జనాల కన్నీరుల ఏరులలో ప్రతీకారమనే చేపలను పట్టే ఆగంతక జాలర్లు

రక్తం తాగే తోడేళ్ళ విక్రుత హీంకారాలకు, ఈనాడు
ప్రశాంతమైన నగరం రక్తపు ముద్దలతో తడిసిపోయింది..
ఎన్ని సార్లు ఎంతమంది
అభం శుభం తెలియని అమాయకుల
ప్రాణాలను బలి తీసుకున్నా
ఆ రాక్షసుల ఆకలి తీరటం లేదు..

బోసినవ్వుల పాపాయిల నుండి తాతయ్యల వరకు
ఎంతో మంది తిరుగాడే రద్దీ రోడ్లు ఒక్కసారిగా
ఎరుపు రంగు పూసుకుని కాటికి
కళేబరాలను అందించేందుకు సిద్దమయ్యాయి..

నుజ్జు నుజ్జయ్యి సగం కాలు విరిగిపోయి
తాళలేని ఆ బాధలో "అమ్మా.. నొప్పీ..
తట్టుకోలేకపోతున్నాను.. " అంటూ కోమాలోకి
చేతిలో బస్సు టికెట్టుతో ప్రయాణమయ్యింది నా సోదరి..

టీవీ లో సినిమాలు సీరియల్సు చూస్తూ మద్యలో
ఫ్లాష్ న్యూస్ బాంబ్ తో జారిపోయిన
గుండెను గట్టిగా పట్టుకుని కంగారులో
సెల్ఫోను కీపాడ్ పై తడబడుతున్న వేళ్ళను
సరిచేసుకుని "ఎలా ఉన్నావ్ రా.. " అంటూ ఎంతో మంది
అమ్మా నాన్నల హృదయాలు..

ఎవరిదీ తప్పు..??
ఎవరు దీనికి దోషులు..??
ఇలా జనాల కన్నీరుల ఏరులలో ప్రతీకారమనే
చేపలను పట్టే ఆ ఆగంతక జాలర్లదా..??
ముందే హెచ్చరిక అందినా
ఏమీ చేయలేని అసమర్ద వ్యవస్త దా..??
లేక
ఇలాంటి అసమర్ద వ్యవస్త లో
బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న
ఈ అమాయక ప్రజలదా..??

- Satyam Gaddamanugu||22-02-2013||11:00am||

1 కామెంట్‌:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.