నేను రాసిన ఈ మొదటి పద్యం మా నాన్నకు అంకితం..!

పొద్దున్నే ఫెసుబుక్కు వాలు మీద బద్దెన గారు రాసిన
 "పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు
పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర

సుమతీ!"
అనే పద్యము చుసిన తరువాత ఎందుకో నా మదిలో మెదిలిన చిన్ని ఆలోచన..
పద్యములు రాద్దాము అని..
అందుకే నా మొట్టమొదటి పద్యాన్ని మా నాన్నగారి గురించి రాస్తున్నాను..!


================================
నేనెంతటి అదృష్ట వంతుండనో గదా
నాకియ్యంత కష్టంబేల వచ్చునోయని
ప్రతి క్షణము పరితపించెడి
తండ్రిని పొందగ, 
సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!
================================ 


"విశ్వదాభిరామ వినుర వేమ"లా.. నా పద్యాలకు 
"సత్యము తెలిపెద ఓ సత్యాన్వేషీ..!" అని పెట్టాలని అనుకున్నాను..!
ఈ నా చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను..!

3 కామెంట్‌లు:

  1. సత్యంబులను నరుల దృష్టికి దేవగ
    సత్వరంబుగా నీ చేపట్టిన కార్యంబు
    సత్ఫలితంబులనీయమని స్మరించుచుంటిని
    సత్యము తెల్పెడి ఓ సత్యాగ్రహి...!

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.