రాక్షసుడిగా మిగిలిపోతాడు "నాన్న...."

ఒక్కొక్క వయసులో పిల్లల ఆలోచనా సరళిలో ఎంతో మార్పు కన్పిస్తుంది...
కన్నబిడ్డల కోసం రేయింబవళ్ళూ శ్రమపడుతూ వారు ఎంతో ఎదగాలని తపిస్తూ గారాబంతో దారితప్పుతారేమోనన్న భయంతో ప్రేమనంతా గుండెల్లోనే దాచుకుని లేని కాటిన్యాన్ని ప్రదర్శించి పిల్లల దృష్టిలో రాక్షసుడిగా మిగిలిపోతాడు "నాన్న...."
అదే తనను గుండెల మీద ఆడించి పెంచిన "నాన్న" గురించి పిల్లలు ఏ వయసులో ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు చూస్తె...



4 ఏళ్ళ వయసులో..: మా నాన్న చాలా గ్రేట్

6 ఏళ్ళ వయసులో..: నాన్నకు అన్నీ తెలుసు 

10 ఏళ్ళ వయసులో..: నాన్న మంచివాడే కానీ... ఊరికే కోపమొస్తుంది. నాన్నకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకే ఎక్కువ తెలుసు.

12 ఏళ్ళ వయసులో..: చిన్నప్పుడు నాన్నకు నేనంటే ఇష్టం ఉండేది. ఏమడిగినా కొనిపెట్టేవాడు.

16 ఏళ్ళ వయసులో..: కంప్యుటరూ, ఇంటర్నెట్టూ ఏదీ రాదు. అసలు ఈ డాడీ కి ఏది చేతకాదు.

18 ఏళ్ళ వయసులో..: అబ్బా.. ఈయనకు రోజురోజుకూ చాదస్తం పెరిగిపోతోంది. ఒక్కమాటకూ అర్ధం ఉండదు.

20 ఏళ్ళ వయసులో..: బాబోయ్ నాన్నను భరించటం చాలా కష్టం. పాపం అమ్మ ఈయనతో ఎలా వేగుతోందో..!

25 ఏళ్ళ వయసులో..: ఏది చెప్పినా కాదంటారు. అసలీయన ప్రపంచాన్ని ఎప్పుడు అర్ధం చేస్కుంటారో!

35 ఏళ్ళ వయసులో..: నాన్న నన్నెంత క్రమశిక్షనగా పెంచారు... వీడేంటీ ఒక్కమాటా వినడు..!(వీడికి కూడా కొడుకు పుట్టాక..)

45 ఏళ్ళ వయసులో..: అన్నయ్య,అక్క,నేను,చెల్లి...ఇంతమందిని పెంచటానికి నాన్న పాపం ఎంత కష్టపడ్డారో, ఒక్కడితోనే నా తలప్రాణం తోకకోస్తోంది.

50 ఏళ్ళ వయసులో..: నాన్నకి ఎంతైనా దూరదృష్టి ఎక్కువ. మా అందరి చదువులూ ఉద్యోగాలూ... ఎంత ప్లాన్ గా తీర్చిదిద్దారు! అలాంటి మనుషులు చాలా అరుదు.

60 ఏళ్ళ వయసులో..: మా నాన్న చాలా గొప్పవాడు.

నాన్నను అర్ధం చేస్కోవడానికి మరీ అంతకాలం కావాలా..... కాస్త ముందే కళ్ళు తెరవలేమా..? 

(ఇది కేవలం మార్పు రావాల్సిన అవసరం ఉన్న వారిలో కొంతైనా చైతన్యం తెచ్చే క్రమంలో నే రాసాను కానీ అందరిని ఉద్దేశించి కాదు..)

8 కామెంట్‌లు:

  1. ఇది కేవలం మార్పు రావాల్సిన అవసరం ఉన్న వారిలో కొంతైనా చైతన్యం తెచ్చే క్రమంలో నే రాసాను కానీ అందరిని ఉద్దేశించి కాదు.. @murali

    రిప్లయితొలగించండి
  2. andharu ala undaru ra. . . nanna ante chachipoye vallu kuda untaru

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.