ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

నిన్న మా తమ్ముడి కాలేజీ లో "treditional  day" జరుపుకున్నారు.. 
ఈ "దినం" ప్రత్యేకత ఏంటంటే ప్రతీ ఒక్కరూ పంచేల్లో, చీరల్లో వెళ్లి ముగ్గులు వేయటం, గాలిపటాలు ఎగురవేయటం, భోగి మంటలు... ఇలా సంక్రాంతి వాతావరణాన్ని యువతకి తెలియజేయడం అన్నమాట..
ఏంటో ఈ కాలం ఇలా తయారయినందుకు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు... 
ఇంట్లో కూర్చొని మన సాంప్రదాయాలను తెలుసుకుని ఆచరించాల్సిన మనం ఈ రోజు ఎవరో ఒక కాలేజీ ఈవెంట్ లాగా conduct  చేస్తే వాడి దగ్గర ఏదో కాసేపు గెలవటానికి పెట్టుకున్న ముచ్చట లాగా అయిపొయింది... 
ఏం??? మనకు చీర ఎలా కట్టుకోవాలో కుడా పోటీలు పెడితే నేర్చుకుంటామా? 
పంచెలు కట్టుకునేది బహుమతులు గెలవటానికా????


ఈ ఒక్క సంక్రాంతి అని కాదు అసలు ఈనాటి యువతకి పార్టీలు, సినిమా లు తప్ప మన సంస్కృతి సాంప్రదాయాల మీద కనీస అవగాహన కూడా లేదు... 


పిల్లలే కాదు పెద్దలు కూడా ఎం తక్కువా అన్నట్లు "పండుగ ఒస్తే ఏదో ఇంట్లో షాప్ నుండి నాలుగు స్వీట్స్ తెచ్చుకుని తినేసి, ఖరీదైన బట్టలను కట్టుకున్నాము అంటూ పక్కన వారికి చూపించుకోవటమే" ప్రధానం గా మారిపోయింది...
అంతే కానీ అసలు పండుగ విశిష్టత కూడా తెలుసుకోవాలని కూడా అనుకోలేని దుస్తితిలో ఉన్నారు నేటి జనం...


అంతెందుకు మొన్నకి మొన్న ఏకాదశి రోజున నాకు కనిపించిన వారినల్లా "ఇది ధనుర్మాసం లో ఒచ్చే ఏకాదశి కదా... ఇంతకీ ఇది ఏ మాసం అని అడిగాను..." ఏ ఒక్కరూ కూడా ఇది "పుష్యమాసం" అని సమాధానం చెప్పలేకపోయారు...
కనీసం "ధనుర్మాసం అని అంటున్నారు కదా " ఎందుకు దీనిని ధనుర్మాసం అంటారు" అను అడిగాను దానికి కూడా సమాధానం లేదు.. ఈ ప్రశ్నలని కనీసం ఆరోజున ఒక డెబ్బై మందిని అడిగి ఉంటాను... 


ఇది ఒక్కటే కాదు మనం పుట్టిన నేల మీద మనకంటే ముందు పుట్టిన పద్దతులని సంప్రదాయాలని తెలుసుకోలేని ప్రతీ జన్మ నిరర్ధకమే...
మనం అబివృద్ది పధం బాట పట్టుకుని పాతాళానికి పోతున్నాము తప్ప ఈ కనిపించే ఎదుగుదల నిజం కాదు... దానిని మనం మన సాంప్రదాయాల మనుగడను కాపాడినప్పుడే నిజం చేసుకోగలము...
ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది... మన కట్టుబాట్లను తెలుసుకోవటం, కన్న తల్లి గురించి ఆలోచించటం ఒక్కటే...

ఇది మాత్రం ఏదో అబ్యర్ధనగా రాస్తున్నది కాదు... మనలో ఇవన్నీ తెలియని ప్రతీ ఒక్కరూ ఇకనైనా మేల్కొంటే మంచిదని చెప్తున్నాను... ఇకనైనా లేవలేని వారు, కనీసం ప్రయత్నించలేని వారు ఎదిగాక కన్నతల్లిని రోడ్డు మీద ఒదిలేసిన దౌర్బాగ్యులతో సమానం..!

3 కామెంట్‌లు:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.