పేదలు, వృద్దులు, వికలాంగులు, అనాధాలకి ఎంతోమంది ఎన్నోరకాలుగా సేవలు చేస్తూ ఉంటారు... అటువంటి సేవలో మనము కుడా పాలుపంచుకోవాలి.. సేవకు స్ఫూర్తి ప్రేమే.. స్వార్ధరాహితమైన ప్రేమలో ఆనందం ఉంటుంది..
ముందుగా మీ మనస్సాక్షిని ఈ ప్రశ్నలు వేస్కోండి.....!
మీలో సేవాద్రుక్పధం ఉందా...?
ఇబ్బందులు పడుతున్న వారిని చూసి భరించలేరా..?
మీరూ సామాజిక సేవలో పాలు పంచుకోగలరా...?
పాటించవలసినవి...:
=> నిరంతరం మీ గురించే కాక ఇతరుల గురించి కూడా ఆలోచించాలి.
=> కష్టాల్లో ఉన్నవారిని తప్పకుండా ఆదుకోవాలి.
=> అనాధ శ్రనాలయాలు, వృద్ధాశ్రమాలను తరచు సందర్శిస్తుండాలి.
=> మీతోపాటు మీ స్నేహితులు, తెలిసిన వారు కూడా సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చొరవ తీస్కోవాలి.
=> సమాజం లో అందరితో సత్సంబంధాలను పెంచుకోవాలి.
=> ప్రభుత్వం నిర్వహించే లేదా ఇంకే ఇతర సంస్థలైనా నిర్వహించే సోషల్ సర్వీసుల్లో వాలంటీర్లుగా పాల్గొనాలి.
=> మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగించాలి.
=> ఆపదల్లో ఉన్నవారిని ఆడుక్వడానికి ఒక్కోసారి ఎంత ముఖ్యమైన పనులను కుడా విడా వేస్కోవడం లో తప్పు లేదు.
=> మీ వృత్తివాల్ల కలిగే సంతోషం కన్నా, సేవ ద్వారా మీకు లభించే తృప్తే ఎక్కువగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి