నీ పేరు స్వామి కాదు నాయనా "భక్తి స్వామి"వి..


ఈరోజు నేను నిదుర లేచి తయారవుతుండగానే మా భరద్వాజ్ గాడు "అన్నయ్యా.. త్వరగా కానివ్వు హనుమాన్మందిర్ కి వెల్దాం" అన్నాడు. ఇంకెముంది శుభం అనుకుని ఇద్దరం త్వర త్వరగా రెడీ ఐపోయి గుమ్మం దాటామోలేదో ఒక ఆటో అతను మాకోసమే అన్నట్లు ఇంటి ముందు నిల్చుని హనుమంతునికి దణ్ణం పెట్టుకుంటూ ఉన్నాడు (ఇక్కడ కూడా ఒక హనుమాన్మందిర్ ఉందిలేండి..) ఇంక అతన్ని "ఇలా గుడికెళ్లాలి వస్తావా..??? " అంటూ ఆటో ఎక్కేసి బయల్దేరాము..
ఎక్కిన
పది నిముషాల్లో ఆటో అతను ఒక్క సారిగా ఆపేసి " దణ్ణం పెట్టుకొచ్చేస్తాను.. ఇక్కడే ఉండండి.. " అంటూ ఆటో దిగి ముందుకెళ్లాడు. తీరా చూస్తే అక్కడ ఏదో అమ్మవారి గుడి ఉంది. పోనీలే గుడే కదా అనుకున్నాము. ఇంక చూస్కోండి దారి మద్యలో ఎక్కడ గుడి కనిపిస్తె అక్కడ ఆగటం, అందరం దిగి దండం పెట్టుకుని రావటం.. "భలే ఆటొ వాడు దొరికాడు.. ఇవాళ హాయిగా దైవ దర్శనాలవుతున్నాయి" అని ఇద్దరం మనసులో అనుకుని సంతోషపడ్డాము. మొత్తానికి మేము అనుకున్న హనుమత్ కోవెల కి కూడా వెళ్ళేసి తిరుగు పయనమయ్యాము. ఈ మద్యదారిలో మా భరద్వాజ్ గాడు ఉత్సాహం ఆపుకోలేక " ఏం నాయనా ఏంటి నీ పేరు? మొత్తానికి మంచి భక్తి ఉన్నవాడివే దొరికావు పొద్దున్నే.. " అన్నాడు. అలా మొదలయ్యింది మా ముచ్చట. తన పేరు స్వామి అనీ, తనకు రోజూ ఇలా ఉళ్ళోని ప్రతీ గుడిలో దర్శనం చేసుకోవటం నిత్య కృత్యమనీ, తనకు ఇద్దరు పిల్లలనీ చెప్పుకొచ్చాడు. అందులోనూ అతను చెప్పిన ఒక మాట మత్రం నాకు బాగా నచ్చింది " దేవాలయంలోకి అలా వెళ్ళి వస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండీ.. " అని.. నిజమే కదా మరి.. భక్తి మనసులో సాత్వికాన్ని తట్టిలేపుతుంది. ఆ క్షణం లో ఆ ఆటో స్వామి లో నాకు సాక్షాత్తూ ఆ ఆంజనేయుడే కనిపించాడు. అందుకే ఆయన నిజంగా ఆటో స్వామి కాదు భక్తి స్వామి.

1 కామెంట్‌:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.