ఒంటరిగా ఒదిలి వెళ్ళిపోయిన నా స్నేహితుడి జ్ఞాపకాలతో...!

ఎప్పుడూ అమాయకం గా ఉంటూ, మనసులో కల్మషం లేని నా స్నేహితుడు హరీష్. నా చిన్నప్పటి చెలిమి వాడు... ఈమధ్యనే వాడు రైలు ప్రమాదం లో మరణించాడు... నాకు ఇష్టమైన మొదటి వ్యక్తి వాడే...
వాడి స్నేహమనే ప్రపంచంలోకి సాదరంగా ఆహ్వానించి ఒంటరిగా ఒదిలి వెళ్ళిపోయిన నా స్నేహితుడి జ్ఞాపకాలతో వాడు ఎక్కడ ఉన్నా నా ఈ ఆవేదన వినాలని కోరుకుంటూ, ఇంకో జన్మ అంటూ ఉంటె నాకు తన స్నేహాన్ని అందించటానికి నా మిత్రుడుగా రావాలని...


నా ప్రాణం నువ్వు... నా ఊపిరి నువ్వు... నా సంతోషం నువ్వు...
నా దుఖం నువ్వు... నా బాధ నువ్వు... నా ఆనందం నువ్వు...
ఇలా పూర్తిగా నువ్వే నేను గా మారిపోయాను.
కానీ ఈలోగా నువ్వే లేకుండా పోయావు...


చనిపోవాలనిపించింది... నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం గా కనిపించింది...
ఎటుచూసినా చిమ్మచీకటి అలముకుంది నా బతుకు...
 ఆగని కన్నీరు... తగ్గని భాద...!
తరగని దూరం... చెదిరిన స్వప్నం...


కానీ మరల నాకు పునర్జన్మనిచ్చావు నీవే...


ఎందుకంటే నీతో గడిపిన ఆ మధుర క్షణాలు ఇంకా నాలో సజీవంగానే ఉన్నాయి...
నీవు ఇంకా నాతోనే ఉన్నావు...
నా అంతిమ శ్వాస వరకు నాతోనే ఉంటావు నా గుండెల్లో...
నీ ఆలోచనలు ప్రతీక్షణం మేమున్నామంటూ జీవం పోస్తున్నాయి...


నీలాంటి స్నేహితుడిని నేను ఏ జన్మలోనూ వీడలేను. వీడిపోను..
ఎన్ని జన్మలున్నా నీతో స్నేహం చేయాలనీ కోరుకుంటూ...


స్నేహం మరణించదు...!
నీ స్నేహితుడు  సత్యం.

2 కామెంట్‌లు:

  1. మీ స్నేహితుడి మరణం కదిలించింది. స్నేహానికి మరణం లేదు, మీ స్నేహితుడు లేకున్నా ఆ అంతరాత్మ మీలో ఉంది. ఆ జ్ఞాపకాల్లో తను బ్రతికే ఉన్నాడు...

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇదే నా స్నేహితుడు నాకు దూరం అయ్యాడు

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.