ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.


ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.||సత్యం గడ్డమణుగు||
***************************************

నీకు నేను ఒక పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?
అయితే ఏం పర్వాలేదు.. చరిత్రలో చూసుకుంటే
చాలామంది చరిత్రలో గొప్పవాళ్ళుగా మిగిలిపోయిన వాళ్లందరూ,
నీలాంటి వాళ్ళతో పిచ్చివాడు అని అనిపించుకున్న వాళ్ళె..!

భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన వాడు పిచ్చోడే,
భూమి మద్యలో నీళ్ళు కాదు, నీళ్ల మద్యలో భూమి ఉంది అన్నవాడు పిచ్చోడే,
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పిన వాడు పిచ్చోడె,
కట్టె పుల్లలతో ప్రయోగాలు చేసిన ఎడిసన్ ప్రయోగం సఫలం అయ్యేవరకు పిచ్చోడే,
కాంతి ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది అన్నవాడు పిచ్చోడె,

ఇలా పిచ్చివాడు అని ముద్రవేస్కున్న ప్రతీ ఒక్కడూ ప్రపంచంలో మరువలేని
గుర్తులుగా మిగిలిపోయారు..

అంతెందుకు, స్నేహితురాలికోసం ప్రాజెక్టు చెస్తున్న బుయొక్కొటేన్ ని పిచ్చివాడిగా చూశారు,
కొన్ని పదుల సం.లు ఇంటర్నెట్ ని ఏలిన ఆర్కుట్ ఆవిర్బవించింది.
క్యాంపస్ ని ఒకటి చేయాలనుకున్న జూకర్ వి పిచ్చిపనులని జైల్ కి పంపించారు,
ఫేస్బుక్ అంతర్జాతీయ అంతర్జాలాన్ని ఊపేస్తోంది..
మానసిక ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిన ముగ్గురు ఉద్యోగులను పిచ్చోళ్లకింద జమకట్టారు.. ఈరోజు వాళ్ళ ఆవిష్కరణే గూగుల్.. అది లేకపోతే ప్రపంచమే లేదు..

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు..
చరిత్రలో తోటివారిచెత నిందలు పడ్డ ప్రతీ వాడూ గొప్పవాడిగా నిలిచిపోయిన వాడే..
అలాగే నేను కూడా ఏదో ఒకరోజున ప్రతీ మానవుడూ తలచుకునే స్తాయికి ఎదుగుతాను..
నా ఈ కలని సాధిస్తాను.. నీలాంటి వాళ్ల కళ్ళకి ఒక గొప్ప "పిచ్చోడిలా" మిగిలిపోతాను.

- సత్యం గడ్డమణుగు, 13-11-2013, 16:29

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.