ఒకటి చెప్పనా... బతుకుని బతకలేకపోవటం కూడా ఒక జబ్బే..!

ప్రపంచం లో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. కొందరికి డబ్బు సమస్య ఇతే కొందరికి జబ్బు సమస్య. పదవ తరగతి పిల్లవాడికి పరీక్షల భయం. ఇంటర్ చదివే వాడికి ఎంసెట్ ర్యాంకు కోసం పాకులాట. డిగ్రీలు చేసే వారికి ఉద్యొగం కొసం ఆరాటం. ఉద్యొగస్తులకు జీతాలు, తల్లితండ్రులకు పిల్లల చదువులు ఇంటి భాద్యతలు.. ఇలా ప్రతీ ఒక్కరూ ఎదో ఒక ఇబ్బంది.

కొంతమందికి ఎంత తిన్నా కడుపు నిండదు, అలాగే ఇంకొంతమందికి ఎంత సంపాదించినా సరిపోదు. ఈనాటి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ జీవితం, భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ప్రణాలికలు వేసుకుని డబ్బులు సంపాదించి ఇంట్లోకి అన్నీ సమకూర్చుకొవాలని ఎన్నో కలలు.. వాటి కోసం రేయింబవళ్ళూ కష్టపడి తీరా అవన్నీ మన కళ్ళముందుకి ఒచ్చాక అనుభవించటానికి మన ఒళ్ళే సహకరించదు, కొన్ని సార్లు మనమే ఉండవేమో..! మరి ఆ సంపాదించిందంతా ఎందుకు?????

ఈనాడు ఈ పోటీ ప్రపంచం లో  ప్రతీ తల్లీ తండ్రీ తమ పిల్లలకి " ఒరెయ్ బాగా చదువుకోవాలి రా.. బగా పైకి రావాలి, జీవితం లో నీకు ఎమీ లోటు రాకుండా పేద్ద ఉద్యొగం చేయాలి రా నాన్నా.." అని చెప్తున్నరే కానీ జీవితం లో " ఇవేమీ లేకపోఇనా, జీవితాన్ని ఆనదంగా గడపగలిగే" లా అసలైన జీవన మాధుర్యాన్ని తెలియజేయలేకపోతున్నరు.

ఎం.???? బంగళాలలో ఉంటేనే  ఆనందంగా ఉంటారా?? ఏ.సీ. రూంస్ లో నే సుఖంగా జీవిస్తారా??

పొద్దున్నే కాసంత సద్ది మూటకట్టుకుని కూలీ పనికి వెళ్ళి, 

పొద్దుగూకగానే ఇంటికి చేరి, 
అంత ఆవకాయ తో నాలుగు ముద్దలు సంతోషంగా తిని, 
అప్పటికే ఆడుకుని అలిసి నిద్రపోతున్న పిల్లల నుదురు పై ఒక్కసారి ముద్దు పెట్టుకుని,
హాయిగా అలా ఆరుబయట చల్లని వెన్నెలలో ఆ చందమామని చూసుకుంటూ,
రోజంతా ఇంట్లో కష్టపడే ఇల్లలి ముచ్చట్లను ఆలకిస్తూ
ఆదమరిచి నిద్రపోయే ఆ ఆనందం ప్రపంచమ్లో ఏమూలన దొరుకుతుంది????
ఎన్ని కోట్లు పెడితే మాత్రం ఒస్తుంది????

అలాగని అందరూ చదువులు మానేసి కూలీకి వెళ్ళాలని కాదు, కానీ మనకి డబ్బులొచినా, జబ్బులొచ్చినా అది మనమీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు ఈ ప్రపంచానికి టాటా చెప్తామో తెలియదు.. అలాంటప్పుడు మనకు దొరికిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ,,,

ఒకటి చెప్పనా... బతుకుని బతకలేకపోవటం కూడా ఒక జబ్బే.. ఇందాక చెప్పినట్లు బతకటం అంటే ఏ.సీ కార్లు, టచ్ సెల్లు ఫోనులు, కంప్యూటర్లు, అంతస్తులు, ఆస్తులు కావు.. ఎటువంటి బాదరబందీ లేకుండా నాలుగు మెతుకులు ఐదువేళ్ళను నోటికందించగలగటం, నలుగురితో చిరునవ్వుతో మాట్లాడగలగటం, ఎలాంటి ఆలోచనలూ లేకుండా ప్రశాంతమైన నిద్ర పోవటం, చివరకు నలుగురు నీ కోసం జీవించటమే జీవితం.

7 కామెంట్‌లు:

  1. "....ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు ఈ ప్రపంచానికి టాటా చెప్తామో తెలియదు.. అలాంటప్పుడు మనకు దొరికిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ...."
    బ్రతుకుని గురించి చక్కగా చెప్పారు. ఎలా ఉన్నా, ఏ పని చేసినా ఆనందంగా ఉండగలిగితేనే బ్రతుకుకి సంపూర్ణత. ఇది లేదు అది లేదు అంటూ జీవించే బ్రతుకున ఎన్నున్నా లేనిది ఒక్కటే "ఆనందం".

    రిప్లయితొలగించండి
  2. ముందుగా మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు..
    అంతేకదండీ మరీ... ఈ చిన్ని సత్యాన్ని గ్రహించక ఎంతోమంది తమ జీవితాన్ని నరక ప్రాయంగా మార్చుకుంటున్నారు..!

    రిప్లయితొలగించండి
  3. chala baga chepparu.. mana jeevitham aanandanga undalante manatho patu mana chuttu unnallani kuda anandanaga unchadamlo mana jeevithaniki inka sardikatha chekuruthundi..

    రిప్లయితొలగించండి
  4. మన చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి తరువాత, అసలు కనీసం మనకి మనం సంతోషంగా జీవితాన్ని గడపాలనే ఆలోచనే కలగటం లేదు.. ఎంతసేపూ ప్రతి ఒక్కరి నడవడి లో "ఇలాంటి అనవసరమైన విషయాల కి మా దగ్గర సమయం లేదు" అనే ధోరణే కనిపిస్తోంది.. అది మారిన నాడు అంతా ఆనందమే..!

    రిప్లయితొలగించండి
  5. జీవన మాధుర్యాన్ని ఎంతో చక్కగా వివరించారు సత్యం గారు.. మీరు చెప్పినట్లు ఈనాడు ప్రతీ ఒక్కరు "ఇలాంటి అనవసరమైన విషయాల కి మా దగ్గర సమయం లేదు" అనే ధోరణిలోనే బ్రతికేస్తున్నరు... మరో విషయం ఏమంటే ఇలాంటివి చెప్పేవాళ్ళు వారికి పనీ పాటా లేని వాళ్ళ లాగా కనిపిస్తారు..

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.