నేనంటే
నీకెందుకంత ప్రేమ..?
నేనంటే
నీకెందుకంత మోజు..?
నీ కొంగు గాలి కూడా
సోకరాదని
అందరూ
ఆమడ దూరంలో ఉంటే,
నిన్నూ
ఈ అందమైన సృష్టిలో భాగమని
భావించటమేనా
నా తప్పు..?
ఎన్నో
కోట్ల మంది జీవరాసులలో నీకు
నేనే ఎందుకు నచ్చానూ..?
మచ్చుకకైనా
ఎవరూ చూడలేనినీ హొయలను
హంసతూలికా
తల్పం మీద పరిచి నా
ముందు
ప్రదర్శింపజేస్తున్నావు..
నన్ను ముగ్ధుడ్ని చేస్తున్నావు..
నీలో
ఏదో తెలియని మత్తుంది..
ఆ మత్తులో ఈ ప్రపంచం నాకు
తెలియకుండానే నా నుండి వీడిపోతోంది..
అందరికీ
నేను కానివాడ్నైపోతున్నాను..
అయిన
వాళ్లలో చులకనైపోతున్నాను..
ఇప్పటివరకు
ఉన్న మంచి మర్యాదలు మాయమైపోతున్నాయి..
ఐనా ఎందుకో తెలియదు, నీ మోజు మాయ
నా మీద పనిచేస్తున్నా.,
మళ్ళీ
నేనూ మనిషినే అన్న సంగతి గుర్తొచ్చినప్పుడు,
నువ్వు
పెద్ద రాక్షసిలా కనిపిస్తున్నావు..
అయినా
కూడా మళ్ళీ నా కంట
కన్నీటిని నింపి అందులోకి
దూరిపోతున్నావు..
నువ్వే నా జీవితమైపోతున్నావు..
నాకు
తెలుసు..
నాకు
మాత్రమే తెలుసు..
ఇంకెవ్వరికీ
తెలియదు..
కాదు
కాదు తెలుసుకునే వారే లేరు కదా..
ఎప్పటికైనా
నన్ను చేరే
సిరి
నీ రూపమే అని..!
అందుకే
ఈ పిచ్చి జనాలకి నీ తత్వం అర్దం
కాక
నిన్ను
ప్రేమిస్తున్న నన్ను పిచ్చివాడంటున్నారు..!
- సత్యం
గడ్డమణుగు,07-10-2013,
20:03
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి