ఓ పేదరికమా..

ఓ పేదరికమా..
నీ ఆకలి కేకలకు నా చెవులు తట్టుకోలేకపోతున్నాయి..
నీ కోరల పదును నాతో ఆకలి కేకలు పెట్టిస్తున్నాయి..
ఎన్ని దిక్కులా పక్కల చూసినా నీ ఛాయా తప్ప నా కంటికి ఏమీ కానరాదే..
నగుమోము పైన నవ్వంటే నీకెందుకంత కోపమో నాకర్ధం కావట్లేదు..
నా చెంత నువ్వుండగా కన్నీరు తప్ప ఇంకేదీ దరిచేరట్లేదు..
హయ్యారే.. ఏరీ.. నా మిత్రులు ఏరీ..
నా సావాసగాళ్ళు ఏమయ్యారు..??
అందరితో స్నేహం చేసిన నన్ను ఈనాడు నీ స్నేహితుడిగా మార్చుకునా
చూసావా.. నా స్నేహాలు నాకు దూరం అవుతున్నాయి..
ఇది కేవలం, కేవలం నీ ఇంద్రజాలమే అని నాకు తెలుసు..
అయినా నీకు నేనంటే ప్రేమో కోపమో తెలియదు నాకు..
ప్రేమే అనుకుంటా.. అందుకేనేమో, ఎంత కాదనుకున్నా వీడలేకున్నావు..
కాదు కాదు.. కోపమేననుకుంట.. లేకపోతె నా అందమైన లోకాన్ని చిటికెలో దూరం చేస్తావు..

అయినా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం..
ప్రపంచం లో అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను..
ఎందుకో తెలుసా..
ఈ జగాన మనుషుల అంతరంగాలను నీ కన్నా అందంగా, నీకన్నా నిజంగా, నీకన్నా స్పష్టంగా ఏ అద్దమూ చూపలేదు కనుక..!

- సత్యం గడ్డమణుగు [03-10-2012, 01:56am]


ఆడదాని అందమైన లోకం

ప్రతీ మగడు వాడి గర్ల్ ఫ్రెండ్ ని కానీ, భార్యని కానీ
ప్రపంచం లో తానొక్కడే మొత్తం అర్ధం చేస్కునా అనే 
బ్రమ లో ఉండిపోతాడు కానీ

ప్రతీ  ఆడపిల్లకీ ప్రపంచంలో ఎవరికీ అర్ధం కాని ఒక
అందమైన ప్రత్యెక లోకం ఉంటుంది తన మనసులో..
అది ఎంత గింజుకున్న అర్ధం కాదు ఎవరికీ ..

కానీ ఒకవేళ కనుక మగడు ఆ అమ్మాయి కి ఉన్న
ఆ ప్రత్యెక భావాలను గౌరవించగలిగితే మాత్రం ,
ఇక ఆ అబ్బాయే ఆ అమ్మాయికి లోకంగా మారిపోతాడు..!
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.