"అమ్మ" ఎంత చక్కటి మధుర భావన.......!


అమ్మ...!
ఆహా! ఎంత చక్కటి మధుర భావన......!


అమ్మ అన్న ఒక్క పదం తో ఒళ్ళు పులకరించిపోతుంది....... ఏమిటి ఆ పదానికి ఉన్న శక్తి????


ఎక్కడో ఉన్న ఆ దేవుని కోసం మనుషులు ప్రతి క్షణం తాపత్రయపడుతున్నారు కాని తన ఎదురుగ ఉన్న ప్రత్యక్షదైవం "తల్లి"ని విస్మరిస్తున్నారు ఈ ఆధునిక ప్రపంచంలో............! ఆ తల్లి లేనిదే నీవు లేవు, నేను లేను, ఈ జగమే లేదు...

తల్లియే మనకు నడక నేర్పింది మరి మనం ఎం చేస్తున్నాం...ఆ తల్లి చూపిన బాటలో నడుస్తున్నామా? ఒక్క సారి ఎవరి మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి..... మనకోసం బండెడు చాకిరీలు చేసిన అమ్మకి సేవ చేసుకునే సమయమే లేదు.....ఇది భావ్యమా?????????

అసలు "అమ్మ" అనే పధం కూడా ఆ అమ్మే కదా నేర్పింది.కాని తనతో మనకు మాటలే కరువౌతున్నాయ్,..ఎందుకు? నిర్లక్ష్యమా? బిజీ నా...ఇలా ఏది కారణం....? ఈరోజు తల్లి ని ఒక ఎదిగిన కొడుకు/కూతురు ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఇలాంటి పరిస్తితులలో కూడా ఒక్కసారి మనకి ఏదైనా దెబ్బ తగిలితే మన నోటివెంట ఒచ్చే మాట "అమ్మ"! చూసారా... నువ్వు మరచినా అమ్మ నిన్ను మరవదు, ఎప్పుడు నీ వెంటే ఉంటుంది.

"ఢిల్లీ కి రాజైన తల్లి కి కొడుకే"అన్నటు కొడుకు ఎంత పెద్ద వాడైనప్పటికి "ఎరా కన్నా...." అని ప్రేమగా పిలుస్తుంది. అలాగే కొడుకు పరిస్తితి దిగజారిపాయిందని  తల్లి ప్రేమ తగ్గదు, ఎన్నాళ్ళైన తరగని ఆస్తి "తల్లి ప్రేమ"
తల్లి తన బిడ్డలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన బిడ్డల బగారు భవిష్యత్తు కోసం ఎంత కష్టానికైన ఎదురు నిలిచి పోరాడుతుంది.అందుకే ఆ తల్లి కన్న కలల్ని నిజం చేయాలి. ఏ తల్లి రొమ్ము పాలు తాగి పెరిగామో, మనకు కష్టమొస్తే తనకే ఒచిన్దనుకుని బాదపడిందో, మనం బాగుండాలని ప్రతిక్షణం మనసారా కోరుకుంటుందో ఆ తల్లి ఋణం తీర్చికోవాలి.

9 కామెంట్‌లు:

  1. ammegaa kanagaladu antha goppa ammani!! intha kanna emi cheppagalanu!! Kallu chemarchinaa chethulu vanikinaa adi aanandamtho!! "Amma" mahima pulakarinthatho!!

    రిప్లయితొలగించండి
  2. chala bhaga cheppav amma gurinchi devudu andari dhagara vundaledu kada andhuke amma nu srustinchadu ani antaru adi nijam thalli okka biddaku janma nu echetappudu thana pranam poye paristhithi vasthundi ayina a thalli biddane korukuntundi gani thana pranam korukodu adi thalli okka goppa thanam manam mana amma ni preminchali :)

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.