా నచ్చింది. నెనెక్కడా అసంతృప్తి పొందింది లేదు. ప్రతీ సన్నివేశం కొత్తగా నా గుండెలకు హత్తుకుంది. తరువాతి భాగం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

భారతీయ సినీ పరిశ్రమ జక్కన్న మన రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలే కాదు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ఒక సినీ అభిమానిగా అభినందనలు.

రెండవ భాగం కూడా చూశాక ఈ చిత్రాన్ని గురించి నా పూర్తి భావనలు ఇక్కడ రాస్తాను.

ఇట్లు మీ సత్యంజి.

ముక్కుమీద గాయానికి 21 ఏళ్ళు

నా ముక్కుమీద ఉన్న గాయానికి ఈరోజుతో సరిగ్గా 21 ఏళ్ళు నిండాయి.. సరిగ్గా 21ఏళ్ళ క్రితం అంటే 1993 జూన్ 1న, నేను అప్పుడు విజయవాడ దగ్గర కొండపల్లిలో మా అమ్ముమ్మ వాళ్ళింట్లొ ఆడుకుంటున్నాను.. మా నాన్న వొచ్చి ఒరెయ్ సుప్రీం నీకో తమ్ముడు పుట్టాడురా అని చెప్పగానే "హాయ్ నాకు తమ్ముడు పుట్టాడోచ్ అని పరిగెత్తుకెల్తుంటే నా అంత ఎత్తున్న గడప తగిలి ముక్కు పగలకొట్టుకున్నాను.." మొత్తానికి పుట్టాడో లేదో నా ముక్కుకి ఓ చిల్లి పెట్టేశాడు మా తమ్ముడు.. ఆ అతి చిన్న వయసులో (2సం.ల 4నెలలు) ఆరోజు నేను కింద పడుతుంటే మా నాన్న నన్ను పట్టుకోవటం, ఆసుపత్రికి వెళ్ళాక ముక్కు మీద కట్టుతో బెడ్ మీద ఉన్న అమ్మ దగ్గరకి వెళ్ళటం రెండు విషయాలు మాత్రం ఎలా గుర్తున్నాయో అలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. తలచుకున్నప్పుడల్లా అద్దంలో నా ముక్కు చూసుకుని భలే నవ్వుకుంటాను.. ఇప్పటికీ ఆ గుర్తు చెరిగిపోలేదు మరి..! ఆ తర్వాత తర్వాత ఎన్నో కొట్లాటలు ఎన్నో బుజ్జాయింపులు.. ఇప్పటికీ.. !
ఐనా నాకు మా తమ్ముడంటే ప్రాణం.. -సత్యం జి, 01-06-2014, 09:56

మన సమాజానికి అందిన వరం రాఘవేంద్ర..!



2012 డిసెంబర్ లో మొదటిసారి మా ఇద్దరికీ పరిచయం అయ్యింది.. నాకింకా గుర్తుంది.. ఆరోజు నేను పూజలన్నీ ముగించుకుని ఓ ప్రేక్షకుడిగా, వీక్షకుడిగా అలా జనం మద్యలో మనం అనుకుంటూ కూర్చొని వేదిక మీదకి ఎక్కే మనిషెవరా అని ఎదురు చూస్తున్నాను.. అప్పుడే ఒక గొంతు ఎక్కింది.. ఆ గొంతు తనను కన్న కడుపులకి, తనకు పాటాలు చెప్పిన బెత్తాలకి నమస్కారం చెప్పి మాట పోటుకు, వాక్పోరులో అందరి హృదయాలను గెలుచుకునేందుకు రంగంలోకి దూకింది.. అప్పటివరకు ఎన్ని మైకులు గుసగుసలాడాయో అన్నీ ఒక్కసారిగా మౌనంగా ఆ గళాన్నే ఆలకించటం మొదలెట్టాయి.. ప్రతీ మాటలో, ప్రతీ పలుకులో ఏదో తెలియని ఆవేశం, ఒంట్లో ప్రతీ అణువూ పరుగులు తీయటం మొదలెట్టాయి.. లక్ష్యాన్ని సాధించేవరకు ఆగేదిలేదని తెగేసి చెప్పాయి.. అంతలో ఎప్పుడు దిగిందో వేదిక నుంచి ఆ గొంతు ఎవరికీ తెలియలేదు.. ఇంకా ఆ మాటల మత్తులోంచి తెలివిరాలేదు.. ఆ తరువాత అలాంటి ఎన్నో సభలు.. సమావేశాలు..

చినచిన్నగా ప్రేక్షకుడు వేదిక పంచుకున్నాడు, ఆ తరువాత తమ్ముడిగా గుండెను ఎంచుకున్నాడు.. ఆత్మీయత పెనవేసుకుపోయింది.. అతి స్వల్పకాలంలో ఆ గొంతు నన్ను "తమ్ముడూ.. " అని పిలవటమే కాకుండా తమ్ముడిగా మనసుతో దగ్గరకు హత్తుకుంది.. అది మామూలు గొంతుకాదు.. మామూలు మనిషి గొంతు అసలే కాదు..  ఎంతో మందిని బతికిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, ప్రోత్సహిస్తుంది.. పోరాడమంటుంది, వెనకుండి నడిపిస్తుంది.. "నేనూ జీవితం లో ఫెయిల్ అయ్యానూ.. కానీ ఈరోజూ మీరెవ్వరూ ఫెయిలయ్యి ఫీల్ అయ్యే దాకా నేనూరుకోను, నేనున్నానూ.." అంటూ వెన్నుతడుతుంది.. కోనసీమలో పుట్టిన ఆ గొంతు జగమంతా వినిపిస్తా, జగాన్నంతా కదిలిస్తా, గెలిపిస్తా అంటూ నడుంబిగించింది. ఆ బిగువులో, ఎదురులేని ఆ తెగువులో నన్ను కూడా కలుపుకుంది.. నేనూ ఇప్పుడు మనిషి నుంచి ఆ గొంతు పక్కన కలిసే మరో గొంతునయ్యాను.. నాలాంటి ఎంతో మందిని తనలా గర్జించే గళాలుగా చెయ్యాలన్నదే ఆ గొంతు పెట్టుకున్న గట్టి లక్ష్యం..
ఆకెళ్ళవారి వంశ ఆణిముత్యం, మన సమాజానికి అందిన వరం రాఘవేంద్ర అన్నయ్య జన్మదిన సందర్భంగా..
శుభాకాంక్షలతో సత్యం జి సామాన్యుడు కాదు, 01-06-2014, 10:34

పెళ్ళి కొడుకు సంగతేంటీ..?



మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా పెళ్ళి చేసుకుంటుంటే, కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా అమ్మాయి తరపు వాళ్ళు.. అబ్బాయి మంచివాడేనా..? చదువుకున్నాడా లేదా..? ఏమైనా ఆస్తులున్నాయా..? ఉంటే వాటికి సంబందించి ఏమైనా గొడవలున్నాయా..? అసలు వాళ్ళు చెప్తున్న ఆస్తుల వివరాలు సరైనవేనా..? అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు..? వాటి వివరాలేంటి..? నెలకి ఎంత సంపాదిస్తున్నాడు..? ఒకవేల ఎక్కువే సంపాదిస్తున్నప్పటికీ ఏమైనా మిగులుస్తున్నాడా..? లేక దుబారా గా ఖర్చు పెట్టే వాడా..? స్నేహితులతో ఎలా మెలుగుతాడు..? ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటాడు..? పెళ్ళి కోసం మన ముందు ఏమైనా నటిస్తున్నాడా..? వాళ్ళ ఇల్లు ఎలా ఉంది..? అంతకు ముందు నుంచే అక్కడ ఉన్నట్లైతే చుట్టు పక్కల వళ్ళని అదగటం, ఒకవేల మొన్నీ మద్యే మారారు అంటే, పెళ్ళి కోసమే, మనకి చూపించుకోటానికే ఇల్లు మారారా..? లేక మామూలుగానేనా..? అబ్బాయి ఇంట్లో వాళ్ళకి సిగరేట్, మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా..? ఉంటే క్యాజువల్ గా అప్పుడప్పుడూ బయత తాగుతారా..? లేక ఇంట్లోనే సిట్టింగులేసి ఇల్లు గుల్ల చేసే బ్యాచ్ ఆ..? తల్లి తండ్రులు, తోబుట్టువులను ప్రేమగా ఉంటారా..?  ఇంకోటి ఇంట్లో వాళ్ళనే ప్రేమగా చూస్తాదా తర్వాత మన అమ్మాయిని కూడా అలా చూడగలడా..?

ముఖ్యంగా మన అమ్మాయి భావాలు/ఆలోచన తీరు ఆ అబ్బాయితో కలుస్తుందా..?

ఇలా చాలా జాగ్రత్తగా "విచారణ" జరుపుకుని మరీ అడుగులెయ్యండి..!
ఇంత ఆధునిక సమాజంలో కూదా ఇంకా పెళ్ళిళ్ళలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.. తర్వాత బాధపడేకన్నా ముందే కాస్త సమయం పట్టినా మంచి "జోడీ" ని వెతకటం ఉత్తమం.

ఈ పోస్ట్ మీకు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే మీ వాల్ పైన మీ స్నేహితులకు షేర్ చెయ్యండి..!

ఇట్లు సదా మీ సాట్నా సత్యం గడ్డమణుగు
సి.ఇ.ఓ. మరియు వ్యవస్థాపకులు,
సాట్నా టెక్నాలజీస్.
06-03-2014, 12:54

భారతం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది.

నేను కూడా కొన్ని సం.ల తర్వాత వేరే దేశం పోతా.. నోబెల్ బహుమతి వస్తుందేమో..? గత పదేళ్లలో వచ్చిన నాలుగు బహుమతులు ఇండియాని కాదనుకుని వెళ్ళిన వాళ్ళవే అట.. వేల కోట్లు ముడ్డెనక మూలుగుతున్న చిల్లి గవ్వ కూడా ఇలాంటి విషయాలకి పెట్టలేని దౌర్భాగ్యపు దేశం నా జన్మభూమి అని నేను చెప్పుకోలేను మరి.. :( ఎంతసేపూ రాజకీయాలు, గుడ్డలిప్పుకుతిరిగే హీరోయిన్లు తప్ప మన జనాలకి ఇంకేం అక్కర్లేదు..! మన తెలుగోడు మైక్రోసాఫ్ట్ కి సి.యి.ఓ. అయ్యాడు అని సంకలు గుద్దుకుంటున్నారు జనాలు.. అక్కడేమో అమెరికా లాంటి దేశాలు మీవోడికి మేము అవకాసం ఇచ్చాం చూశారా అంటూ వెక్కిరిస్తుంటే అది మాత్రం పట్టటంలేదు. ఏం మన దేశం లో ఉన్న డబ్బు కరెక్ట్ గా ఉపయోగిస్తే ఆ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు పది పెట్టచ్చు ఒకే ఒక్క సం. లో.. దేశం దాకా ఎందుకు..? మనలో ఇలా ఫేస్ బుక్ లో లైకులు కామెంట్లు చేస్తూ కూర్చునే వాళ్ళలో ఎంతమంది ఎరోజు నేనూ ఇలాంటివి చేస్తాను అని ముందుకు వస్తారు..? మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ తొక్కా అని చెప్పకండి.. ఎం ఇప్పటి వరకూ సాధించిన వాళ్ళంత..? వాళ్ళకి లేవా ప్రాబ్లంస్..? మీకు అడుగెయ్యటానికి ధైర్యం లేదు.. అంతే.. మీరు పిరికి పందలు కాబట్టే అడుగు వెయ్యలేకపోతున్నారు అని చెప్పటానికి నేను ఏ మాత్రం సంకోచించను..చెయ్యాలి అనుకున్న వాడికి కారణాలు అక్కర్లేదు.. ఎలాగైన చెసేస్తాడు.. ఇప్పటికైనా మన దేశంలో ఈతరహా ప్రోత్సాహకర తెగింపు ఆవేసం తో కూడిన ఆలోచనా ధోరణి వస్తే దేశం బాగుపడుతుంది.. లేదా రాబోయే కాలంలో భారత్ బానిస దేశం ఐపోక తప్పదు.బానిసత్వం అంటే మళ్ళీ వేరే వాళ్ళూ పరిపాలిస్తారా అని కాదు.. మనం ఇలాగే ఉంటే ఎప్పటికైనా మన దగ్గర ఉన్న మేధావులంతా (ఇక్కడ నేను ప్రస్తావించిన "మేధావులు" మానవాళి శ్రేయస్సుకు కొత్త కొత్త పనికొచ్చే విప్లవాలు తెచ్చ్చేవాళ్ళు.. యదవ తెలివితేతలు ఉన్న వాళ్ళు కాదు.) పొరుగు దేశాలకెళ్ళిపోతే మిగిలేది చెత్తే.. సో అప్పుడు ప్రతీ చిన్న విషయానికి మనం మళ్ళీ ఇంకో దేశం మీద ఆధార పడాలి.. వాళ్ళు కనుక నిరంకుశత్వం ప్రదర్శిస్తే ఇంకేముంది బానిసలైనట్టే గా..! కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!
- సత్యం గడ్డమణుగు, 02-06-2014, 10:26pm

ఆకలి తీర్చా..!


పొద్దుగాలనుంచి అడుక్కున్నా ఒక్కమ్మా బువ్వెయ్యలేదు..
కడుపుల వాడెయడో అతంచుకి ఇటంచుకి తాళ్ళుగట్టి 
లాగేత్తుండు.. కనీతం సుక్క నీళ్లైనా గొంతుల పోద్దామని 
ఆ ఈదిచియరున్న పంపుగాడికి పోతే,
అది గూడక అమ్మగార్ల లెక్క ఏషాలేత్తంది..
ఆళ్ళేమో ఒక్క మెతుకు ఇయ్యలే, ఇది గూడ ఒక్క సుక్క బియ్యలే..

ఔలే ఎట్తాగిత్తాయ్..?
అతలే మన యవ్వారం ఎడిసిమంగి మడతాలాగుంది..

కొద్దికొద్దిగ నా వంట్ల సత్తువ తగ్గుతా ఉంది.
ఆ పంపు కాడ్నే కూలబడ్డా..
పంపుని పట్టుకోనీకి శెయ్యి గూడ లెయ్యలే.,
అప్పుడు జూసినా ఆ పంపు కన్నంల రెండు సుక్కలున్నయ్..
అవి కాసేపట్ల కారి కింద పడతయ్..
ఎట్టాగూ తలని లేపే ఓపిక లేక
నోటిని పంపుకుందకి పెట్టిన..

సరిగ్గ సుక్క రాలే టైముకి ఓ కుక్క
నాలికతో ఉన్న రెండుసుక్కలూ నాకేసింది..
బారెడు నాలిక్కి ఆ రెండు సుక్కలు సరిపోక రొప్పుతా నన్ను సూతంది..

అప్పటికే కింద పడ్దప్పుడు తగిలిన దెబ్బల్నుంచి
కారుతున్న రక్తం వాసన ఆ కుక్క నాసికలకి తాకింది..
చిన్నగ నా మీద ఉన్న రక్తాన్ని సుతారంగ నాకేత్తోంది ఆ కుక్క..
అది అలా నా రక్తం కోసం నా మీద పడగానే
ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా దాని కాలు నా ముక్కుకి రాసకపోయి
రక్తం నా నోట్లోకి కారింది..
నాకు గొంతులోకి జారుతున్న ఉప్పని ద్రవం తప్ప ఇంకేమీ
తెలియలేదు.. తెలుసుకునేంత తెలివి లేదు..

తెలివి రాగానే లేచి చూశాను
నాకింక ప్రాణం లేదు..
ఎందుకంటే అప్పటికే ఆ కుక్క నా వొళ్ళు మొత్తం
కొరికి మింగేసింది.. నిజానికి గొంతులోకి జారిన ఉప్పని ద్రవం
ముక్కు మీద గాటుకి కాదు ఆ కుక్క కాటుకి వచ్చిన రక్తం..

పోన్లే నా జీవితంల అడుక్కోడమేగాని పెట్టింది లేకపాయే..
ఇట్టాగైనా పోతా పోతా ఒక జీవి ఆకలి తీర్చిన.
గది సాల్ నాకు..!

- సత్యం గడ్డమణుగు, 04-02-2014, 03:51

తాగుబోతు భారతం||సాట్నా సత్యం||

*****************************
సంకలెత్తిన సిన్నదాన్ని సినిమాల జూసి సప్పట్లు గొట్టే ఈ జనాలు..
సక్కంగ బాగుపడే పన్లు జేసుకుందాం రండిరా అంటే, మాట వినరు..

సీను లేని సినిమాకి సింగిల్ డే కూడా పోరు,
సారా తాగి సిందులేసి ఇంటిదాని సీను సితారయ్యే దాకా ఊరుకోరు..

నాయాళ్ళు.. తాగనీకి డబ్బులొస్తాయిగాని,
సంటోడ్ని ఇస్కూలికి పంపమంటే మాత్రం పేదోళ్ళమని నీలుగుతరు..

తాగనీకి అప్పుల్జేస్తరు..
అప్పుల్దీరట్లే అని బాదల తాగుతరు..

తాగనీకి ఇల్లు గుల్ల జేస్తరు..
ఇంటిని సక్కబెట్టలేకపోతుండా అని మల్లా తాగుతరు..

పెళ్ళాం మెడల తాళి ని సారకు తాకట్టు బెడతరు,
నా బుచ్చికి కమ్మలన్నా సేయించకపోతింటే అని బాదపడతరు..
ఆ బాదల మల్లా తాగుతరు..

ఎవడైనా తాగి వాగతంటే తాగుబోతు నాయాల గాడు అని
తిట్టిన నాకొడుకే పొద్దుబోయేసరికి తాగి తూలుతా వస్తడు..

వారానికోపాలి సెల్లుల్లో బూతు బొమ్మలెక్కించుకోనీకి
సెల్లు షాపోనికి 200 రూపాయలిస్తడు కానీ,
నెలల బిడ్డ ఆడుకోనీకి ఓ చిన్న బొమ్మ కొనీనీకి డబ్బుల్లేవ్ అంటడు..

తాగితె గానీ అందంగ గనపడని పెళ్ళాం,
ఆ సార కంపుతోనే సంసారం చేయ్యాల..

పంచుతున్న సార ప్యాకెట్టు నోటిత కొరికి
సుక్క సప్పత్తునే, మద్యం నిషేదం అని సెప్పే సిల్లరనాయాళ్లకి
జేజేలు కొట్టి మరీ వోటులేస్తరు..
ఐదేళ్లకోసారైనా ఫ్రీగ మందు దొరికిద్దని సిన్న ఆశ..

- సాట్నా సత్యం, 16-01-2014, 11:49

పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా..?

యాక్చువల్లీ,,, చుట్టూ ఉన్న పరిసరాలు, మనస్తత్వాలు భిన్నంగా ఉన్నప్పుడు, పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అందించినా సరైన ప్రయోజనం ఉండకపోవచ్చు.. ఉదాహరణకి, అవగాహన కోసం అని 8వ తరగతిలోనో ఏమో అనుకుంట, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్త గురించి, అలాగే ఎయిడ్స్ గురించిన అంశాలను ప్రభుత్వం వారు జీవ శాస్త్రం లో ఉంచారు.. అయితే పాటం వినేటప్పుడు ఆ సదరు ఉపాద్యాయులు, విద్యార్ధులు సరైన భావాన్ని అర్దం చేసుకున్నప్పటికీ, పక్కకు వెళ్ళిన తరువాత పక్కన ఉన్న ఫ్రెండో, మరే ఇతర వ్యక్తుల ప్రభావం వల్లన ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి.. అలాగే ఇంకో విషయం, పోనీ సరైన వయసు రాగానే ఆ వయసుకు తగ్గట్లు వచ్చే మార్పుల గురించి తల్లితండ్రులు స్నేహ భావంతో తెలియజేయాల్సిన అవసరం ఉంది.. కానీ, "చీ, చండాలంగా చిన్న పిల్లలతో అవన్నీ ఎలా చెప్తాం..?" అనే అలోచనలతో వారు మాట్లాడరు.. తద్వారా ఏమవుతుండంటే, ఆ అమ్మాయి/అబ్బాయి ఆ వయసులో వచ్చే కుతూహలంతో సెక్స్ సైట్లకో, బూతు పుస్తకాలకో, ఫ్రెండ్స్ తో బూతు పురాణాలకో దగ్గరవుతాడు.. వాళ్ళలో కొందరు రాక్షసులుగా తయారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. సర్వేల ప్రకారం నూటికి 90% మంది ఆ కోవకు చెందిన వాళ్ళే.. కాబట్టి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో, సమాజం వ్యవహరించే తీరు కూడా అంతే ముఖ్యం.
- సత్యం గడ్డమణుగు.

మీ మొగుళ్ళు/మీ పెళ్ళాలు బాగానే ఉంటున్నారు గా..?



ఆడది లేకపోతే మనుగడ లేదు అని ఆడా'హంకారం' తో ఊగిపోకండి మై డియర్ రాములమ్మలూ.. ఏంటేంటి? సృష్టికి ఆడదే మూలమా..? మగాడు కాదా..? మగాడు లేకుండా మీరెక్కడనుంచి వొచ్చారూ..? పోనీ మగాడు లేకుండా మీరు ఎలా సృష్టిని సృష్టిస్తారు..?

మగాడు లేకుండా ఈ ఆడదేంచేయగలదు..? అని మగా'హంకారంతో విర్రవీగే మై డియర్ వీర్రాజులూ.. ఏంటేంటి? భారం మొత్తం మీరే మోసేస్తున్నారా? ఆడది ఇంట్ళో కుర్చోని తింటం తప్ప ఇంకేం చేస్తంది? అని ఎటకారాలా..? మరి మీ పాటికి మీరు కడుపులు చెసేస్తే నెలలు నెలలు కడుపులో మోసి కనటానికి నరకం అనుభవించెది ఎవరమ్మా..?

ఆదది ఒక్కటి లేదా మగాడు ఒక్కటి ఉంటే సరిపోదు బంగారాలూ.. ఇద్దరిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఉండి చావదు.. అది గుర్తుపెట్కోండి.. ఎవరినా అలాంటివి చెప్పినా వినకండి.. యే సందర్భంలో అయినా ఆడ మగ ఇద్దరిదీ సమానమైన స్థానం ఉంటుంది..!

మళ్ళీ అక్కడ అలా జరిగింది.. ఇక్కడ ఇలా జరిగింది.. అమ్మాయిల్ని హింసిస్తున్నారు... కాబట్టి అబ్బయిలు మంచోళ్ళు కాదు, అబ్బాయిల్ని మోసం చెస్తున్నారు కాబట్టి అమ్మాయిలు మంచోళ్లు కాదు, అని అరిచి గొంతు చించుకోకండి ఎందుకంటే అలా చెసిన యే కొంత మందినో మనం నిందిస్తే బగుంటుంది కానీ అందర్ని కలిపి తిట్టటం కరెక్ట్ కాదు..
యేం..? మీ మొగుళ్ళు/మీ పెళ్ళాలు బాగానే ఉంటున్నారు గా, మీ సోదరులు/సోదరీలు బాగానే ఉంటునారుగా, మీ స్నేహితురాలో/మీ స్నేహితుడో బాగానే ఉంటున్నారుగా, మరి ఏం పోయే కాలం వొచ్చిందని పాపం ఎవడో చెసిన దానికి "అందరు" అని ట్యాగ్లైన్ ఇచ్చి పాపం వాళ్ళని కూడా లాగుతారూ..?

కాబట్టి ఇంకోసారి అమ్మయిలు వేస్ట్, అబ్బయిలు యదవలు అని అనవసరంగా నోరుపారేస్కోవద్దు.. కావాలంటె పర్టిక్యులర్ వ్యక్తుల్ని మెంకషన్ చేసి తిట్తండి. అంతేకానీ మంచివాళ్లని కూడా మీ కంపు తిట్లతో చెడ్డవాళ్ళనిచేసిపారెయ్యొద్దు.

- సత్యం గడ్డమణుగు, 21-11-2013, 15:22

ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.


ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.||సత్యం గడ్డమణుగు||
***************************************

నీకు నేను ఒక పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?
అయితే ఏం పర్వాలేదు.. చరిత్రలో చూసుకుంటే
చాలామంది చరిత్రలో గొప్పవాళ్ళుగా మిగిలిపోయిన వాళ్లందరూ,
నీలాంటి వాళ్ళతో పిచ్చివాడు అని అనిపించుకున్న వాళ్ళె..!

భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన వాడు పిచ్చోడే,
భూమి మద్యలో నీళ్ళు కాదు, నీళ్ల మద్యలో భూమి ఉంది అన్నవాడు పిచ్చోడే,
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పిన వాడు పిచ్చోడె,
కట్టె పుల్లలతో ప్రయోగాలు చేసిన ఎడిసన్ ప్రయోగం సఫలం అయ్యేవరకు పిచ్చోడే,
కాంతి ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది అన్నవాడు పిచ్చోడె,

ఇలా పిచ్చివాడు అని ముద్రవేస్కున్న ప్రతీ ఒక్కడూ ప్రపంచంలో మరువలేని
గుర్తులుగా మిగిలిపోయారు..

అంతెందుకు, స్నేహితురాలికోసం ప్రాజెక్టు చెస్తున్న బుయొక్కొటేన్ ని పిచ్చివాడిగా చూశారు,
కొన్ని పదుల సం.లు ఇంటర్నెట్ ని ఏలిన ఆర్కుట్ ఆవిర్బవించింది.
క్యాంపస్ ని ఒకటి చేయాలనుకున్న జూకర్ వి పిచ్చిపనులని జైల్ కి పంపించారు,
ఫేస్బుక్ అంతర్జాతీయ అంతర్జాలాన్ని ఊపేస్తోంది..
మానసిక ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిన ముగ్గురు ఉద్యోగులను పిచ్చోళ్లకింద జమకట్టారు.. ఈరోజు వాళ్ళ ఆవిష్కరణే గూగుల్.. అది లేకపోతే ప్రపంచమే లేదు..

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు..
చరిత్రలో తోటివారిచెత నిందలు పడ్డ ప్రతీ వాడూ గొప్పవాడిగా నిలిచిపోయిన వాడే..
అలాగే నేను కూడా ఏదో ఒకరోజున ప్రతీ మానవుడూ తలచుకునే స్తాయికి ఎదుగుతాను..
నా ఈ కలని సాధిస్తాను.. నీలాంటి వాళ్ల కళ్ళకి ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.

- సత్యం గడ్డమణుగు, 13-11-2013, 16:29

ఈ విషయం మీతో ఖచ్చితంగా పంచుకోవాలి..


ఈ విషయం మీతో ఖచ్చితంగా పంచుకోవాలి.. ఎందుకంటే అందరూ ఈ విషయం పై అవగాహన పెంచుకోవాలి..

నిన్న సాయంత్రం "సత్య సాయి సేవా సదన్, శ్రీనగర్ కాలనీ" లో జరుగుతున్న మ్యూసికల్ నైట్ కి వెళ్ళి అమలాపురం కి వెల్దామనే ప్రణాళిక వేస్కోని బీరంగూడాలో బైకు మీద నేను మా తమ్ముడు బయల్దేరాము.. సరిగ్గా కూకట్పల్లి దగ్గరకి రాగానే ఒకడు మమ్మల్ని ఓవర్టేక్ చేయాలనే కంగారుతో వొచ్చి నేను నడుపుతున్న బండినే గుద్దేశాడు.. 35 స్పీడుతో వెర్ల్తున్న నేను వాడు గుద్దిన స్పీడుకి రెండు పల్టీలు కొట్టి దాదాపు 25 అడుగుల దూరం ఈడ్చుకుపోయాను.. ఆ నాలుగు నిమిషాలు నాకు ఏమీ అర్దం కాలేదు.. అయితే ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోవటం వల్లనూ, దళసరి జర్కిన్ ఒకటి వేసుకోవటం వల్లనూ నా శరీరానికి చిన్న చిన్న రాసుకుపోవటాల్తో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను.. నా హెల్మెట్ ఒకవైపు సగం కొట్టేసింది.. జర్కిన్, షర్ట్, ప్యాంట్ చినిగిపోయాయి.. కానీ నేను నిక్షేపంగా బయటపడ్డాను.. (అఫ్కోర్స్ వెంటనే పక్కన ఉన్న బట్తల కొట్టులో కొత్త బట్తలు కొని వేసేస్కున్నాననుకోండి..) అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే నన్ను గుద్దేసిన వాడు కూడా పడ్డాడు.. కాని వాడు హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల తలకి గాయం అయ్యింది. అయితే ఆ శ్రీరాముని దయ వల్ల అతను కూడా ఇప్పుడు బాగనే ఉన్నాడు..

ఆతర్వాత కాసేపు కల్లోలం జరిగింది అక్కడ.. అది ఇప్పటికి అప్రస్తుతం..

అయితే ఇక్కడ నేను చెప్పదలచుకున్నది ఏమంటే, నేను తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈరోజు అంత పెద్ద ప్రమాదం జరిగినా బతికి బట్టకట్టగలిగాను.. కాబట్టి దయచేసి మీరందరూ హెల్మెట్ లేకుండా బైకు మీద బయటకు వెళ్ళకండి.. ఫ్యాషన్లు, స్తైల్స్ అనుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి..

ఇంకోక విషయం.. మన తత్తరపాటు వల్ల మనమే కాదు ఎదుటి వాళ్ళు కూడా సమస్యలకు గురి అవ్వాల్సి వస్తుంది, ముఖ్యం గా రోడ్డు భద్రత విషయం లో..

[ మితృలకి... నేను క్షేమంగా ఉన్నను.. ఆ సంఘటన జరిగిన వెంటనే నా ప్లాన్ ప్రకారం అమలాపురం వచ్చేశాను.. ప్రస్తుతం ఆఫీస్ లో ఉన్నాను. ]

ధన్యవాదములు.. ఈ పోస్ట్ లో మంచి సమాచారం ఉంది అని మీరు భావిస్తే మీ టైం లైన్ మీద మరియు మీ మితృలకు షేర్ చేయండి.

ఇట్లు మీ సత్యం గడ్డమణుగు.

నేటి నిజాలు..

నేటి నిజాలు..
పెద్ద ఇల్లు - ఉండేదేమో చిన్న కుటుంబం
ఎక్కువ డిగ్రీలు - కానీ తెలివి సున్నా..
కొత్త కొత్త మందులు - కావల్సినంత అనారోగ్యం
చంద్రుడ్ని తాకిన మనిషి - తోటి మనుషులెవరో తెలుసుకునేంత తీరిక లేదు.
మంచి జీతం - మానసిక ప్రశాంతత లేదు.
విలువలు లేని సంబంధాలెన్నో - అందులో నిజమైన ప్రేమ ఒక్కటీ ఉండదు..
వేల మంది ఫేసుబుక్కు ఫ్రెండ్స్ - ఆప్త మిత్రులు కరువయ్యారు..
మద్యం ఎక్కువ - మంచి నీళ్ళు తక్కువ
ఎంతో మంది మానవులు - కరువైన మానవత్వం
విలువైన గడియారాలు - కాని సమయమే లేదు ఎవరి దగ్గరా..!
- సత్యం గడ్డమణుగు, 23-10-2013, 02:04
www.naathalapulu.blogspot.com

మత్తెక్కడ..?

------------------------------------------

మందులోన లేదు
పొందులోనా లేదు,
విందులోన లేదు,
ఎందులోన ఉందో పొందికైన మత్తు..,

కిక్కెక్కే మత్తు,
కైపెక్కే మత్తు,
కిర్రెక్కే మత్తు,
చిర్రెత్తే మత్తు..,

మత్తు లోనె మునిగిపోయె
మంచివాళ్ల కాలం

మత్తులోనె చితికిపోయె
ఆడదాని బతుకులు,

మత్తుకోసం చచ్చిపోయె
మగవాళ్ళ గొంతులు..,

చేతుల్లో చలగాటం,
మాటల్లో మాయాజాలం,
బుద్ది లేని బుద్దిమంతుల
బుజ్జి బుజ్జి కోలాటం..

మత్తు కత్తి కోస్తోంది అంతులేని జీవితాలు
మత్తు ముంచివేస్తోంది రాజకీయ నాటకాలు,
మత్తు మంట లేపుతోంది అకలికై పోరాటాలు,
మత్తు కంచె కడుతోంది మనవత్వపు విభేధాలు..

ప్రపంచానికి ఊపిరి మత్తు..
మత్తుకి ఎన్నో రూపాలు..


- సత్యం గడ్డమణుగు, 07-10-2013, 21:50

నా (దరిద్ర) దేవత

నేనంటే నీకెందుకంత ప్రేమ..?
నేనంటే నీకెందుకంత మోజు..?
నీ కొంగు గాలి కూడా సోకరాదని
అందరూ ఆమడ దూరంలో ఉంటే,
నిన్నూ అందమైన సృష్టిలో భాగమని
భావించటమేనా నా తప్పు..?
ఎన్నో కోట్ల మంది జీవరాసులలో నీకు నేనే ఎందుకు నచ్చానూ..?
మచ్చుకకైనా ఎవరూ చూడలేనినీ హొయలను
హంసతూలికా తల్పం మీద పరిచి నా ముందు
ప్రదర్శింపజేస్తున్నావు.. నన్ను ముగ్ధుడ్ని చేస్తున్నావు..
నీలో ఏదో తెలియని మత్తుంది..
మత్తులో ప్రపంచం నాకు తెలియకుండానే నా నుండి వీడిపోతోంది..
అందరికీ నేను కానివాడ్నైపోతున్నాను..
అయిన వాళ్లలో చులకనైపోతున్నాను..
ఇప్పటివరకు ఉన్న మంచి మర్యాదలు మాయమైపోతున్నాయి..
ఐనా ఎందుకో తెలియదు, నీ మోజు మాయ నా మీద పనిచేస్తున్నా.,
మళ్ళీ నేనూ మనిషినే అన్న సంగతి గుర్తొచ్చినప్పుడు,
నువ్వు పెద్ద రాక్షసిలా కనిపిస్తున్నావు..
అయినా కూడా మళ్ళీ నా కంట కన్నీటిని నింపి అందులోకి
దూరిపోతున్నావు.. నువ్వే నా జీవితమైపోతున్నావు..
నాకు తెలుసు..
నాకు మాత్రమే తెలుసు..
ఇంకెవ్వరికీ తెలియదు..
కాదు కాదు తెలుసుకునే వారే లేరు కదా..
ఎప్పటికైనా నన్ను చేరే
సిరి నీ రూపమే అని..!
అందుకే పిచ్చి జనాలకి నీ తత్వం అర్దం కాక
నిన్ను ప్రేమిస్తున్న నన్ను పిచ్చివాడంటున్నారు..!


- సత్యం గడ్డమణుగు,07-10-2013, 20:03

"కొంత మంది" మగ వెధవలకి..

ఒకటి గుర్తుపెట్టుకో.. ఒక అమ్మాయి అందం గా ఉంది అని చెప్పటం తప్పు కాదు.. ఆడపిల్ల కూడా నీ(నా)లాగే ఈ ప్రకౄతిలో ఒక భాగం.. ఆ అమ్మాయి ఇచ్చిన చనువుని ఆసరాగా తీసుకుని వెధవ ట్రిక్కుల్ని ప్రయోగించటం తప్పు.. అదే నీ భాషలో ఫ్లర్టింగు.. ఈ మద్య ప్రతి చిన్న దానికి ఇదొక పదం పట్టుకు వేళ్ళాడుతున్నారు అందరు.. ఆడపిల్ల అందాన్ని అందమైన మనసుతో చూడాలి.. కామంతో కాదు.. అది ఒక్కటి తెలిస్తే చాలు..

- సత్యం గడ్డమణుగు, 12-09-2013, 23:13

గద్ద గాండ్రించినా.., పులి విసిలేసినా పెద్ద తేడా ఎం ఉండదులే..

నాకో విషయం అర్దమయ్యింది.. ప్రస్తుతం ఎవరూ కూడా ఎదుటి వాళ్ల దగ్గర వినటానికి ఇష్టపడట్లేదు.. అందరూ చెప్పేవాళ్లే.. ఏం.. ఆమాత్రం తెలీదా మాకూ అనుకుంటున్నరు అందరు..! హా కొంతమంది వినే వాళ్ళున్నారండోయ్.. కాకపోతే వాళ్ళలో సగం మంది పక్కకు వెళ్ళి సెటైర్లు వేస్కునే భ్యాచ్ అన్నమాట.. ఆ మిగిలిన వాళ్ళలో ఇంకొంతమంది "విందాం పోయేదేముంది..? మన పని జరిపించుకోవటం ముఖ్యం.. కాసేపు కుర్చుంటే పోయేదేముందిలే..?" అనుకునే వాళ్ళు.. కానీ మొత్తానికి శ్రద్దగా ఏదో మంచి ఉన్నట్లుంది తెలుసుకుందాం అనుకునే వాళ్ళు 1% ఉంటారు..! మళ్ళీ ఒక్కొక్కళ్ళూ లిసనింగు స్కిల్స్ లో నిపుణులు.. ఉఫ్.. చెవిటోడి ముందు గద్ద గాండ్రించినా.., పులి విసిలేసినా పెద్ద తేడా ఎం ఉండదులే..-సత్యం గడ్డమణుగు,06/09/13

ఒకే ఒక్క అవకాశం అమ్మా అని నోరారా పిలవటం..

నాకీ అత్యుత్తమమైన మానవ జన్మనిచ్చిన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు..

" అమ్మా..
నిన్నలా తలచుకుంటే చాలు ఏదో తెలియని అనుబూతి..
చిన్నప్పుడు ఆటలాడుకుంటూ కిందపడి అమ్మా అనగానే ఏమయ్యిందో అని కంగారుగా కళ్లలో నీళ్ళు నింపుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదేనా అమ్మా నిన్ను పలేచిందీ అంటూ నేలని కొట్టి, దా్న్ని చూసి ఆ వయసులోనే ఏదో నన్ను పడేసిన నిన్ను కటట్టించేశాను చూశావా అన్న చిన్న గర్వంతో నవ్వేస్తుంటే నన్ను దగ్గరకు తీసుకుని ముద్దాడి లాలించిన నీ ఋణం తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం అమ్మా అని నోరారా పిలవటం.."

పుట్టినరోజు శుభాకాంక్షలతో నీ కన్నయ్య.
(My Mother's Birthday Today)

- Satyam Gaddamanugu.

నేను కష్టజీవిని..

నేను కష్టజీవిని..
దేశ కాలమాన పరిస్తితులు ఎలా ఉన్నా
నా కడుపు నా కష్టంతోనే నిండుతుంది.
ఎవడో వాడికి వాడు నాయకుడినని అనుకుంటూ
వాడి సొంత ప్రయోజనాల కోసం చేసే పనులకు
అనవసరంగా రెచ్చిపోయి
నా కాలాన్ని శ్రమనూ వృదా చేసుకుని
నాపొట్టా నా కుటుంబం పొట్టా మాడ్చుకుంటూ,
ఎవరో పెట్టిన బంగారు భవిష్యత్ ప్రలోభాలలో
వర్తమానాన్ని ద్వంశం చేసుకోలేను..
ఇప్పుడు నేను కష్తపదినా పరవాలేదు..
ఎప్పటికీ క్ష్టపడినా పరవాలేదు.

ఎందుకంటేచుట్టూ ఉన్న సమాజానికి
మంచి చేయాలంటే ఉద్యమాలే చెయ్యక్కర్లేదు
ఇంకా బలమైన అహింసా మార్గాలు చాలా ఉన్నాయి.
అవే నా మార్గదర్శకాలు.
మానవసేవే మాధవసేవ..
ఆ మాన(ధ)వ సేవలోనే నిరంతరం
అలుపెరుగక కష్టపడే శ్రమజీవిని నేను.

- శ్రీ సత్యం గడ్దమణుగు

సాధిస్తాను.. తప్పకుండా సాధిస్తాను..


నాకున్న 50-60 సం.ల జీవితంలో ఒడిదుడుకుల ఒత్తిళ్ళను బేరీజు వేసుకుంటూ ఒదిగిపోలేను.. నా చిట్టి రెక్కలతో ఈ అందమైన సృష్టిలో అనంత దూరాలకు పయనానికి సిద్దమవుతాను.. మద్యలో ఎగరలేక కిందపడినంత మాత్రాన నేను ఎగరలేననుకోవటమో, లేక నా లెక్క తప్పిందంటూ నీ అనుభవ పూరక ఆలోచనల ప్రణాలిక ను తోసిపుచ్చినందుకే ఇలా జరిగిందిలే అని లోలోపల నువ్వు వెక్కిరింతల గర్వపు ఆనందాన్ని పొందితే  అది కేవలం కేవలం నీ అమాయకత్వమే అవుతుంది.కావచ్చు.. నేను నీ అంత సాధించకపోవచ్చు... నీకున్నంత అనుభవం నాకు లేకపోవచ్చు.. కానీ నేను ఇప్పుడు వేస్తున్న అడుగులన్నీ రేపు నా జీవితానుభవాలే అనే విషయాన్ని నీవు చూడలేకపోతున్నావు. సాధిస్తాను.. తప్పకుండా సాధిస్తాను.. ఆరోజున నేను చెప్పక్కర్లేదు.. నీవే తెలుసుకుంటావు నేను అన్న ఈ మాటలకి అర్దాలని..!

- సత్యం గడ్డమణుగు

ఆ 'అన్నయ్య.. ' ఈరోజు భర్తగా ఎలా మారుతున్నడో అర్దంకావట్లేదు..

అన్నా చెల్లెలి అనుబంధం ఎంతో అందమైనది.. అంతకన్నా పవిత్రమైనది.. చెల్లెలి
అల్లరి, చిలిపితనం, అమాయకత్వం, అన్నయ్య భాద్యత.. ఇలా భారతీయ
సాంప్రదాయానికి పట్టుకొమ్మ ఈ సంబంధం.. దానికి ప్రాధాన్యతనిస్తూనే
ప్రతీయేటా మనం రాఖీ పండుగ కూడా జరుపుకుంటాం.. అందుకే సమాజమ్లో అన్నా
చెళ్ళెళ్ళ సంబందానికి ప్రాధాన్యతను చేకూర్చే నేపద్యమ్లో గత తరంవాళ్ళు
అనేక చలన చిత్రాలు కూడా తీశారు.. ఎన్నో కథలు రాశారు..
ఇలాంటివి ఎన్ని చెప్పి ఏం లాభం..? ఈరోజు ఆ "అన్నయ్య" "చెల్లి" అనే
పిలుపులకు అర్ధం లేకుండా పోతోంది.. సమాజంలో బరితెగించి ఇష్టమొచ్చిన
తీరులో వ్యవహరించటానికి ఈ పిలుపులని ఉపయోగిస్తూ వాటికి ఉన్న విలువలను
తీస్తున్నారు.. నేనీ మాటలను ఏవరో నాకు చెప్తే విని రాస్తున్నవి
మాత్రంకాదు..
ఒకటి కాదు రెండు చూశాను.. చూసి అయ్యారే అని నోరు కరుచుకున్నాను.. ఛా..
ఎంటి దారుణం అనిపించింది..
మొదటిది ఒకమ్మాయి సం. పాటు అన్నయ్యా అన్నయ్యా అంటూ తిరిగిన ఓ కుర్రాడికి
ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఇప్పటినుంచి నువ్వు నా బాయ్
ఫెండ్ వి.. ఐ లవ్ యూ.. అని చెప్పింది.. చీ అమ్మాయిలు ఏంట్రా ఇలా
తయారయ్యారు..? అనుకున్నాను.. చాలా బాధేసింది.. నా భారత భవిష్యత్తు ఏమిటా
అని.. నిజమే మరీ ఈ కాలం అమ్మాయిలు చాలా వరకు(అందరూ కాదేమో)
1) తల్లి దండ్రులు ఏమన్నా అంటారేమో అనీ,
2) చుట్టు పక్కన వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అనీ,
3) ఫ్రెండ్స్ లింకులు పెట్టేస్తారేమో అనీ,
4) ఆ పలానా కురాడు ఎక్కడ ఐ లవ్ యూ చెప్పేస్తాడేమో అనీ,
ఇలా అనేక భయాల వల్ల "అన్నయ్యా.. " అని పిలిచేస్తున్నారు తప్ప అలా పిలిచేవారిలో నిజంగా ఆ అనుబంధాన్ని అంత పవిత్రంగా, అంతే జాగ్రత్తగా కొనసాగించేవారు, కనీసం తమ భావాలను తదనుగుణంగా మలచుకుని నడుచుకునేవారు తక్కువైపోయారు.. ఆ పిలుపుని తమ ఆగడాలకు ఒక అడ్డు తెరగా ఉపయోగించుకుంటున్నారు.. దాదాపు ఇలాంటి ఉదాహరణలే అనునిత్యం దర్శనమివ్వటం బాధాకరం.. అయితే అబ్బాయిల్లో కూడా ఇలాంటి అకృత్యాన్ని మొదటిసారి చూశాను… నా కళ్ళ ముందే మూడు సం. లు అన్నా.. చెల్లీ.. అంటూ తిరిగిన ఇద్దరు త్వరలో
పెళ్ళి కూడా చేస్కోబోతున్నారని తెలిసి షాక్ తిన్నాను.. రాఖీలు కట్టించున్న ఆ 'అన్నయ్య.. ' ఈరోజు భర్తగా ఎలా మారుతున్నడో అర్దంకావట్లేదు.. పోనీ నీకు అలాంటి ఉద్దేశ్యం ఉన్నప్పుడు అన్నా చెల్లీ అనుకోకుండా ఉంటే సరిపోతుంది కదా… అసలు చెల్లి అని పిలిచిన నోటికి 'నిన్ను పెళ్ళి చేస్కుంటాను.. ' అని మాటలెలా వచ్చాయో అర్ధం కావట్లేదు.. ఒకవేళ వాడు అడిగినా ఆ చెల్లెమ్మ ఎలా ఒప్పుకుందో తెలీదు.. ఇలాంటి దారుణాలను చూస్తూ నాలాంటి చాలా మందికి అన్నా చెల్లెలి పవిత్రమైన సంబంధం మీద కూడా గౌరవం పోతుంది.. వేరే వాళ్ళదాకా ఎందుకు నన్ను ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు అన్నయ్యా అంటూ సంభోదిస్తే భయమేస్తోంది..

ఈ సందర్భంగా ప్రతీ అమ్మాయికి అబ్బాయికి చెప్పే మాట ఒకటే.. అనవసరంగా మీ
విలాసానికో, అవసరానికో, అడ్డుకట్టకో లేదా తాత్కాలికంగా
తప్పించుకోవటానికో, ఇలాంటి పిలుపులని వాడి వాటికున్న విలువలని మంటలో
కలపకండి.. అన్నా చెల్లెలి పవిత్రతను కాపాడండి..

- సత్యం గడ్డమణుగు, 10-04-2013, 00:22am

నా సంస్కృతి సచ్చిపోతోంది ||సత్యం గడ్డమణుగు||


పంచెకట్టు పవిత్రత ఇప్పుడు
పాత కాలపు చాదస్తంగా మారుతోంది..
నా సంస్కృతి సచ్చిపోతోంది..

పైట కొంగు దిద్దుబాటు ఎన్నో ఫ్యాషన్ల పైమెరుగులలో
కనిపించకుండా పోతోంది...
నా సంస్కృతి సచ్చిపోతోంది..

రైంస్ పోయంస్ అనుకుంటు చిన్ననాటి
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ లను
ఏనాడో పలకలమీద తుడిపేశారు..

ఫేసుబుక్కుల చిక్కులలో
లైకుల నొక్కులు నొక్కుతూ
రోజుకో నీతి వాఖ్యాన్ని పంచుకుంటు
మేము కూడా సాంప్రదాయాలకు విలువనిచ్చేస్తున్నాం
అని తెలియకుండానే ఆర్టిఫిషియల్ గా తెగ సంబరపడిపోతూ
నిజం లో అలాంటి అవకాశం వచ్చినప్పుడు
మాత్రం తమ గజి బిజి బతుకుల బిజీ లైఫుని
వంక చేసుకుని తప్పించుకునే
తలకమాసిన సన్నాసుల వైరస్ ఈరోజు
క్రమ క్రమంగా అందరికీ పాకిపోతోంది..
నా సంస్కృతి సచ్చిపోతోంది..

- Satyam Gaddamanugu , 27-02-2013, 11:19am

జనాల కన్నీరుల ఏరులలో ప్రతీకారమనే చేపలను పట్టే ఆగంతక జాలర్లు

రక్తం తాగే తోడేళ్ళ విక్రుత హీంకారాలకు, ఈనాడు
ప్రశాంతమైన నగరం రక్తపు ముద్దలతో తడిసిపోయింది..
ఎన్ని సార్లు ఎంతమంది
అభం శుభం తెలియని అమాయకుల
ప్రాణాలను బలి తీసుకున్నా
ఆ రాక్షసుల ఆకలి తీరటం లేదు..

బోసినవ్వుల పాపాయిల నుండి తాతయ్యల వరకు
ఎంతో మంది తిరుగాడే రద్దీ రోడ్లు ఒక్కసారిగా
ఎరుపు రంగు పూసుకుని కాటికి
కళేబరాలను అందించేందుకు సిద్దమయ్యాయి..

నుజ్జు నుజ్జయ్యి సగం కాలు విరిగిపోయి
తాళలేని ఆ బాధలో "అమ్మా.. నొప్పీ..
తట్టుకోలేకపోతున్నాను.. " అంటూ కోమాలోకి
చేతిలో బస్సు టికెట్టుతో ప్రయాణమయ్యింది నా సోదరి..

టీవీ లో సినిమాలు సీరియల్సు చూస్తూ మద్యలో
ఫ్లాష్ న్యూస్ బాంబ్ తో జారిపోయిన
గుండెను గట్టిగా పట్టుకుని కంగారులో
సెల్ఫోను కీపాడ్ పై తడబడుతున్న వేళ్ళను
సరిచేసుకుని "ఎలా ఉన్నావ్ రా.. " అంటూ ఎంతో మంది
అమ్మా నాన్నల హృదయాలు..

ఎవరిదీ తప్పు..??
ఎవరు దీనికి దోషులు..??
ఇలా జనాల కన్నీరుల ఏరులలో ప్రతీకారమనే
చేపలను పట్టే ఆ ఆగంతక జాలర్లదా..??
ముందే హెచ్చరిక అందినా
ఏమీ చేయలేని అసమర్ద వ్యవస్త దా..??
లేక
ఇలాంటి అసమర్ద వ్యవస్త లో
బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న
ఈ అమాయక ప్రజలదా..??

- Satyam Gaddamanugu||22-02-2013||11:00am||

నీ పేరు స్వామి కాదు నాయనా "భక్తి స్వామి"వి..


ఈరోజు నేను నిదుర లేచి తయారవుతుండగానే మా భరద్వాజ్ గాడు "అన్నయ్యా.. త్వరగా కానివ్వు హనుమాన్మందిర్ కి వెల్దాం" అన్నాడు. ఇంకెముంది శుభం అనుకుని ఇద్దరం త్వర త్వరగా రెడీ ఐపోయి గుమ్మం దాటామోలేదో ఒక ఆటో అతను మాకోసమే అన్నట్లు ఇంటి ముందు నిల్చుని హనుమంతునికి దణ్ణం పెట్టుకుంటూ ఉన్నాడు (ఇక్కడ కూడా ఒక హనుమాన్మందిర్ ఉందిలేండి..) ఇంక అతన్ని "ఇలా గుడికెళ్లాలి వస్తావా..??? " అంటూ ఆటో ఎక్కేసి బయల్దేరాము..
ఎక్కిన
పది నిముషాల్లో ఆటో అతను ఒక్క సారిగా ఆపేసి " దణ్ణం పెట్టుకొచ్చేస్తాను.. ఇక్కడే ఉండండి.. " అంటూ ఆటో దిగి ముందుకెళ్లాడు. తీరా చూస్తే అక్కడ ఏదో అమ్మవారి గుడి ఉంది. పోనీలే గుడే కదా అనుకున్నాము. ఇంక చూస్కోండి దారి మద్యలో ఎక్కడ గుడి కనిపిస్తె అక్కడ ఆగటం, అందరం దిగి దండం పెట్టుకుని రావటం.. "భలే ఆటొ వాడు దొరికాడు.. ఇవాళ హాయిగా దైవ దర్శనాలవుతున్నాయి" అని ఇద్దరం మనసులో అనుకుని సంతోషపడ్డాము. మొత్తానికి మేము అనుకున్న హనుమత్ కోవెల కి కూడా వెళ్ళేసి తిరుగు పయనమయ్యాము. ఈ మద్యదారిలో మా భరద్వాజ్ గాడు ఉత్సాహం ఆపుకోలేక " ఏం నాయనా ఏంటి నీ పేరు? మొత్తానికి మంచి భక్తి ఉన్నవాడివే దొరికావు పొద్దున్నే.. " అన్నాడు. అలా మొదలయ్యింది మా ముచ్చట. తన పేరు స్వామి అనీ, తనకు రోజూ ఇలా ఉళ్ళోని ప్రతీ గుడిలో దర్శనం చేసుకోవటం నిత్య కృత్యమనీ, తనకు ఇద్దరు పిల్లలనీ చెప్పుకొచ్చాడు. అందులోనూ అతను చెప్పిన ఒక మాట మత్రం నాకు బాగా నచ్చింది " దేవాలయంలోకి అలా వెళ్ళి వస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండీ.. " అని.. నిజమే కదా మరి.. భక్తి మనసులో సాత్వికాన్ని తట్టిలేపుతుంది. ఆ క్షణం లో ఆ ఆటో స్వామి లో నాకు సాక్షాత్తూ ఆ ఆంజనేయుడే కనిపించాడు. అందుకే ఆయన నిజంగా ఆటో స్వామి కాదు భక్తి స్వామి.

నవ యువ భారత నిర్మాణం

ఫీజు కోసం విద్యా సంస్థలు..
పదవికొసం రాజకీయనాయకులు..
ఫ్యాంస్ కోసం సినిమా హీరోలు..

అందంగా కనిపించాలనే హీరోయినులు,,
అందాలను చూపించే ఐటం గళ్స్..

మార్కులకోసం తల్లిదండ్రులు..
వారి తిట్లను తప్పించుకోవాలనే కొడుకులు/కూతుర్లు..

జీతం కోసం ఉద్యోగస్తులు,,
లాభంకోసం యజమానులు..

మతాలకోసం ప్రవక్తలు..
కులాలకొసం నాయకులు..
నాశనం చేసే ఉగ్రవాదులు..

దేశం కోసం అమాయకులు..
దేశాన్నేలే అవినీతి నేతలు..

అన్నంకోసం పేదవాళ్ళు..
అన్నాన్ని పారేసే డబ్బున్నోళ్ళు..

కుప్పలు తెప్పలు రోగులు ఆసుపత్రులు..
కుప్పలు పోసినా వైద్యం చేయని డాక్టరు దేవుళ్ళు..

ఎన్నో ఎన్నో ఈ రాజ్యం లో..
ఎన్నో ఎన్నో నా భారత దేశం లో..
ఎన్నో ఎన్నో నన్ను కన్న ఈ కన్నభూమిలో..
ఎన్నో ఎన్నో నేను అను నిత్యం కంటున్న ఈ అనైతిక సమాజమ్లో..

సోదరులారా చూడండి..
సోదరులారా కదలండి..
సోదరులారా ఉద్యమించండి..
సోదరులారా కదం తొక్కండి..

నవ యువ భారత నిర్మాణానికి..
నవ చైతన్య పథాన ప్రయాణానికి..||

- -మీ సత్యం గడ్డమణుగు
సమాజం మొత్తం నన్ను వ్యతిరెకించినా సరే,
నేను నన్ను సమర్దిస్తునే ఉంటాను..
నన్ను నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను..
ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ సమాజం నే నడిచిన
బాటలోనే అడుగులు వేస్తుందనే, గుండె నిండా గట్టి నమ్మకం||

ప్రియమైన తల్లిదండ్రులారా.. అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు

ప్రియమైన తల్లిదండ్రులారా..
ఒక్క విషయం చెప్తాను.. కాస్త ఆలకించండి..
ఈనాటి కాలం కుర్రాళ్ళు చాలా దారుణంగా ఉన్న మాట వాస్తవమే.. అబ్బాయిలు, అమ్మాయిలు  అనే తేడా లేకుండా అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు, ఇలా పరిస్తితులు మరీ దిగజారిపోతున్నాయనటమ్లో  సందేహం లేదు. కనుక మన పిల్లల విషయమ్లో కాస్త జాగ్రత్తగా ఉండటమ్లో తప్పులేదు.

అయితే ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.


ఒకటి ప్రతిక్షణం బయట పరిస్తితులు , రోజులు బాలేవంటూ అనుదినం పిల్లల్ని అనుమానపు కళ్ళతో చూడటం మంచిది కాదు.
మేమేం అలా కాదు.. మా పిల్లలకి పూర్తి స్వేచ్చనిచ్చాం అని  అనుకునేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కానీ, ఆలోచనలో కూడా పొరబడి బాదపడే వాళ్ళు ఎందరో..

పిల్లలకు స్వేచ్చనిచ్చి మరీ పిల్లలేం చేస్తున్నారో , స్వేచ్చని ఎమైనా దుర్వినియోగం చేస్తున్నారా? అని లోలోపల మదనపడుతూ తెలియకుండానే పిల్లతో ప్రవర్తనలో తేడా ఒచ్చేసి ఇంటి వాతావరణాన్ని నరక ప్రాయం చేసుకుంటున్నారు చాలా మంది తల్లి దండ్రులు.
అలాగని మీ అలోచనలు తప్పని నేను చెప్పటం లేదు.

మీ ఆలోచనలు 100% మంచిదే. కానీ దాన్ని మరీ ఎక్కువ చేసుకుని అనుమానం అనే ఒక బూతాన్ని మీలో పెంచుకోవద్దు అని మాత్రమే చెప్పదలచుకున్నాను.

ఇక రెండవది,
మీ పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అని తెలిసినప్పుడు,

మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి "పలానా అతను/ఆమె నన్ను ప్రేమిస్తున్నారట"అని చెప్పినప్పుడు,
ఎవరైనా ఒచ్చి  సూటిగా మీ పిల్లల్నీ ప్రేమిస్తున్నా అన్నప్పుడూ,
ఇలాంటి పరిస్తితులు ఎదురైనప్పుడు సహజంగా కోపం తెచ్చేసుకుని,
అమ్మాయికైతే దబదబా ఇంకో సంబందం చూసి  పెళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టటమో,కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళైతే  ఎదుటి వాళ్ళ కి బెదిరింపులు ఇవ్వటం లాంటివి సహజం. అయితే ఇలాంటి సమయమ్లో కంగారు పడేకంటే, నిదానంగా ఆలోచించటం మంచిది.


ఎదుటి వాళ్ళు అమ్మాయి అయితే
నిజంగా అమ్మాయి మన వాడికి సరిపోతుందా?
వాళ్ల కుటుంబం ఎలాంటిది?
ముఖ్యంగా అమ్మాయి ప్రవర్తన మంచిదేనా?
వగైరా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

(అయితే ఇలాంటప్పుడు పరపతి చూడటం మంచిదే కానీ డబ్బూ,

ఆస్తులూ అంటూ పట్టించుకోవడం అంత కరెక్టు కాదు.)


ఒక వేళ ఎదుటి వాళ్ళు అబ్బాయి అయితే
అబ్బాయి మన అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేక పోకిరీ వేషాలు వేస్తున్నాడా?
ఒకవేళ నిజంగా ప్రేమించేవాడే అయితే భవి్ష్యత్తులో అమ్మాయిని బాగా చూసుకోగలడా?
అలా చూసుకునేందుకు అతని దగ్గర మంచి ఉద్యోగం ఉందా?
వాళ్ళ కుటుంబం ఎలాంటిది? వివరాలేంటి?
ఇంట్లొ మన అమ్మాయి సర్దుకోగలుగుతుందా?
ఇలా వగైరా వగైరా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఒకవేళ ఎదుటి వాళ్ళు మంచి వాళ్లైతే, మనకు కావాల్సిన లక్షణాలున్న వాళ్ళు అయితే సంతోషం. ఒకవేళ కాకపోతే మాత్రం అప్పుడు ఏదో ఆవేశంగా  కాకుండా మన పిల్లలను దగ్గరకు తీసుకుని ప్రేమగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. మన ఆలోచన ఏమిటో పిల్లలకు స్పష్టం గా అర్దమయ్యేలా చెప్పాలి. ఇలాంటప్పుడు ఏమాత్రం  దురుసుగా వ్యవహరించినా తరువాతి పరిణామాలు కొన్నిసార్లు ఇంటి పరిస్తితులని కలిచివేస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు జర జాగ్రత్త…!!!

ఇక అవతలి వాళ్ల సంగతంటారా.. వాళ్ల వల్ల మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ లేనంత వరకూ మనం కాస్త "ఏం జరగలేదులే"అని హాయిగా ఉండటమే మంచిది. అనవసరంగా లేని చిరాకుని నెత్తిన వేసుకోకుండా..!

ఒకవేళ ఏమైనా ఇబ్బంది  కలిగితే మాత్రం అప్పుడు ఏం చేయాలో, ఏంచేస్తే తరువాత మన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అని నిదానం గా అలోచించాలి.

మొత్తానికి నేను చెప్పొచ్చేదేంటంటే వయసుకొస్తున్న పిల్లల విషయమ్లో
ఆవేశపడి ని్ర్ణయాలు తీసుకోవడమో, అతి జాగ్రత్త పేరుతో అనుమానాన్ని పెంచుకోవడమో
రెండూ మంచివి కావు.

కాబట్టి మిత్రులారా కాస్త ఆలోచించి అడుగెయ్యండి.
( మీకు ఈ పోస్టు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే మీ స్నేహితులకూ షేర్ చేయండి.)

-మీ సత్యం గడ్డమణుగు

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.