నీటి భాష తెలుసా మీకు....?

నీళ్ళు మాట్లాడుతాయి.. గమనించి చూడండి.నీళ్ళు తాము మాట్లాడాల్సింది మాట్లాడి తీరుతాయి.వినగలిగే శక్తి, గమనించగలిగే దృష్టి ఉండాలి గాని నీటి మాటలు మనకు వినబడతాయి.

సముద్రం లో ఉన్న నీటిని చూడండి. అవి విశాలంగా ఉండే భాషనూ మాట్లాడుతాయి. లోపల సుడిగుండాలు ఉన్నా రగిలే పర్వతాలు ఉన్నా పైకి ప్రశాంతం గా ఉండమని చెబుతాయి. పడినా పైకి లేవమని కెరటం తో కబురు పంపుతాయి.

మంచు ప్రాంతాలలో ఉండే నీటిని చూడండి. గడ్డకట్టి ఉంటాయి. ఘనీభవించి ఉంటాయి. వేసవి ఒచ్చే వరకూ ఉష్ణం తగిలే వరకూ ఓపిక పట్టి ఉంటాయి. కానీ వేడి తగిలక అవి కరిగి.... కదిలి.... గలగలమని.... జలజలమని ప్రవహించి మనకు "మంచి రోజులు ఒచ్చేవరకు ఆగు, చిన్నా పెద్దా కష్టాలకు కలవరపడవద్ద"ని చెబుతాయి.

నదిలో ప్రవహించే నీటిని చూడండి, జీవితాన్ని తమలో చూసుకోమని చెప్పవూ..?సాఫీగా ఉంటుందా ఆ ప్రయాణం! ఎదుట కాసింత ఇరుకు... అంతలోనే మలుపు.... ఆ పైన ఒక బండ రాయి.... మరి కాసేపటికి అడవి.... దాటితే లోయ.... అన్నీ దాటుకుని గమ్యాన్ని చేరవూ..? జీవితం లో ఎన్ని మలుపులు ఒచ్చినా సఫలత్వం అనే గమ్యం వైపు చేరమని చెప్పవూ...?

చెరువులో నీళ్ళు ఉన్నంతలో సంతృప్తి పాడమని చెబుతాయి. బావిలో నీళ్ళు నీ దగ్గర కొంచమే ఉన్నా నలుగురికి పంచమని చెబుతాయి. కళ్ళలో ఉండే నీళ్ళు నీ దుక్ఖాన్ని దాచుకోవద్దని చెబుతాయి. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోమని చెబుతాయి.

తరచూ మీ కుటుంభ సభ్యుల కళ్ళను గమనించండి. వాటిలో చెమ్మ దేనికి సంకేతమో అర్ధం చేస్కొండి. వాళ్ళ దుఖం మీ దుఖం. వాళ్ళ సంతోషం మీ సంతోషమే కదా!

1 కామెంట్‌:

  1. egase pratii keratam padina prati sarii kinda ninchi paiki lemmani chepthundi... megham nundi karige neeti chukka entha paina vunna nelanu maruvaddantundi. mana bandhaalani duram cheskovaddantundi... Lavanaalatho kudina kadali neeru jeevithamlo anni nimpukommantundi. kani ade sruthi minchithe uppu neerulaga manatho saha evarikii upayogapadadani gurthu chesthundi. oorini saitham minge ala chebuthundi apramatthulamai vundakapothe anthe sangathulani! ante, prati choti ninchi manam edo okati nerchukunte vundali annamaata

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.