భారతం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది.

నేను కూడా కొన్ని సం.ల తర్వాత వేరే దేశం పోతా.. నోబెల్ బహుమతి వస్తుందేమో..? గత పదేళ్లలో వచ్చిన నాలుగు బహుమతులు ఇండియాని కాదనుకుని వెళ్ళిన వాళ్ళవే అట.. వేల కోట్లు ముడ్డెనక మూలుగుతున్న చిల్లి గవ్వ కూడా ఇలాంటి విషయాలకి పెట్టలేని దౌర్భాగ్యపు దేశం నా జన్మభూమి అని నేను చెప్పుకోలేను మరి.. :( ఎంతసేపూ రాజకీయాలు, గుడ్డలిప్పుకుతిరిగే హీరోయిన్లు తప్ప మన జనాలకి ఇంకేం అక్కర్లేదు..! మన తెలుగోడు మైక్రోసాఫ్ట్ కి సి.యి.ఓ. అయ్యాడు అని సంకలు గుద్దుకుంటున్నారు జనాలు.. అక్కడేమో అమెరికా లాంటి దేశాలు మీవోడికి మేము అవకాసం ఇచ్చాం చూశారా అంటూ వెక్కిరిస్తుంటే అది మాత్రం పట్టటంలేదు. ఏం మన దేశం లో ఉన్న డబ్బు కరెక్ట్ గా ఉపయోగిస్తే ఆ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు పది పెట్టచ్చు ఒకే ఒక్క సం. లో.. దేశం దాకా ఎందుకు..? మనలో ఇలా ఫేస్ బుక్ లో లైకులు కామెంట్లు చేస్తూ కూర్చునే వాళ్ళలో ఎంతమంది ఎరోజు నేనూ ఇలాంటివి చేస్తాను అని ముందుకు వస్తారు..? మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ తొక్కా అని చెప్పకండి.. ఎం ఇప్పటి వరకూ సాధించిన వాళ్ళంత..? వాళ్ళకి లేవా ప్రాబ్లంస్..? మీకు అడుగెయ్యటానికి ధైర్యం లేదు.. అంతే.. మీరు పిరికి పందలు కాబట్టే అడుగు వెయ్యలేకపోతున్నారు అని చెప్పటానికి నేను ఏ మాత్రం సంకోచించను..చెయ్యాలి అనుకున్న వాడికి కారణాలు అక్కర్లేదు.. ఎలాగైన చెసేస్తాడు.. ఇప్పటికైనా మన దేశంలో ఈతరహా ప్రోత్సాహకర తెగింపు ఆవేసం తో కూడిన ఆలోచనా ధోరణి వస్తే దేశం బాగుపడుతుంది.. లేదా రాబోయే కాలంలో భారత్ బానిస దేశం ఐపోక తప్పదు.బానిసత్వం అంటే మళ్ళీ వేరే వాళ్ళూ పరిపాలిస్తారా అని కాదు.. మనం ఇలాగే ఉంటే ఎప్పటికైనా మన దగ్గర ఉన్న మేధావులంతా (ఇక్కడ నేను ప్రస్తావించిన "మేధావులు" మానవాళి శ్రేయస్సుకు కొత్త కొత్త పనికొచ్చే విప్లవాలు తెచ్చ్చేవాళ్ళు.. యదవ తెలివితేతలు ఉన్న వాళ్ళు కాదు.) పొరుగు దేశాలకెళ్ళిపోతే మిగిలేది చెత్తే.. సో అప్పుడు ప్రతీ చిన్న విషయానికి మనం మళ్ళీ ఇంకో దేశం మీద ఆధార పడాలి.. వాళ్ళు కనుక నిరంకుశత్వం ప్రదర్శిస్తే ఇంకేముంది బానిసలైనట్టే గా..! కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!
- సత్యం గడ్డమణుగు, 02-06-2014, 10:26pm

2 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఇప్పటికే మన వాళ్ళు , తెల్లోడికి బహు దూరపు (remote ) బానిసలుగా బ్రతికెస్తున్నారు .
    ఈ కాల్ సెంటర్లు , మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లు చేస్తున్నదేమిటి ? పేర్లు మార్చుకొని తెల్లోడి accent లో వాడి పనులు వాడు మేలుకొన్నప్పుడు చెయ్యడం, లేక, వాడేదో వాయిస్ రికార్డర్ లో వాగి, క్లుబ్బు కి పొతే, తెల్లవారి వాడు హాస్పిటల్ కి వచ్చె లోగా దాన్ని టైపు చేసి వాడి టేబుల్ మీదకు పంపటం దూరపు బానిస పని కాక మరేంటి ?

    ఇంతమంది సాఫ్టు వేరు ఇంజనీర్ లు ఉన్నా, ఇంకా, మనకంటూ ఒక ఆపరేటింగ్ సిస్టం కూడా చేసుకో లేక పోయాం.
    BOSS ఏదో ఉన్నది కాని అది పొపులర్ కాలేదు.

    బీర్లు తాగతాలు, కామెడి షోలు చూడటం లోనే యవ్వనం గడిచి పోతుంది చాల మంది కి.
    :-( Kumaraswamy Vullaganti.

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.