ప్రియమైన తల్లిదండ్రులారా.. అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు

ప్రియమైన తల్లిదండ్రులారా..
ఒక్క విషయం చెప్తాను.. కాస్త ఆలకించండి..
ఈనాటి కాలం కుర్రాళ్ళు చాలా దారుణంగా ఉన్న మాట వాస్తవమే.. అబ్బాయిలు, అమ్మాయిలు  అనే తేడా లేకుండా అడ్డూ అదుపు లేని స్నేహాలు, విచ్చలవిడి ప్రేమలు, ఇలా పరిస్తితులు మరీ దిగజారిపోతున్నాయనటమ్లో  సందేహం లేదు. కనుక మన పిల్లల విషయమ్లో కాస్త జాగ్రత్తగా ఉండటమ్లో తప్పులేదు.

అయితే ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.


ఒకటి ప్రతిక్షణం బయట పరిస్తితులు , రోజులు బాలేవంటూ అనుదినం పిల్లల్ని అనుమానపు కళ్ళతో చూడటం మంచిది కాదు.
మేమేం అలా కాదు.. మా పిల్లలకి పూర్తి స్వేచ్చనిచ్చాం అని  అనుకునేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కానీ, ఆలోచనలో కూడా పొరబడి బాదపడే వాళ్ళు ఎందరో..

పిల్లలకు స్వేచ్చనిచ్చి మరీ పిల్లలేం చేస్తున్నారో , స్వేచ్చని ఎమైనా దుర్వినియోగం చేస్తున్నారా? అని లోలోపల మదనపడుతూ తెలియకుండానే పిల్లతో ప్రవర్తనలో తేడా ఒచ్చేసి ఇంటి వాతావరణాన్ని నరక ప్రాయం చేసుకుంటున్నారు చాలా మంది తల్లి దండ్రులు.
అలాగని మీ అలోచనలు తప్పని నేను చెప్పటం లేదు.

మీ ఆలోచనలు 100% మంచిదే. కానీ దాన్ని మరీ ఎక్కువ చేసుకుని అనుమానం అనే ఒక బూతాన్ని మీలో పెంచుకోవద్దు అని మాత్రమే చెప్పదలచుకున్నాను.

ఇక రెండవది,
మీ పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అని తెలిసినప్పుడు,

మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి "పలానా అతను/ఆమె నన్ను ప్రేమిస్తున్నారట"అని చెప్పినప్పుడు,
ఎవరైనా ఒచ్చి  సూటిగా మీ పిల్లల్నీ ప్రేమిస్తున్నా అన్నప్పుడూ,
ఇలాంటి పరిస్తితులు ఎదురైనప్పుడు సహజంగా కోపం తెచ్చేసుకుని,
అమ్మాయికైతే దబదబా ఇంకో సంబందం చూసి  పెళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టటమో,కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళైతే  ఎదుటి వాళ్ళ కి బెదిరింపులు ఇవ్వటం లాంటివి సహజం. అయితే ఇలాంటి సమయమ్లో కంగారు పడేకంటే, నిదానంగా ఆలోచించటం మంచిది.


ఎదుటి వాళ్ళు అమ్మాయి అయితే
నిజంగా అమ్మాయి మన వాడికి సరిపోతుందా?
వాళ్ల కుటుంబం ఎలాంటిది?
ముఖ్యంగా అమ్మాయి ప్రవర్తన మంచిదేనా?
వగైరా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

(అయితే ఇలాంటప్పుడు పరపతి చూడటం మంచిదే కానీ డబ్బూ,

ఆస్తులూ అంటూ పట్టించుకోవడం అంత కరెక్టు కాదు.)


ఒక వేళ ఎదుటి వాళ్ళు అబ్బాయి అయితే
అబ్బాయి మన అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేక పోకిరీ వేషాలు వేస్తున్నాడా?
ఒకవేళ నిజంగా ప్రేమించేవాడే అయితే భవి్ష్యత్తులో అమ్మాయిని బాగా చూసుకోగలడా?
అలా చూసుకునేందుకు అతని దగ్గర మంచి ఉద్యోగం ఉందా?
వాళ్ళ కుటుంబం ఎలాంటిది? వివరాలేంటి?
ఇంట్లొ మన అమ్మాయి సర్దుకోగలుగుతుందా?
ఇలా వగైరా వగైరా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఒకవేళ ఎదుటి వాళ్ళు మంచి వాళ్లైతే, మనకు కావాల్సిన లక్షణాలున్న వాళ్ళు అయితే సంతోషం. ఒకవేళ కాకపోతే మాత్రం అప్పుడు ఏదో ఆవేశంగా  కాకుండా మన పిల్లలను దగ్గరకు తీసుకుని ప్రేమగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. మన ఆలోచన ఏమిటో పిల్లలకు స్పష్టం గా అర్దమయ్యేలా చెప్పాలి. ఇలాంటప్పుడు ఏమాత్రం  దురుసుగా వ్యవహరించినా తరువాతి పరిణామాలు కొన్నిసార్లు ఇంటి పరిస్తితులని కలిచివేస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు జర జాగ్రత్త…!!!

ఇక అవతలి వాళ్ల సంగతంటారా.. వాళ్ల వల్ల మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ లేనంత వరకూ మనం కాస్త "ఏం జరగలేదులే"అని హాయిగా ఉండటమే మంచిది. అనవసరంగా లేని చిరాకుని నెత్తిన వేసుకోకుండా..!

ఒకవేళ ఏమైనా ఇబ్బంది  కలిగితే మాత్రం అప్పుడు ఏం చేయాలో, ఏంచేస్తే తరువాత మన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అని నిదానం గా అలోచించాలి.

మొత్తానికి నేను చెప్పొచ్చేదేంటంటే వయసుకొస్తున్న పిల్లల విషయమ్లో
ఆవేశపడి ని్ర్ణయాలు తీసుకోవడమో, అతి జాగ్రత్త పేరుతో అనుమానాన్ని పెంచుకోవడమో
రెండూ మంచివి కావు.

కాబట్టి మిత్రులారా కాస్త ఆలోచించి అడుగెయ్యండి.
( మీకు ఈ పోస్టు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే మీ స్నేహితులకూ షేర్ చేయండి.)

-మీ సత్యం గడ్డమణుగు

2 కామెంట్‌లు:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.