నా సంస్కృతి సచ్చిపోతోంది ||సత్యం గడ్డమణుగు||


పంచెకట్టు పవిత్రత ఇప్పుడు
పాత కాలపు చాదస్తంగా మారుతోంది..
నా సంస్కృతి సచ్చిపోతోంది..

పైట కొంగు దిద్దుబాటు ఎన్నో ఫ్యాషన్ల పైమెరుగులలో
కనిపించకుండా పోతోంది...
నా సంస్కృతి సచ్చిపోతోంది..

రైంస్ పోయంస్ అనుకుంటు చిన్ననాటి
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ లను
ఏనాడో పలకలమీద తుడిపేశారు..

ఫేసుబుక్కుల చిక్కులలో
లైకుల నొక్కులు నొక్కుతూ
రోజుకో నీతి వాఖ్యాన్ని పంచుకుంటు
మేము కూడా సాంప్రదాయాలకు విలువనిచ్చేస్తున్నాం
అని తెలియకుండానే ఆర్టిఫిషియల్ గా తెగ సంబరపడిపోతూ
నిజం లో అలాంటి అవకాశం వచ్చినప్పుడు
మాత్రం తమ గజి బిజి బతుకుల బిజీ లైఫుని
వంక చేసుకుని తప్పించుకునే
తలకమాసిన సన్నాసుల వైరస్ ఈరోజు
క్రమ క్రమంగా అందరికీ పాకిపోతోంది..
నా సంస్కృతి సచ్చిపోతోంది..

- Satyam Gaddamanugu , 27-02-2013, 11:19am

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.