ఏ జీన్సో, మిని స్కర్టో వేస్కొని ఒస్తే " అబ్బా.. కత్తిలా ఉంది.." అంటారు.

" అందమె ఆనందం,,, ఆనందమె జీవిత మకరందం..." అన్నాడో కవి తన పాటలో..
కానీ ఆ అందమే ఈనాడు ఎన్నో అనర్దాలకు మూలం అవుతోంది. నాగరికత, ఫ్యాషన్ అంటూ భారత స్త్రీల వస్త్రధారణ నానాటికీ దిగజారిపోతోంది. మొన్నటిదాకా సినిమాలకే పరిమితం అనుకున్న ఈ కు'సంస్క్రుతి ఈనాడు రోడ్డుమీదదాకా ఒచ్చేసింది. ఇలానే పోతే ఎన్నో వేల సంవత్సరాలుగా కట్టబడి, రక్షించబడిన భారతీయ సాంప్రదాయ గోడలు ఖచ్చితంగా కూలిపోతాయి.



ఎప్పుదో చిన్నప్పుడు సాంఘీక శాస్త్రం లో అనుకుంటా.. " ఆదిమానవుడి నుండి నాగరిక మానవుడు ఎలా ఆవిర్భవించాడో" అని పాటం చదువుకున్నను.. నేటి పరిస్తితులు చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నాగరిక మానవుడు మళ్ళీ ఆది మానవుడైపోతాడేమో..?? అదే కనుక జరిగితే  ఎందరో మహనీయులు, ఉన్నతోన్ముఖులు కలిసి దిద్దిన మన కట్టుబాట్లు బూడిదలో కలిసినట్లే.. దీనిని ఆపటానికి మన ప్రతీ ఒక్కరిలో చైతన్యం కావాలి.


నిజానికి ఈమాట చెప్తున్నానని చాలామంది నన్ను తిట్టుకుంటారేమో కానీ, ఇలాంటి విషయాలలో నిజాన్ని నిఖ్ఖచ్చిగా చెప్పటమే నాకు తెలిసిన నైజం..ఇలాంటి వ్యాసాలను ఎన్నో చదివె చాలా మంది లో " బాగా చెప్పారు", " బాగా రాసారు" అనేవారు బోలెడు మంది..మరి వారిలో ఈ విషయాలను తమ మనసులోకి ముద్రవేసుకుని నడుచుకునేవారెందరు???????

సరే.. ఈ విషయం పక్కన పెట్టండీ.. ఈ ప్రపంచమ్లో ఏదైనా అభివ్రుద్ది చెందుతోంది అంటే (అది చెడైనా, మంచైనా సరే) దానికి మనం ఖచ్చితంగా అవకాశం 100% ఇచ్చామనే లెక్క.. అలాంటప్పుడు మనమెందుకు అవకాశం ఇవ్వాలి చెప్పండి..



అంతెందుకు.. ఒకమ్మాయి చక్కగా చీర కట్టుకుని అలా ఒస్తుంటే ఎవరైనా " అమ్మయి మహా లక్ష్మిలా లక్షణం గా ఉంద" టారు.. అదే ఏ జీన్సో, మిని స్కర్టో వేస్కొని ఒస్తే " అబ్బా.. కత్తిలా ఉంది.." అంటారు.. ఒకవేళ అనకపోయినా కనీసం మనసులో అనుకుంటారు.. అలాంటి అవకాశాన్ని మనమే ఇచ్చినప్పుడు మళ్ళీ " వెధవ.. మ్యానర్స్ లేదు.. ఎలా చూస్తున్నాడో.. ఎలా మాట్లాడుతున్నాడో..." అని అనుకోవడాం ఎంతవరకు కరెక్ట్..?? (అలాగని నేను ఆ కామెంట్స్ చేసె వాళ్ళని సమర్దిస్తున్నానని అనుకోవద్దు.. మనమే సరిగా ఉంటే అనేమీ రావు కదా అనేది నా ఉద్దేశ్యం..)


ఇక సినిమాల విషయానికి ఒస్తే, మితిమీరిన శ్రుంగారం, అశ్లీల ద్రుశ్యాలు.. వాటన్నింటినీ సమర్దించుకోవడానికి  వాటికి ఐటం సాంగ్స్ అని పేరు.. ఇలాంటి వాటిని మనమే సూపర్ అంటూ హిట్ చేస్తుంటే ఇక ఆ సినిమా వాళ్ళు ఎందుకు ఆగుతారు చెప్పండీ.. మొన్నకి మొన్న కొత్తగాఅ విడుదలైన సూపర్ హిట్ తెలుగు  సినిమాలో ఐటం సాంగ్ కి "డ్యాన్స్ వేసిన అమ్మయి అవే బట్తలతో ఒక ప్రయివేటు చానల్ కి ఇంటర్వ్యు ఇచ్చింది.. దానికి ఆ చానల్ ఒక గంట సేపు ప్రసారం.. ఇక్కడ ఆ అమ్మాయి కి కానీ, ఆ చానల్ వాళ్ళకి కానీ ఇంగిత జ్ఞానం లేదనే చెప్పాలి..  ఒక సినిమాలో మన హీరో ఒకతను చెప్పిన డైలాగు గుర్తొస్తోంది..
" ఒక ఆడది తన అందాలను నాలుగు గోడల మద్య తాళి కట్టిన భర్తకి చూపించాలి కానీ, ఇలా కురచ బట్టలతో రోడ్డు మీద వాళ్ళందరికీ కాదు.."
ఈ డైలాగుతో అప్పటి వరకూ ఫ్యాషన్ డ్రస్సులు వేసిన ఆ హీరోయిం కాస్తా పూర్తిగా మారిపోయి మిగిలిన సినిమా అంతా సాంప్రదాయ దుస్తులే వేస్తుంది.

అదంటే సినిమా.. కానీ మరి ఈ "నిజం" లో ఎన్ని సార్లు చెప్తే మనలో మార్పు ఒస్తుంది???????

=================================================

ఇదంతా నెను కెవలం మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను కాపాడుకోవాలనే తాపత్రయంతో మాత్రమే చెప్పాను తప్ప ఎవరినీ బాదపెట్టాలని మాత్రం కాదు..!

16 కామెంట్‌లు:

  1. meeru pade taapatrayam ardham chesukogalam kaani meeru raasina teeru matuku chauvanistic mentality ki darpanam.....
    meeru cheppinattu samprayadayabaddamga saree kattukuni vastunna ammaini mahalakshmi la vundi anukune vallu challa takkuva mande ee rojullo.....pondika ga saree kattina comment chesevallu ekkuve endukante adi valla manovyadhiki darpanam....antekaani ammailu emi valaki avakaasam icchinattu kaadu....
    meeru paatalu nerpinchalsindi ala comment chese abbailaki.....ante kaani ammailu okkarike kaademo
    ika cinemala vishayaniki vaste chalamandi akkada chesedi living kosam....ala chestunna vallani samardhistunna ani kaadu. i agree that such acts are spoiling the people's mentality so why dont we work towards such cause and ban such movies.....boycott them and stop the viewership! ala cheste vatiki demand taggutundi alage vati influence taggutundi. directly or indirectly magavalle kada ee skimpy outfits ki kaaranam! meerenta nikkachiga mee opinion chepparo ante nikkachiga nenu na opinion cheppanu ...so pls dont take it otherwise...

    రిప్లయితొలగించండి
  2. పర్వాలేదండీ.. మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదములు..
    అయితే నెను ఇక్కడ కేవలం అమ్మయిల దే కారణం అని చెప్పలేదు...అలాగే అమ్మయిల ఒక్కరికి పాటాలు నేర్పాలనేది నా ఆలోచన కాదు.. వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను..అంతే..
    మీరు చెప్పినట్లు చీర కట్టుకున్నా కామెంట్లు చేసెవారు లేకపోలేదు.. అది వారి నీచమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.. అలాగని మన సాంప్రదాయ దుస్తుల వాడకాన్ని మర్చిపోవడం ఎంతవరకు సబబు చెప్పండి???

    ఈనాటి కాలమ్లో ఎంతమందికి చీరలు పంచెలు కట్టుకోవటం ఒచ్చు??
    అంతెందుకు.. హైదరాబాదు, చెన్నై, బాంగుళూరు వంటి పెద్ద పెద్ద నగరాలలో ఇప్పటికే మన పద్దతులు దాదాపు అంతరించిపోయయనే చెప్పచ్చు..(ఎక్కడొ కొద్దీ గొప్పా ఉందేమో)

    ఇక మీరన్నట్లు సినిమా వాళ్ళు పొట్టకూటికోసమే అల చేస్తున్నరు... కరక్టే.. కానీ అంతకు ముందు సినిమాలలో ఇలా జరగలేదెం??? ఎందుకంటే ఆ తప్పు ఇలాంటి సినిమాలు నిర్మించే వారిది, వాటిని అలాగే ఆదరించె మనది..
    మీరు అన్నట్లు ఆ సినిమాలను చూదము అని అనుకుందాం.. ఒకసారి సినిమా అంటూ మొదలయ్యాక మీరో నెనో ఒద్దు అన్నామని అన్ని కోట్లు పెత్తిన వాడు ఎందుకు ఆపుతాడు చెప్పండి.. కాబట్టి ఇక్కడ కావలసింది అలాంటి సినిమాలను అసలు నిర్మించక పోవడమే.. అదే మార్గం..
    ఏమండీ.. ఇక్కడ కేవలం ఆడవాళ్ళొ లేక కేవలం మగవాళ్ళొ కారణం కాదు.. అందరి ప్రమేయం తోనే మంచైనా,,, చెడైనా////

    రిప్లయితొలగించండి
  3. అవునండి.. మీరు అన్నది అక్షరాలా నిజం..
    ఒక అమ్మయిగా మీరు చెప్పినదానికి నెను ఏకీభవిస్తున్నను..
    మీరు చెప్పినట్లు "మనమే సరిగా ఉంటే అనేమీ రావు కదా" అది ఆడవారైనా లేక మగ వారైనా సరే మన సమాజాన్ని ఒక చక్కటి దారిలో తీసుకు వెళ్ళాలి.. మన భారతీయ సంస్క్రుతిని కాపాడాలి..

    రిప్లయితొలగించండి
  4. meeru ammailane tappu pattaru ani nenu cheppaledu but vaari nadavadika lo ne changes ravali annattuga annaru so anduke ala annanu....
    many females do know how to tie a saree but i cant vouch for guys whether they know abt dhotis or not! its just that most of us prefer suits and salwars for the comfort factor without compromising on our safety! we can see the traditional wear mostly on festivals and other occassions! ee rojullo meeru entamandi abbalilani chustaru panche kattulo????? kanisam vrata peetalu meeda kuda pant shirts ee! and exposing antara....ammaile kaadu abbailu uddandule ee vishayamlo! they dont mind pissing out in the open...doesnt see where they are or who is nearby! just relieve themselves....
    anyways its not my intention to give an argument here but the prob lies with their mentalities and outlook regarding their life and society. nenu nunchi manamu ane alochanaki maara galigite mana culture ni manam padilamga chusukunnatte....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆలోచనా సరళికి నా జోహార్లు..!
      అయితే నేను కూడా మార్పు అనేది " ఇద్దరు" తోనే సాద్యమవుతుంది అని బలంగా నమ్ముతాను..అదే దారిలో నెను చెప్పింది కొంచెం జాగ్రత్తగా గమనించండి.. నేను పైన చెప్పిన పోస్టులో కానీ లేదా నా వ్యాఖ్యలలో కానీ ఎక్కడా కూడా అమ్మయిల మార్పు మంచిది అన్నాను కానీ "కేవలం" ఆడవారే మార్పుని ఆహ్వానించాలని చెప్పలేదు. అది కూడా ప్రత్యేకంగా ఇప్పుడు మారాలి అని కూడా చెప్పట్లేదు..

      పూర్వపు ఆచారాలను మర్చిపోకుండా ఉండాలి అని చెప్తున్నను అంతే..
      ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి..!

      నెను అమ్మయిల గురించి మాట్లాడానని మీరు "అబ్బయిలది" కూడా తప్పు ఉంది అన్నారు, దానికి నేను కాదు అనను..
      కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇక్కడ నేను " అమ్మాయిల" గురించి మాట్లాడాను కానీ " అమ్మాయిల గురించి మాత్రమే" మాట్లాడానని మీరు అనుకోకండి.. ఎందుకంటే నేను అబ్బయిల ఆలోచనా తీరు మార్పు రావాలంటూ అంతకు ముందే ఒక పోస్టు రాసాను(http://naathalapulu.blogspot.in/2011/10/blog-post_14.html).. కనుక ఈసారి అమ్మయిలను ఉద్దేశించి రాయటం జరిగింది..! అంతేకానీ నన్ను మగహంకారిగా చూడకండి.

      తొలగించండి
  5. Please have a look at this picture and give your comment!

    http://www.idlebrain.com/news/functions/audio-ukup/pages/image052.html

    రిప్లయితొలగించండి
  6. వస్త్ర ధారణ గురించి మీ అభిప్రాయం బాగుంది.
    కానీ చాలా నేరాలు వస్త్రదారణ వల్లే జరగడం లేదు.అది గమనించాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం వనజ గారు.. మీరు అన్నది నిజమేనండి.. కాకపోతే నేను ఇక్కడ నేరాల గురించి నేను చర్చించలేదు.. కేవలం భారతీయ సాంస్క్రుతిక వస్త్ర ధారణ కనుమరుగైపోకుండా జాగ్రత్త పడాలి అని మాత్రమే నేను చెప్పాను..

      తొలగించండి
  7. సత్యం .. గారు.మీరు ఈ పోస్ట్ చూడండి.
    మీ ఆవేదన అర్ధం అయింది. చాలా బాగా చెప్పారు కూడా. మీరు చెప్పినదానిలో అసలు తప్పు లేదు.

    http://vanajavanamali.blogspot.in/2010/12/vanajavanamali-kavithwa-vanamlovanaja_1859.html

    రిప్లయితొలగించండి
  8. All of you above..somebody talks about Indian Culture..somebody talks about Girls dressing sence.. somebody is talking about Men's perception towards Women's dressing.. Everything is BS. You know, where the actual problem is..to know it you have to read two books. "Stree Vimukti Kosam" and "Sex to Superconscious".

    Ok Spring ni meeru gattiga vothi pattukunte.. meeru hand teeyagane adi ante force ga bounce avutundi. Mana India lo manam Sex ni tappu, ashleelam, chedu ani vathi pedutunnam.. anduke adi antha ga manushulalo prerepinchabadutundi..Manishi anduke ashleelatha vaipu anthaga moggu chuputunnadu.

    Chinnapudu leni siggu, pedda ayyaka enduku pudutundi.. Samajam adi chedu idi chedu ani nerpabatte kada. Adimanavulalo enduku siggu, ashleelatha ane padalu undavu.

    Sex and passion are the basic instincts of man. It can't be denied. When they are basic instincts, why society is suppressing it.

    All of you remember these words.. The more you suppress anything, the more it will bounce.

    Meeru matalade samasya.. oka India lone kadu prapamcham motham lo undi.. Western countries lo semi nude is common. Ikkada meeru piliche ashleela drushyam.. akkada common. Vallu ikkada drushyalani chusi common ga teesukuntaru, endukante adi akkada common ga chuse drushyalu. So.. the more you make it common, it will be less provocative.

    Khajuraho temple pai silpalu voorike chakkabadaledu. Avi 500 C.E. to 1300 C.E lo avirbhavinchavi. manam nagarikatha ani cheppukunedi antha magavallu adavallanu banisaluga vunchataniki avalambinche charyalu matrame.

    Deham magavarikaina adavarikaina srusti ichinde.. Enduku manishi nedu soundaryam lo ashleelata vetukunnadu, enduku prerepinchabadutunnadu.. endukate adi anagatokkabadindi kabatte nedu prerepanaku guri avutunnadu..

    So, dear friends.. I know you will never accept this.. but it is true.. Society Suppressing people's basic instincts is the only reason for its fight back. Never suppress it, never let it fight back. Let it flow naturally. Then, everything will be common. Nothing will be sin.

    రిప్లయితొలగించండి
  9. So, problem is not with others dressing or behaviors.. the root cause are our basic instincts. See and enjoy the way you see everything naturally. Let it flow through you heart and soul. Never think of right and wrong. Rights and wrongs are society made, not nature made.

    రిప్లయితొలగించండి
  10. సంప్రదాయం నిత్యం ప్రవహించే నది లాంటిది.అది దానితో వచ్చే వ్యర్దాలను కూడా కలుపుకుని పోవాలి.
    -తిలక్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. annam thinetappudu stones vastayi, alagani kalupuku thinestama..??
      nadiche darilo mullu kanipiste alage vati meeda naduchukuntu vellipothama..??
      inti mundu chetha peruku pothunte clean cheskokunda untama..??
      idi kuda alantide.. matter mudire varaku evariki enni cheppina ardam kaadu..

      తొలగించండి
  11. చీర లేక పంజాబీ డ్రెస్ , ఏదైనా అసభ్యంగా ఉండని వస్త్రధారణ ఉండాలి.
    " నేటి పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నాగరిక మానవుడు మళ్ళీ ఆది మానవుడైపోతాడేమో ..??" అన్నారు.
    ఆదిమానవులకు దుస్తుల గురించి తెలియదు కాబట్టి , ఆకులు చుట్టుకునేవారు. కానీ ఈనాటి కొందరు కావాలనే ఆదిమానవులలా దుస్తులు వేసుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.