ఎన్నో వంటకాలున్నా రుచిలేని పండుగ..!


ప్రతీ సంవత్సరం దసరా అంటే అదో పెద్ద పండుగ, పది రోజులు కుడా పండుగ వాతావరణం లో మనసులో ఏదో తెలియని అనుభూతి తో హాయిగా జరుపుకునే వాళ్ళం. దసరా మొదటి రోజే పిండి వంటకాలు చేసుకుని వాటిని ఆ పది రోజులు తినుకుంటూ, ఇంకా మిగిలిన వాటిని సెలవల తరువాత క్లాస్మేట్స్ కోసం పట్టుకెళ్ళి "ఇదుగో తీసుకోండి రా మా అమ్మే చేసింది అనుకుంటూ పంచి పెట్టటం...", పండక్కి చుట్టాలందరూ ఇంటికి ఒస్తే పిల్ల మూక అంతా కలిసి ఇంటిని కిష్కింద చెయ్యటమే...! పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా నానా అల్లరీ చేసి చివరికి అలిసిపోయి కూర్చొని సాయంత్రం పూట ముచ్చట్లు పెట్టుకోవటం.... ఇలా సరదా సరదా గా గడిచిపోయే పండుగ కాస్తా ఈ బందుల గొడవ వల్ల నీరసం గా తయారయిపోయింది... ఎక్కడి వాళ్ళు అక్కడే.... ముచ్చట్లు లేవు, అల్లరి లేదు, ఆ ఆనందం లేదు... ఊరికేల్దామంటే బస్సులు ఉండవు, ఇంట్లోనే కూర్చుందామనుకుంటే కరెంటు ఉండదు, ఒక పక్క ఉక్కపోత చికాకు బోర్ ఫీలింగ్ ఇలా అదోలా తయారయింది ఈ పండుగ రోజులు అంతా...!
ఏంటో కనీసం ఒచ్చే సరి అయినా మళ్ళీ ఆ ఉల్లాసపు పండుగ రావాలి, ఆనందపు తెమ్మెరలను  తేవాలి.. అందరు ఆనందం గా ఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.