పేద వాడు స్నేహం చేయకూడదా....?


ఈ రోజు ఉదయం నా స్నేహితుడు ఒకతను మా ఇంటికి ఒచ్చాడు.... చాలాసేపు మాట్లాడుకున్నాం.... తన బాధ అంతా చెప్పుకున్నాడు.... పాపం వాడిని వింటుంటే నాకు చాలా బాదేసింది... అందుకే ఇక్కడ వాడి మనసులోని వేదనని రాస్తున్నాను....

"డబ్బే సర్వమా... డబ్బు లేకపోతే స్నేహం చేయటానికి కూడా పనికిరామా... బైకులు, కార్లు, పార్టీ లు, చేతి నిండా డబ్బులు ఉన్న వాడే నిజమైన మిత్రుడా... 
నిన్ను తిప్పటానికి బైకు లేదు, పార్టీ ఇవ్వటానికి పర్సులో నిండా డబ్బులు లేవు, నీ సెల్ లో రీచర్గ్ చేయించటానికి కూడా నా స్తోమత లేదు, సినిమాలకు షికార్లకు తిప్పలేను.... కానీ మనసారా నువ్వెప్పుడు బాగుండాలని కోరుకుంటాను, నీకు ఏ బాధా అంటకూడదని ప్రతి నిమిషము ఆ దేవుడిని ప్రర్దిస్తాను....
నీ కనుల వెంట నీరు ఒస్తే చూడలేక నా ప్రాణం పోతుంది.... నీ నవ్వుల ఆనందమే నాకు అమృత భాండం....
ఏ కష్టాలైనా సరే నీ దరిచేరక ముందు నన్నే తాకాలి...
ఎందుకు మన మద్య స్నేహ బందం ముడిపడిందో తెలియదు కానీ నా చివరి శ్వాస వరకు నిన్ను మరువలేను.... అలాంటిది కేవలం నా పేదరికానికి నన్ను ఒంటరిని చేయటం భావ్యమా....?
ఈ రోజు ఎవరో నిన్ను తన కారులలో తిప్పుతున్నాడని, వాడు డబ్బున్న వాడని చెప్పి నా నా స్నేహాన్ని అవమాన పరచటం న్యాయమా.... సూటిగా నవ్వు నా స్నేహమే లోపమని చెప్పి వాడితో బైకు మీద షికారు నిజమని వెళ్ళినప్పుడు నా ప్రాణం ఇక లేదు....
పేదవాడిని కావటం నా నేరమా?
స్నేహం కేవలం డబ్బున్నవాడే చేస్తాడా?
డబ్బులే ఫ్రెండ్షిప్ ఆ?


కావాలనుకుంటే వంద తప్పులు చేసి అయినా నీకోసం నేను డబ్బులు తీసుకు రావచ్చు... నిన్ను సంతోశాపరచాచ్చు... కానీ నా తత్వం అది కాదు మిత్రమా.... ప్రాణం పాయినా తప్పు చేయకూడదని నేను నిశ్చయించుకుంటే నా ప్రాణమైన నువ్వు తప్పైనా చేయమనటం సమంజసం కాదు రా.... ఇకనైనా నిజమైన,నిర్మలమైన నా మనసును అర్ధం చేసుకో....
కావాలంటే నీ సంతోషం కోసం నా ప్రాణం ఇవ్వగలను కానీ ప్రాణం పాయినా తప్పును చేయలేను... 

అలాగని నిన్ను విడిచి ఉండలేను... నన్ను ఒంటరిని చేయకు.... "

9 కామెంట్‌లు:

  1. ఎవరో ఆ మిత్రుడు చెప్తే మేము కుడా తెలుసుకుంటాము గా...!!!
    బాగానే రాసావు ...
    తప్పులు సరిచూసుకో ప్రచురించే ముందే .

    రిప్లయితొలగించండి
  2. స్నేహం సొత్తు ఉన్న వాడికి మాత్రమే సొంతం కానే కాదు. స్నేహం చేయటానికి ధనిక, బీద అనే తారతమ్యాలు లేవు.ఈ విషయం గురించి మన పురాణాలు మనకు చాలా చక్కగా వివరిస్తున్నాయి.

    ఏ దేశానికి రాజు అని శ్రీ కృష్ణుడు కుచేలుని తో సహవాసం చేసాడు?

    ఎం ఆశించి ధుర్యోధనుడు కర్ణుడికి పట్టం కట్టాడు?

    అలంటి పురాణ పురుషుల స్నేహమే నిజమైన స్నేహంగా ఏ రోజు మనం చెప్పుకుంటున్నాము.
    మంచి టపా ...!

    @SATYAM

    రిప్లయితొలగించండి
  3. satyam, vaastava paristhithini baaga choopinchaaru, genuine friendship anEdi oka rakamugaa chaala arudai pOindi, prEmaki(aaDa magaa madya prEma), peLLiki samaana hOda avasaram, kaani snEhaaniki kaadu,ivanni unTEnE oka manishini kalavaDamO, vaaLLani ishtapaDaDamO chEstunnamu anTE manam vaLlathO kEvalam laavaadEvi/vyaaparam chestunnatu.

    రిప్లయితొలగించండి
  4. nice ra... chala bagundi...
    friendship lo manam em asinchakudadu okavela ala alochiste adi friendship avvadu... nd all d best satyam

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.